For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ, ప్రేమలోని భాగాలు

|

రెండు హృదయాలను కలిపే ఒక అందమైన మార్గం కళ్ళు , ప్రేమ యొక్క అందమైన చిత్రాలను తీసి మనసులో పదిలంగా దాచుకునేలా చేస్తుంది :

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే అంతం లేని రహదారిలో నడవడమే:

ప్రతిఒక్కరికీ ప్రేమ పైన వారి అర్ధాలు వేరుగా ఉంటాయి, వారి వారి అడుగులను బట్టి అర్ధాలు మారుతుంటాయి. ప్రేమ అంటే ఒక రసాయనిక శాస్త్రమే మరి. ఒక్కసారి ఈ ప్రేమకి బానిస అయితే, వ్యసనంలా మనసుని ఆవరిస్తుంది. వారి వారి ఆలోచనా విధానాలను బట్టి, కొందరికి మంచి చేస్తే కొందరికి మాత్రం జ్ఞాపకాలను మిగులుస్తాయి.

ప్రేమ ఒక సంతోషకరమైన అనుభూతి. సంతోషం, భాధ , భావోద్వేగం, గందరగోళo అన్నిటికీ ఒక నిధి. మనశరీరం నాడీ, అస్తిపంజరం, మరియు కండరాలపై పనిచేసే భావోద్వేగ అంశాలతో కూడిన ఒకే ఒక పదం ప్రేమ. నిజం ఈ ప్రేమ గురించి మాట్లాడితే, ఎటువంటి మనిషైనా భావోద్వేగానికి గురికాక తప్పదు. ప్రతి ఒక్కరూ ఈ ప్రేమకి బానిసలే ఎప్పటికైనా.

Love And Its Various Parts

1. రెండు మనసుల కలయిక
రెండు మనసులు ఒకటవ్వడమే ప్రేమ. పరమాణువులను ప్రేమించే అణువుల లాగా, తమలో ఐక్యం చేసుకునే మనసు కలిగిఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రేమలో పడుతామో, అప్పుడు మన మనసు భాగస్వామి మనసుని ఐక్యం చేసుకుని శరీరంలోని ప్రతి భాగానికి ఒక స్పందనని కలుగజేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. ప్రేమ మరియు కోరికల స్వరాలకు నృత్యం చేసే మీ మనసు, యే విధమైన ఇతర ఆటంకాలను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండదు. అలాంటి వ్యతిరేక భావాలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది.

Love And Its Various Parts

2. శరీరంతో సాన్నిహిత్యం
శరీరo , ప్రేమని పొందడానికి మరియు ఇవ్వడానికి గల ఏకైక మార్గం. శరీరం లోని స్పందనలు ప్రేమకి మరియు ప్రేమని కలుగజేసే ప్రతి అంశానికి మద్య వారధిగా ఉండి, ప్రేమలో సాన్నిహిత్యం పెరుగుటలో సహాయం చేస్తాయి. ఇక్కడ ఒక శరీరం మరొక శరీరానికి బానిస కాదు. శరీరం లోని స్పందనలు మనసు ఆలోచించే పరిపరి విధాలపై ఆధారపడి ఉంటుంది. ఈ శరీర సాన్నిహిత్యం అనేది ప్రేమకి ప్రతిరూపం, అది మన కళ్ల ద్వారా ప్రేమని వ్యక్తపరిచేలా చేస్తుంది.

3. ఆలోచనల నిధి మనసు
ప్రేమలో పడిన మనిషి మనస్సు శాంత ప్రభావానికి లోనై, శరీరం పై కూడా నియంత్రణను చూపిస్తుంది. ఒక్కోసారి వారి ఆలోచన విధానంలో మరియు , వారి పనుల వ్యవహారాలలో మార్పులు కూడా కనపడుతాయి. ప్రేమలో ఉన్నప్పుడు మనసు మన మనసుల్ని నియంత్రించగలదు. తద్వారా ఆ మనసుకు బానిసలుగా మారుతారు. మనలోని ఈ ఆలోచనల పుస్తకమే ప్రేమ అనే డిగ్రీకి ఉత్తీర్ణతా అవకాశాలను నిర్ణయిస్తుంది. గుండె శరీరం మొత్తానికి రక్త ప్రసరణతో పాటు ప్రేమని కూడా సరఫరా చేసిన అనుభూతిని ఇస్తుంది. తద్వారా మెదడు నిండా ప్రేమ ఆవరించుకుని పోతుంది.

Love And Its Various Parts

4. హార్మోన్ల ప్రభావం
మనసులోని భావాలు తమ పనితనాన్ని హార్మోన్ల ద్వారా చూపిస్తాయి . ఈ భావాలు హార్మోన్లను ఆయుధాలుగా వాడుకుంటాయి. ఎప్పుడైతే మీ ప్రేమ మీ కళ్ల ముందు నిలబడుతుందో , ఆ భావనలు కళ్లనుండి మెదడుకి వెళ్ళే ప్రక్రియలో హార్మోన్లు ఎంతగానో ప్రభావితం చేస్తాయి.


5. అపరిచిత భావోద్వేగం
మీ ప్రేమ ఎదురుగా ఉన్నప్పుడూ, మీ మనసులో చంద్రుడు, అతని చుట్టూతా ఉన్న నక్షత్రాల వెలుగుల వంటి భావాలు కనపడకపోతే, అది ప్రేమ కానే కాదు. ఒక్కసారి ఒకరి పై ప్రేమ కలిగితే, మీ హృదయం వారితోనే ఉండిపోతుంది , లేదా వారిలో ఐక్యం అయిపోతుంది. ఎంతగా అంటే , తిరిగి మీదగ్గరకు రాని విధంగా. ప్రేమతో పాటు వచ్చే ఈ అసంగతమైన భావోద్వేగాలు మనకు యాచించే భావాలుగా మిగులుతాయి. ఇలాంటి భావోద్వేగాలు ప్రేమ పేరుతో మన ఆలోచనలకు విరుద్దంగా కూడా కొన్ని పనులు చేస్తాయి.

Love And Its Various Parts

6. శృంగారo
ప్రేమ అనేది కలిగినప్పుడు, ప్రేమలోని కొన్ని మధురమైన క్షణాలు శృంగారాన్ని కూడా ఒక అతిధిగా ఆహ్వానిస్తాయి. ఒకరకంగా ప్రేమని పెంచే సాధనం కూడా శృంగారమే అవుతుంది. మనం వారి ఆలోచనలకు ఎలాంటి విలువని ఇస్తున్నాం అన్న ప్రశ్న నివృత్తికి కూడా శృంగారమే కేంద్రబిందువు అవుతుంది.

మనకు ప్రేమ మరియు దాని ఆలోచనలపై నియంత్రణ ఉండదు. ప్రేమ అనేది ఒక సముద్రం, అందులో పరిమితులు అంటూ లేవు . ప్రేమ దేవుడిచ్చిన ఒక వరం , ఈ ప్రేమకి ప్రధాన ద్వారం మాత్రం కళ్లే అవుతాయి.

English summary

Love And Its Various Parts

What is love? How does it happen? There are so many questions in our mind we still seek answers for. Love is the essence of our soul and the various parts of love is in this article. Love is the virtue of god that was given as a gift to humans.Everyone has a different meaning when it comes to love. Love is the chemistry of atoms.
Story first published:Monday, March 19, 2018, 16:20 [IST]
Desktop Bottom Promotion