Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జీవితం హాయిగా ఉండాలంటే ఈ 3 మార్పులు తప్పక చేసుకోవాల్సిందే!
జీవితంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. అయితే అందరూ కామన్ గా కోరుకునేది ఏంటంటే కొద్దిగా ప్రశాంతత, మనసుకు హాయి. మనం ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, రోజు చివరలో మనసు ప్రశాంతంగా లేకపోతే అవేవీ వృథానే అనిపిస్తుంది.
అయితే హాయి అనేది ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు, అది మన ఆలోచనా విధానంలోనే ఉంటుంది. కానీ తెలియకుండానే మనం మన భుజాల మీద అనవసరమైన బరువులను మోస్తూ, మన సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటుంటాం. మీరు నిజంగా హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవించాలనుకుంటున్నారా? అయితే మీ లైఫ్ స్టైయిల్ లో, ఆలోచనల్లో మూడు మార్పులు చేసుకుని చూడండి. అద్భుతమైన మార్పు మీకే తెలుస్తుంది.

ఇతరుల మూడ్ బాధ్యత మీది కాదు
చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే..తమ చుట్టూ ఉన్నవారి ఎమోషన్స్ కి తమని తాము బాధ్యులుగా చేసుకోవడం. మీ ఫ్రెండ్స్ ఎవరో బాధగా ఉన్నా, ఇంట్లో వాళ్లు కోపంగా ఉన్నా, లేదా మీ పార్ట్నర్ మూడ్ బాలేకపోయినా.. వెంటనే నేను ఏదో ఒకటి చేసి వారిని సంతోషపెట్టాలి, వారి సమస్యను నేనే ఫిక్స్ చేయాలి అని కంగారు పడిపోతుంటారు.
ఎదుటివారి పట్ల సానుభూతి చూపించడం మానవత్వం. కానీ వారి భావోద్వేగాలను మీ నెత్తిమీద వేసుకోవడం అనారోగ్యం. ఎవరి సంతోషానికైనా, ఎవరి దుఃఖానికైనా వారే బాధ్యులు. అవతలి వ్యక్తి మూడ్ ఆఫ్ లో ఉంటే, వారికి స్పేస్ ఇవ్వండి లేదా వినండి. అంతే తప్ప వారిని నవ్వించే బాధ్యత, వారి సమస్యలను మాయం చేసే బాధ్యత మీది కాదు.
మీరు ఒక ఎమోషనల్ మెకానిక్ కాదు. అందరినీ రిపేర్ చేయలేరు. ఎప్పుడైతే ఎవరి మూడ్ ని, ఎవరి హ్యాపీనెస్ ని వాళ్లే చూసుకోవాలి అనే సత్యాన్ని మీరు గ్రహిస్తారో అప్పుడు మీ మనసుపై ఉన్న సగం భారం దిగిపోతుంది. మీ ప్రశాంతత అవతలి వారి ప్రవర్తనపై ఆధారపడి ఉండకూడదు.
గతాన్ని తవ్విపోసుకోవడం ఆపేయండి
ఆ రోజు నేను అలా ఎందుకు చేశాను?, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, వాళ్లకు అలా సమాధానం చెప్పి ఉండాల్సింది. ఇలాంటి ఆలోచనలు కరెక్ట్ కాదు. గతం అనేది జరిగిపోయిన ఒక అధ్యాయం. దాన్ని మనం మార్చలేం. జరిగిపోయిన విషయాల గురించి మిమ్మల్ని మీరు నిందించుకోవడం, తిట్టుకోవడం వల్ల ఈ క్షణం వృథా అవ్వడం తప్ప, ఆ గతం మారదు.
పగిలిన అద్దాన్ని చూస్తూ కూర్చుంటే అది అతుక్కోదు, పైగా చేతులు కోసుకుంటాయి. గతంలో చేసిన తప్పుల గురించి పదే పదే ఆలోచించడం వల్ల వచ్చేది మనశ్శాంతి కాదు, ఆత్మన్యూనత. దీనికి పరిష్కారం ఒక్కటే..మైండ్ ఫుల్ నెస్. అంటే ఈ క్షణంలో జీవించడం. గతం మీ కంట్రోల్ లో లేదు, భవిష్యత్తు మీ చేతుల్లో లేదు. మీ కంట్రోల్ లో ఉన్నది కేవలం ఇప్పుడు.

కాబట్టి జరిగిపోయిన వాటిని వదిలేసి, ఇక నుంచి నేను ఏం చేయగలను? ఇప్పుడు నా చేతుల్లో ఏముంది? అనే దానిపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. గతం తాలూకు బరువును దించేస్తేనే వర్తమానంలో హాయిగా ప్రయాణించగలరు.
అందరి మెప్పు కోసం ఆరాటం వద్దు
మీరు అందరికీ నచ్చినట్లు ఉండాలనుకోవడం ప్రపంచంలోకెల్లా అత్యంత కష్టమైన పని. నేను ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో?, ఇలా ఉంటేనే నలుగురూ మెచ్చుకుంటారు అని మీ ఇష్టాలను చంపుకుని, వేరే వారి కోసం బ్రతకడం ఒక రకమైన బానిసత్వం.
మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది అందరినీ మెప్పించడానికి కాదు. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత గొప్పగా చేసినా, ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. అందరి అప్రూవల్ కోసం పాకులాడటం వల్ల మీ ఎనర్జీ అయిపోతుంది. మీరు కాని వ్యక్తిగా నటిస్తూ పొందే చప్పట్ల కంటే, మీలా మీరుంటూ పొందే చిన్న ప్రశంస చాలా గొప్పది.
అందరి మెప్పు పొందాలనే ఆలోచన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. మీకు నచ్చినట్లుగా, మీ విలువలకు కట్టుబడి జీవించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఇష్టపడతారో, ఎవరు గౌరవిస్తారో వారితోనే స్నేహం చేయండి. నాకు నచ్చినట్లు నేనుంటాను, నన్ను అర్థం చేసుకునేవాళ్లు నాతో ఉంటారు అనే స్పష్టత మీకు వచ్చిన రోజు, మీ జీవితం చాలా తేలికగా, హాయిగా మారుతుంది.



Click it and Unblock the Notifications