Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి
ప్రేమకథలు మొదట్లో పూలపాన్పులాగే అనిపిస్తాయి. పరిచయమైన కొత్తలో అంతా అందంగా, ఉత్సాహంగా, ప్రపంచం రంగులమయంగా కనిపిస్తుంది. కాలం గడిచేకొద్దీ అసలు పరీక్ష మొదలవుతుంది. తరచూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం, సర్ ప్రైజ్ లు ప్లాన్ చేయడం లేదా ఎప్పుడూ కలిసే ఉండటం మాత్రమే బలమైన బంధానికి గుర్తులు కావని మీకు తెలుసా?
ఒక అద్భుతమైన బంధం అనేది నమ్మకం, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనే చిన్న చిన్న పునాదుల మీద నిర్మితమవుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకున్నారని, మీ బంధం ఆరోగ్యకరంగా, శాశ్వతంగా ఉండబోతోందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలు ఇక్కడ చూడండి.

దాపరికం లేని మాట.. ఓపికగా వినే మనసు
ఏ బంధానికైనా ప్రాణం కమ్యూనికేషన్. మీ మనసులోని ఆలోచనలను, భయాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలిగినప్పుడే ఇద్దరి మధ్య అపార్థాలకు తావుండదు. అయితే చెప్పడం ఎంత ముఖ్యమో ఎదుటివారి మాటను వినడం కూడా అంతే ముఖ్యం. మీ భాగస్వామి మీ మాటలను కేవలం వినడమే కాకుండా, మీ కోణంలో ఆలోచిస్తున్నారంటే ఆ బంధం పదిలమే. మనసు విప్పి మాట్లాడుకునే జంటల మధ్య గొడవలు వచ్చినా అవి ఇట్టే సమసిపోతాయి.
కష్టకాలంలో కొండంత అండగా నిలవడం
అంతా సవ్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం చాలా సులభం. కానీ జీవితంలో ఒత్తిడి, కష్టాలు లేదా వైఫల్యాలు ఎదురైనప్పుడే అసలు బంధం విలువ తెలుస్తుంది. ఆ సమయంలో సలహాలు ఇవ్వడమే కాకుండా నేనున్నాను అంటూ మానసికంగా వెన్నంటి నిలిచే భాగస్వామి ఉంటే, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో దాటేయవచ్చు.
ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం
ప్రేమకు గౌరవం తోడైనప్పుడే ఆ బంధానికి ఆయుష్షు పెరుగుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని తమకు నచ్చినట్లుగా మార్చడానికి ప్రయత్నించకుండా, మీ ఆలోచనలను, నిర్ణయాలను, లోపాలను సైతం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తున్నారా? అయితే అది పరిపూర్ణమైన ప్రేమకు నిదర్శనం. ఒకరినొకరు మార్చుకోవాలనుకునే వారి కంటే, గౌరవించుకునే వారే ఎప్పటికీ సంతోషంగా ఉంటారు.
చిన్న చిన్న విషయాల్లోనే గొప్ప ఆనందం
ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన వంటకం గుర్తుపెట్టుకుని వండటం, మీరు అలసిపోయినప్పుడు ఓదార్చడం, అడగకముందే ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటి చిన్న చిన్న విషయాలు బంధాన్ని అతుక్కుపోయేలా చేస్తాయి. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఈ చిన్న తీపి గురుతులే పెదవులపై చిరునవ్వులు పూయిస్తాయి.
నమ్మకం.. వ్యక్తిగత స్వేచ్ఛ
నమ్మకం ఉన్నచోట అనుమానానికి చోటుండదు. బంధంలో ఎంత ప్రేమ ఉన్నా, ఎవరి వ్యక్తిగత స్పేస్ వారికి ఉండటం ముఖ్యం. మీ స్నేహితులతో గడపడానికి, మీ వృత్తిపరమైన లక్ష్యాలు చేరుకోవడానికి లేదా మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడానికి భాగస్వామి స్వేచ్ఛ ఇస్తున్నారంటే.. ఆ బంధం చాలా ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క.



Click it and Unblock the Notifications