Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రపోజ్ చేస్తుంటే నో చెప్పేస్తున్నారా? ఈ 4 తెలుసుకున్నారంటే ఏ అమ్మాయి అయినా ఇంప్రెస్ అయిపోతది!
సాధారణంగా ఏదైనా రిలేషన్ లోకి అడుగుపెట్టే ముందు అమ్మాయిలు తన లైఫ్ లోకి వచ్చే వ్యక్తి నిజాయితీగా ఉండాలి, తనను ప్రేమగా చూసుకోవాలి, అర్థం చేసుకునేవాడు అయ్యి ఉండాలి అని కలలు కంటారు.అయితే తరచుగా అబ్బాయిలు చేసే కొన్ని చిన్నపొరపాట్లు, కొన్ని అలవాట్లు వారి మధ్య దూరం పెంచుతాయి. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే, వారితో మీ బంధం కలకాలం నిలవాలని కోరుకున్నట్లయితే రిలేషన్ షిప్ స్టార్ట్ చేయకుందే 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. తద్వారా మీ బంధం భారత్ -ఇజ్రాయెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఆ నాలుగు ముఖ్య విషయాలు ఇవే
1. ఆధిపత్యం చెలాయించకూడదు
సాధారణంగా ఏ అమ్మాయి అయినా తమను కంట్రోల్ చేయడం లేదా నియంత్రించే వారిని అస్సలు ఇష్టపడదు. ముఖ్యంగా ప్రతిదీ అనుమానంగా చూస్తే అంటే అమ్మాయి కదలికలు ఎప్పుడు గమనిస్తుండటం ఆము ఫోన్ చెక్ చేయడం, ఆమె ఎటు వెళ్లాలన్నా ఆంక్షలు విధించడం, ప్రతి విషయంలోనూ మీ మాటే నెగ్గాలనే ధోరణి కలిగి ఉంటే అది అమ్మాయిలను మీ నుండి దూరం చేస్తుంది. రిలేషన్ షిప్ లో ఇద్దరికీ సమానమైన ప్రధాన్యత ఉండాలి, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించినప్పుడే అంతా సాఫీగా జరుగుతుంది. లేదంటే అమ్మాయి మీకు బైబై చెప్పేసి వెళ్లిపోతుంది.

2. తనను తాను గొప్పగా చెప్పుకోవడం
సాధారణంగా చాలామంది అబ్బాయిలు..అమ్మాయిల ముందు బిల్డప్ కోసం రకరకాల అబద్దాలు చెబుతుంటారు. కొన్నిసార్లు అయితే ఆ మాటలు నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా సరే చెప్పడం ఆపరు. అయితే పొరపాటుగా ఆ మాటలు అన్నీ తుస్సే అని తేలిందా ఇక ఆమ్మాయి మీకు బైబై చెప్పేయడం గ్యారెంటీ. ఎందుకంటే ఏ రిలేషన్ అయినా నమ్మకం మీద ఆధారపడి ఉంటది. తమను గౌరవించని వ్యక్తితో జీవితాన్ని పంచుకోడానికి ఏ అమ్మాయి ఇష్టపడదు. నిజాయితీగా ఉంటే స్టార్టింగ్ లో కొన్ని గొడవలు అయినా కూడా క్రమంగా మీ బంధం ఉక్కులా బలపడుతుంది.
3. స్వార్థపూరిత ప్రవర్తన
స్వార్థపూరితంగా ప్రవర్తించేవాళ్లను అమ్మాయిలు అరక్షణం కూడా భరించలేదు. ఎప్పుడూ నీ స్వార్థం నీదే అనేలా ఉండకూడదు. నీ ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తూ ఆ అమ్మాయి మనసులోని మాటలకు అంతే గౌరవం ఇవ్వాలి. రిలేషన్ లో ఎప్పుడూ మనం అనే భావన ఉంటేనే ఆ బంధం నూరేళ్లు బలంగా ఉంటుంది. హెల్దీ రిలేషన్ షిప్ కు ముఖ్య సూత్రం ఇదే. నిజమైన ప్రేమ బంధం ఒక మధురమైన పాటలాంటిది. ఇద్దరి గొంతులు కలిసి ఒకే రాగాన్ని పలికినప్పుడే ఆ పాట వినడానికి బాగుంటుంది. లేదు నేను మోనార్క్ ని నా స్వార్థం నాదే అనే రీతిలో ఉంటే ఏ అమ్మాయి మిమ్మల్ని తన లైఫ్ లోకి అనుమతించదు.
4.కమ్యునికషన్
ఏ రిలేషన్ కి అయినా మంచి కమ్యునికేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే రిలేషన్ షిప్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఈ ప్రయాణంలో ఇద్దరి హృదయాలను కలిపేది మాటల వంతెను. ఒక వేళ మీ మనసులోని భావాలను మీరు సరిగ్గా వ్యక్తపర్చలేకపోయినా, ఎదుటివ్యక్తి మాటలను శద్ధగా వినకపోయినా, చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగుతుంతే ఆ వంతెన బలహీనపడతుంది. చివరికి అది కూలిపోయి బంధం మొదట్లో ముగిసే ప్రమాదం ఉంది. ప్రేమలో గెలవాల్సింది వాదనలో కాదు..ఒకరి హృదయాన్ని మరొకరు అర్థం చేసుకోవడంలో అని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications