Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అమ్మాయిలతో సెక్స్ చేస్తున్నట్లు కలలు, నిద్రలోనే వీర్య స్కలనం, ఏం చెయ్యమంటారు
ఆ కలలు వచ్చినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. ఎలా అంటే అలా ప్రవర్తిస్తాను. కానీ నాకు ఏమీ గుర్తు ఉండదు. చివరకు వీర్యం స్కలనం పూర్తయ్యాక మళ్లీ మామూలు మనిషిని అయిపోతున్నాను. అయితే ఇలా నిద్రలో వీర్యం..
ప్రశ్న : నా వయస్సు 18 సంవత్సరాలు. నేను ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటున్నాను. నాకు రోజూ రాత్రి ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. దీంతో నాకు తెలియకుండానే వీర్యం స్కలిస్తున్నాను. ఇక నాకు తెలియకుండా నేను నిద్రలో ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నానని నా ఫ్రెండ్స్ చెప్పారు.

అందమైన అమ్మాయిలతో సెక్స్ చేస్తున్నట్లు
"ఒరేయ్ నువ్వు రోజూ రాత్రి నిద్రపోయాక పిట్స్ వచ్చిన వాడిలా బెడ్ మొత్తం తిరిగిపోతుంటావు. మేము ఎంత పిలిచినా పలకవు. చివరకు నీ అంతకు నువ్వే మళ్లీ సైలెంట్ గా పడుకుంటావు" అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఆ సమయంలో నేను అందమైన అమ్మాయిలతో సెక్స్ చేస్తున్నట్లు కలలు కంటూ ఉంటాను.

నేను అస్సలు తట్టుకోలేను
ఆ కలలు వచ్చినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. ఎలా అంటే అలా ప్రవర్తిస్తాను. కానీ నాకు ఏమీ గుర్తు ఉండదు. చివరకు వీర్యం స్కలనం పూర్తయ్యాక మళ్లీ మామూలు మనిషిని అయిపోతున్నాను. అయితే ఇలా నిద్రలో వీర్యం స్కలించడం వల్ల నేను చాలా వీక్ అయిపోతున్నాను. ఈ సమస్య నుంచి గట్టెక్కే మార్గం చెప్పండి.

నిద్రలోనే వీర్య స్కలనం
సమాధానం : సాధారణంగా చాలామందికి యువకులకు నిద్రలో వీర్య స్కలనం అవుతూ ఉంటుంది. అదేమీ పెద్ద సమస్య కాదు.
సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదంటే శరీరంలో సెక్స్ కు సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఇలా నిద్రలోనే వీర్య స్కలనం అవుతూ ఉంటుంది.

అలాంటి వారితో కలలో సెక్స్
సాధారణంగా పగటి పూట ఎవరితోనైనా మీరు సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి వారితో రాత్రి సమయంలో కలలో సెక్స్ చేస్తున్నట్లు కలగంటారు. ఇక మీకు ఇష్టమైన ఆమెతో సెక్స్ చేస్తున్నట్లుగా ఫీలై చివరకు వీర్యాన్ని స్కలిస్తారు. దీని వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు.

వేస్ట్ అయిపోతుందని భయపడకండి
వీర్యం వేస్ట్ అయిపోతుందని భయపడకండి. దాని వల్ల మీకు ఎలాంటి నష్టం కలగదు. శరీరం నుంచి విడుదలయ్యే టెస్టోస్టీరాన్ల వల్ల ఇలాంటి కోరికలు కలుగుతాయి. అయితే నిద్రలో వీర్యం స్కలించడం వల్ల మీరు ఎలాంటి బలహీనతకు గురికారు. ఇదేమీ సమస్య కాదు.

కలలు కన్నప్పుడుగానీ
హస్త ప్రయోగం చేసుకునే సమయంలోగానీ, నిద్రలో కలలు కన్నప్పుడుగానీ వీర్యం స్కలించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి.



Click it and Unblock the Notifications