Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Love Languages: ఈ 5 ప్రేమ భాషలు తెలిస్తే..మీ బంధం ఉక్కులా బలంగా,దేవుడు కూడా విడదీయలేడు!
ఉరుకుల పరుగుల జీవితంలో మన బంధాలు, ముఖ్యంగా భాగస్వామితో ఉన్న అనుబంధం నిలబెట్టుకోవడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది చాలామందికి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అన్నిటికన్నా ముఖ్యంగా మన చేతిలో ఉండే డిజిటల్ ప్రపంచం ఇవన్నీ మన మధ్య తెలియకుండానే ఒక అడ్డుగోడను కట్టేస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో మీ బంధాన్ని మరింత మధురంగా, స్ట్రాంగ్ గా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే మీ భాగస్వామి ప్రేమ భాష తెలుసుకోవడం.
ప్రముఖ అమెరికన్ రచయిత డా. గ్యారీ చాప్‌మన్ తన ఫేమస్ బుక్ "The 5 Love Languages"లో ఏం చెప్పారంటే..ప్రతి మనిషి ప్రేమను పంచే విధానం, ప్రేమను పొందే విధానం వేర్వేరుగా ఉంటాయట. ఈ ప్రేమ భాష అనేది మన భాగస్వామి మనసు లోతుల్లోకి తొంగి చూడటానికి, వారి భావోద్వేగ అవసరాలను గుర్తించి వాటిని తీర్చడానికి ఒక అద్భుతమైన తాళం చెవి లాంటిది.

ఆ ప్రేమ భాషలు ఇవే
ప్రశంసా వాక్యాలు
మీ భాగస్వామి చిన్న చిన్న పొగడ్తలకే మురిసిపోతారా? ఈ డ్రెస్ నీకు భలే సెట్ అయ్యింది..నువ్వు చేసిన పని అద్భుతం.. నువ్వు పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యం ఇలాంటి ప్రేమపూర్వకమైన, ప్రోత్సాహకరమైన మాటలు విన్నప్పుడు వారి ముఖం వెయ్యి వత్తుల దీపంలా వెలిగిపోతుందా? అయితే ఇదే వారి ప్రేమ భాష. ఈ చిన్న మాటలే వారి రోజును అద్భుతంగా మారుస్తాయి. వారికి మీరు ఇచ్చే విలువను, మీ ప్రేమను ఈ మాటల ద్వారానే వారు ఎక్కువగా గ్రహిస్తారు.
క్వాలిటీ టైం
కొందరికి,ఎంత సేపు గడిపామన్నది కాదు, ఎంత నాణ్యంగా గడిపామన్నదే ముఖ్యం. భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కనపెట్టి ఆ రోజు విశేషాలు పంచుకోవడం..వీకెండ్ లో హాయిగా ఓ సినిమా చూడటం..సాయంత్రం బాల్కనీలో కూర్చుని ఓ కప్పు కాఫీ తాగుతూ మనసు విప్పి మాట్లాడుకోవడం...ఇలాంటి ప్రత్యేక సమయాల్లో మీరు పూర్తిగా వారితోనే ఉన్నారనే భావన, వారికి మీరు ఇచ్చే అమూల్యమైన బహుమతి. మీ ఏకాగ్రత, మీ సమయం వారికే సొంతం అని తెలియజెప్పడమే ఈ భాష సారాంశం.
బహుమతులు
ఇది ప్రేమను చాటే ఒక అందమైన పద్ధతి. ఖరీదైన కానుకలే కానవసరం లేదు. వారికి ఇష్టమైన చాక్లెట్, ఓ చిన్న మొక్క లేదా వారు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ఓ పుస్తకం.. ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ప్రత్యేక సందర్భం లేకపోయినా సరే వారిని ఎంతగానో ఆనందపరుస్తాయి. నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు.. నా ఇష్టాలను గుర్తుపెట్టుకున్నావు అనే సందేశాన్ని ఇవి బలంగా చేరవేస్తాయి. బహుమతి వెనుక ఉన్న మీ ఆలోచనే వారికి ముఖ్యం.

సేవా దృక్పథం
మాటల కన్నా చేతలే గొప్పవి అనేవారు కొందరుంటారు. మీ భాగస్వామి అలసిపోయి వచ్చినప్పుడు మీరు చేసిచ్చే ఓ కప్పు కాఫీనో లేదా టీనో లేదా ఇంటి పనుల్లో మీ సాయం, వారికిష్టమైన వంట చేసిపెట్టడం..ఇలాంటి సేవలు వారి పట్ల మీకున్న ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తాయి. మీ పనుల ద్వారా నీకోసం నేనున్నాను..నీ భారాన్ని పంచుకుంటాను అని చెప్పడమే ఈ ప్రేమ భాష. ఈ చిన్న పనులే వారి మనసును గెలుచుకుంటాయి.
శారీరక స్పర్శ
కొందరికి ఆత్మీయ స్పర్శే ప్రేమకు ప్రతిరూపం. చేయి చేయి పట్టుకుని నడవడం, ఓ వెచ్చని కౌగిలి, భుజం తట్టడం, దగ్గరకు తీసుకోవడం ఇలాంటి చిన్న స్పర్శలు వారికి మానసిక భద్రతను, అనుబంధపు వెచ్చదనాన్ని అందిస్తాయి. మాటలకందని భావాలను ఈ స్పర్శ తెలియజేస్తుంది. మీ సాన్నిహిత్యం, మీ భరోసా వారికి ఈ స్పర్శ ద్వారానే ఎక్కువగా అందుతుంది.



Click it and Unblock the Notifications