Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నిద్రపోయే ముందు మీ పిల్లలను ఖచ్చితంగా అడగాల్సిన 5 ప్రశ్నలు
నేటి బిజీ లైఫ్ లో తల్లిదండ్రులు ఎన్నో పాత్రలను పోషిస్తుంటారు. ఆఫీసులో టార్గెట్లు, ఇంట్లో బాధ్యతలు, సామాజిక ఒత్తిడుల మధ్య పిల్లలతో గడిపే అమూల్యమైన సమయం ఆవిరైపోతోంది. వారి కడుపు నింపుతున్నారు, మంచి బట్టలు కొనిస్తున్నారు, ఖరీదైన చదువులు చెప్పిస్తున్నారు కానీ వారి మనసు లోతుల్లోకి తొంగి చూస్తున్నారా? రోజంతా పనిమనిషితోనో, నాలుగు గోడల మధ్య ఒంటరిగానో గడిపే ఆ చిన్ని హృదయం ఏం కోరుకుంటోందో గ్రహిస్తున్నారా?
శారీరక ఆరోగ్యానికి మనం ఇచ్చే విలువే మానసిక ఆరోగ్యానికీ ఇవ్వాలి. చాలామంది పిల్లలు చెప్పలేని బాధతో, పంచుకోలేని ఒంటరితనంతో మౌనంగా కుమిలిపోతున్నారు. ఈ మౌనాన్ని బద్దలు కొట్టడానికి, మీకూ మీ పిల్లలకూ మధ్య ఓ అద్భుతమైన బంధాన్ని నిర్మించడానికి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కేవలం పది నిమిషాలు కేటాయించి వారిని ఐదు ప్రశ్నలను అడగండి. ఇవి కేవలం ప్రశ్నలు కావు, మీ పిల్లల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లే తాళం చెవులు.

ఈ రోజు నీ ప్రపంచం ఎలా గడిచింది బంగారం?
రోజంతా ఏం చేశావు? అని అడగడం కన్నా ఈ ప్రశ్న వారిని హీరోగా భావించేలా చేస్తుంది. స్కూల్ లో పొందిన మెప్పు, ఫ్రెండ్స్ తో ఆడిన గేమ్, టీచర్ చెప్పిన పాఠం, వారిని నవ్వించిన సంఘటన.. ఇలా వారి రోజంతా ఒక కథలా మీ ముందు ఆవిష్కరిస్తారు. దీంతొ మీరు వారి జీవితంలో కేవలం ఆడియన్స్ గా కాకుండా, ఒక భాగస్వామిగా మారతారు. ఈ ప్రశ్న మీపై వారికి నమ్మకాన్ని పెంచుతుంది.
ఏ విషయమైనా నిన్ను ఈ రోజు బాధపెట్టిందా?
పిల్లలు తమ బాధను ఈజీగా బయటపెట్టలేరు. వారి చిరునవ్వుల వెనుక ఎన్నో చెప్పలేని భావాలు దాగి ఉండొచ్చు. ఈ ప్రశ్న వారికి ఒక భరోసానిస్తుంది. నీ బాధను వినడానికి నేనున్నాను అని చెప్పకనే చెబుతుంది. ఎవరైనా ఏమైనా అన్నారా, ఏదైనా వారిని నిరాశపరిచిందా అని తెలుసుకోవడం ద్వారా వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారికి సరైన మార్గనిర్దేశం చేయవచ్చు.
ఈ రోజు జరిగిన దాంట్లో ఏదైనా మార్చాలని అనిపించిందా?
ఇది కేవలం ఒక ప్రశ్న కాదు..ఆత్మపరిశీలనకు తొలి అడుగు. ఈ రోజు వాళ్లు చేసిన తప్పు, పొరపాటును లేదా ఎదుటివారు చేసిన తప్పును విశ్లేషించుకునే శక్తిని ఈ ప్రశ్న ఇస్తుంది. మంచి-చెడుల మధ్య తేడాను, సరైన ప్రవర్తన ప్రాముఖ్యతను వారికి సున్నితంగా నేర్పడానికి ఇదొక అద్భుతమైన మార్గం.

రేపటి రోజును ఎలా అద్భుతంగా మార్చుకుందాం అనుకుంటున్నావ్?
రేపు ఏం చేస్తావ్? అనడిగితే అది ఒక ప్రణాళిక. కానీ ఈ ప్రశ్న వారిలో ఆశను, ఉత్సాహాన్ని నింపుతుంది. రేపటి రోజుపై ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఇది వారిలో ప్రణాళికా నైపుణ్యాలను, బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందిస్తుంది. తమ లక్ష్యాలను నిర్దేశించుకునే అలవాటు చిన్నప్పటి నుంచే మొదలవుతుంది.
మేము నీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు నీకు బాధగా ఉందా?
ఈ ప్రశ్న అడగడానికి ధైర్యం కావాలి. కానీ ఇది అత్యంత కీలకమైనది. మీ బిజీ షెడ్యూల్ వారిని ఎంతగా బాధిస్తుందో తెలుసుకునే అవకాశం ఇస్తుంది. ఒకవేళ అవును అని సమాధానం వస్తే, వారికి క్షమాపణ చెప్పి మీ పరిస్థితిని ప్రేమగా వివరించి, వారికోసం ప్రత్యేక సమయం కేటాయిస్తానని మాట ఇవ్వండి. ఈ నిజాయితీ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ ఐదు ప్రశ్నలు మీ పిల్లల మానసిక ఆరోగ్యానికి మీరు ఇచ్చే అమూల్యమైన బహుమతి. ఇది మీ మధ్య సంభాషణను పెంచి, నమ్మకాన్ని పెంపొందించి, ప్రేమను రెట్టింపు చేస్తుంది.



Click it and Unblock the Notifications