Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Breakup: విడిపోవడానికి కారణమయ్యే 3 ముఖ్యమైన విషయాలివే
ప్రేమ బంధం అయినా లేదా పెళ్లి బంధం అయినా ఈ రోజుల్లో కొన్ని నెలలు లేదా కొద్ది సంవత్సరాలు మించి కొనసాగడం కష్టమైపోయింది. చిన్న చిన్న కారణాలకే బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం కామన్ అయిపోయింది. సంబంధాన్ని ఎక్కువకాలం సజావుగా కొనసాగించడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయడం చాలా ముఖ్యం. అయితే సంబంధంలో లేదా రిలేషన్ లో ఉన్న సమయంలో కొన్ని చిన్న తప్పులు మీ సంబంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. మీ సంబంధం విడిపోయే అంచుకు చేరుకోకూడదని మీరు కోరుకుంటే, మీరు వీలైనంత త్వరగా ఈ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
ఎల్లప్పుడూ లోపాలను లెక్కించడం
ప్రతి మనిషిలోనూ లోపాలుంటాయి. కానీ ప్రేమ బంధంలో ఉన్నప్పుడు కేవలం భాగస్వామి తప్పులనే వెతుకుతూ వాటినే ఎత్తిచూపడం వల్ల బంధంలో అనురాగం స్థానంలో విసుగు, నిరాశ చోటుచేసుకుంటాయి..సంబంధంలో దూరం ఏర్పడుతుంది. మీ భాగస్వామి చేసిన పనులలో మంచిని చూడండి, వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించండి. విమర్శించే ముందు ఒక్కసారి ప్రశంసించడానికి ప్రయత్నించండి. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అనే ఒక్క చిన్న మాట చాలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి. మీ జీవితంలో వారి ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు వ్యక్తపరచాలి.

శ్రద్ధగా ఆలకించడం నేర్చుకోండి
సగానికి పైగా తగాదాలు ఒక భాగస్వామి మరొక భాగస్వామి మాట సరిగ్గా వినకపోవడం వల్ల జరుగుతాయి. భాగస్వామి ఏదైనా చెబుతున్నప్పుడు ఫోన్ చూడటం, ఇతర పనులలో నిమగ్నమవ్వడం వంటివి వారిని అవమానించడంతో సమానం. అది వారి మాటలకు మీరు విలువ ఇవ్వడం లేదనే భావనను కలిగిస్తుంది కాబట్టి వారు మాట్లాడేటప్పుడు మీ పూర్తి ఏకాగ్రతను వారిపైనే పెట్టండి. కేవలం మాటలనే కాదు వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మంచి శ్రోతలుగా మారడానికి ప్రయత్నించాలి..దీంతో మీ బంధానికి మీరే బలమైన రక్షణ కవచం నిర్మించుకున్నట్లవుతుంది.
చెప్పకుండానే అర్థం చేసుకోవాలనే అత్యాశ వద్దు
తరచుగా చాలామంది ఊహించడం అనే పొరపాటు చేస్తారు. మీ భాగస్వామి మీ మనసులోని మాట చెప్పకుండానే మీరు చెప్పేది అర్థం చేసుకున్నారని మీరు అనుకోవడం ప్రారంభిస్తారా? అయితే మీ ఈ తప్పు కారణంగా మీ మధ్య అంతరం ఏర్పడి దూరం పెరుగుతుంది. ఎవరూ మనసు చదివే మాంత్రికులు కారు. మీకేం కావాలో, మీరెలా భావిస్తున్నారో, మీ అంచనాలేంటో స్పష్టంగా, ప్రేమగా చెప్పనంత వరకు ఎదుటివారికి తెలియదు. చెప్పకుండానే అర్థం చేసుకోవాలనే అత్యాశ అపార్థాలకు, అనవసరమైన వాదనలకు దారితీస్తుంది. మీ భావాలను నిర్మొహమాటంగా పంచుకోండి. స్పష్టమైన సంభాషణే బలమైన బంధానికి పునాది అని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications