Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పెళ్ళైన కొత్తలో ఉన్న కిక్ మళ్ళీ కావాలా? రాత్రిపూట భాగస్వామికి ఈ 5 కొంటె ప్రశ్నలు వేయండి!
ప్రస్తుతం అందరి లైఫ్ లు మెషీన్ల మాదిరి అయిపోతున్నాయి. పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా ఉరుకులు పరుగులతో మనం మెషీన్లలా మారిపోయాం. ఇంట్లో బాధ్యతలు, ఆఫీసులో వర్క్ టార్గెట్లు, ట్రాఫిక్ కష్టాలు వీటన్నింటితో మన కోసం మనం కొంత సమయం కేటాయించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇదే క్రమంలో భాగస్వామితో సమయం గడిపేందుకు కూడా చాలామందికి టైం దొరకటం లేదు. ఆఫీసులో లేదా ఇతర పనులకో వెళ్లి పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే కొందరు టీవీకో లేదా మొబైల్ ఫోన్ కో అతుక్కుపోతున్నారే తప్ప పక్కన ఉండే భాగస్వామి గుండె చప్పుడును వినలేకపోతున్నారు. ఫలితంగా బంధాల్లో దూరం పెరుగుతోంది.

ఈ పరుగుల జీవితంలో కాస్త విరామం దొరికేది ఆ రాత్రి వేళలోనే. అందుకే చాలామంది జంటలు తమ బంధాన్ని కాపాడుకోవడానికి అర్థరాత్రి ఏకాంతంగా మాట్లాడుకుంటారు.
ఈ చలికాలపు రాత్రుల్లో వెచ్చని దుప్పటి కింద మీ భాగస్వామితో జరిపే చిన్న సంభాషణ మీ బంధాన్ని ఎంతో బలపరుస్తుంది. రాత్రిపూట మీ భాగస్వామిని పలకరించేందుకు మాటలు దొరకడం లేదా? అయితే ఈ 5 కొంటె,రొమాంటిక్ ప్రశ్నలను అడిగి చూడండి. అవి మీ మధ్య ఉన్న మౌనాన్ని పటాపంచలు చేసి, ప్రేమను రెట్టింపు చేస్తాయి.
ఈ క్షణం నాతో ఎలా గడపాలని ఉంది?
ఇది కొంచెం కొంటె ప్రశ్న. ఆఫీసు టెన్షన్లు అన్నీ పక్కనబెట్టి ఇప్పుడు, ఈ క్షణంలో నాతో ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడగండి. వారి సమాధానం ఆ రాత్రిని మరింత రంగులమయం చేస్తుంది.
మన జర్నీలో నువ్వు మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకునే క్షణం ఏది?
ఇది కేవలం ప్రశ్న కాదు, జ్ఞాపకాలను నెమరవేసుకునే ఆనంద క్షణం. అది మీరు ఒకరినొకరు తొలిసారి చూసుకున్న క్షణం కావచ్చు, మొదటిసారి తాకిన స్పర్శ కావచ్చు లేదా పెళ్ళైన కొత్తలో గడిపిన మొదటి రాత్రి కావచ్చు. ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకోవడం వల్ల మీ ఇద్దరిలోనూ తెలియని కొత్త ఉత్సాహం పుడుతుంది. ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తాయి.
నా రాకతో మీ జీవితం ఎలా మారింది?
నేను మీ జీవితంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులేంటి అని అడగండి. దీనికి వచ్చే సమాధానం మీ బంధం విలువను తెలియజేస్తుంది. బహుశా మీ వల్ల వారిలో సహనం పెరిగి ఉండవచ్చు లేదా బాధ్యతగా ఉండటం అలవాటు అయ్యి ఉండవచ్చు. ఇలాంటి సానుకూలమైన మాటలు మీ మీద వారికి ఉన్న గౌరవాన్ని, ప్రేమను బయటపెడతాయి.

మీలో దాగి ఉన్న ఆ సీక్రెట్ కోరిక ఏంటి?
ప్రతి ఒక్కరికీ కొన్ని తీరని కోరికలు ఉంటాయి. అవి శృంగారపరమైనవి కావచ్చు లేదా భవిష్యత్తు లక్ష్యాలు కావచ్చు. మనమిద్దరం కలిసి చేయాలని మీరు కలలు కంటున్న పని ఏది? అని అడగండి. అది ప్రపంచ పర్యటన కావచ్చు లేదా మీతో గడపాలనుకుంటున్న ఒక రొమాంటిక్ సాయంత్రం కావచ్చు. వారి కలలను పంచుకోవడం వల్ల మీ బంధం మరింత గాఢమవుతుంది.
జీవితం అంటే ఏమిటి?
ఇది కాస్త తాత్వికంగా అనిపించినా, చాలా లోతైన ప్రశ్న. మీ భాగస్వామి రొమాంటిక్ అయితే నువ్వే నా జీవితం, నీ కోసమే నా ప్రయాణం అని చెప్పవచ్చు. ఒకరి కోసం ఒకరు బతుకుతున్నామనే భరోసా, ఈ కాలంలో చాలా అవసరం. ఈ సమాధానం మీ ఇద్దరినీ మానసికంగా దగ్గర చేస్తుంది.



Click it and Unblock the Notifications