Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శృంగారంలో పాల్గొనే ముందు అస్సలు చేయకూడని పనులివే
వైవాహిక బంధంలో శృంగారం ఒక మధురమైన ఘట్టం. శృంగారం అనేది శారీరక కలయిక మాత్రమే కాదు..ఇద్దరు వ్యక్తుల మధ్య మానసిక బంధాన్ని బలోపేతం చేసే ఒక అద్భుతమైన అనుభూతి. మాటల్లో చెప్పలేని భావాలను, ప్రేమను పంచుకునే సన్నిహితమైన క్షణాలవి. అయితే ఇంతటి ముఖ్యమైన అనుభవాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం. తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు ఆ మధురానుభూతికి ఆటంకం కలిగించవచ్చు. మీ లైంగిక జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడానికి, శారీరక సాన్నిహిత్యానికి ముందు ఏ పనులకు దూరంగా ఉండాలో ఇక్కడ చూడండి.
దీనిని నిర్లక్ష్యం చేయకండి
శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య గౌరవానికి, ప్రేమకు ప్రతీక. ఈ సమయంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. స్నానం చేయకుండా కలయికలో పాల్గొనడం సరికాదు. ఇది మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయడమే కాకుండా, మీ భాగస్వామికి కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఒక వెచ్చని నీటి స్నానం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరుస్తుంది. శరీర దుర్వాసనను దూరం చేసి, తాజాదనపు అనుభూతినిస్తుంది. ముఖ్యంగాపరిశుభ్రంగా ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

కడుపు నిండా భోజనం
సంభోగంలో పాల్గొనే ముందు కడుపునిండా బిర్యానీలు, మసాలా వంటకాలు లాగించేయకండి. కడుపు నిండా తిన్నప్పుడు మన శరీరంలోని రక్త ప్రసరణ అధికంగా జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. దీంతో శరీరం బద్ధకంగా, మత్తుగా తయారవుతుంది. ఉత్సాహం తగ్గి, లైంగిక శక్తిపై ప్రభావం పడుతుంది. దీనికి బదులుగా తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. సూప్ లేదా కొన్ని పండ్లు తినవచ్చు. ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క అద్భుతంగా పనిచేస్తుంది. చాక్లెట్ మన మెదడులో సెరోటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మీలో ఉత్సాహాన్ని నింపి, మూడ్ ను రెట్టింపు చేస్తుంది.
మత్తులో మునిగితే
శృంగారానికి ముందు మద్యం సేవించడం వల్ల తాత్కాలికంగా ధైర్యం వచ్చినట్లు అనిపించవచ్చు కానీ అది మీ అనుభూతిని దెబ్బతీస్తుంది. మద్యం మన నరాల స్పందనలను మందగింపజేస్తుంది. దీనివల్ల స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. మీ భాగస్వామి స్పర్శను మీరు పూర్తిగా ఆస్వాదించలేరు, మీ స్పందనలు కూడా నెమ్మదిస్తాయి. ఫలితంగా శృంగారం యాంత్రికంగా మారిపోతుంది. ఆ క్షణంలోని నిజమైన అనుబంధాన్ని, భావోద్వేగాలను కోల్పోతారు. కాబట్టి మత్తులో మునిగి ఆ మధురానుభూతిని దూరం చేసుకోకండి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ శృంగార జీవితం మరింత ఆనందంగా, సంతృప్తికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications