Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
కాపురంలో చిచ్చు..పురుషులు చేసే ఈ 5 చిన్న తప్పులే విడాకులకు దారితీస్తాయి!
భారతీయ సమాజంలో పెళ్లికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. నూరేళ్ల పంటగా భావించే ఈ బంధంలో ఇటీవల కాలంలో తరచుగా బీటలు వారుతున్నాయి. విడాకులు లేదా డివోర్స్ అనేవి ఒకప్పుడు చాలా అరుదుగా ఉండేవి, కానీ నేడు కామన్ అయిపోయాయి.
సాధారణంగా స్త్రీలు.. పురుషుల కంటే ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు. పురుషులు తమకు తెలియకుండా చేసే కొన్ని పనులు, మాట్లాడే మాటలు వారి భార్యల మనసులో లోతైన గాయాలను చేస్తాయి. పురుషులు తరచుగా పట్టించుకోని, కానీ స్త్రీలను తీవ్రంగా బాధపెట్టే ఆ 5 అలవాట్ల గురించి ఇక్కడ చూడండి.

బయటకు తీసుకెళ్లకపోవడం
పెళ్లికి ముందు లేదా కొత్తలో భార్యతో గడపడానికి, షికార్లకు వెళ్ళడానికి ఆసక్తి చూపించే భర్తలు.. రాను రాను ఆ ఉత్సాహాన్ని తగ్గిస్తుంటారు. చివరికి ఆమె అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తీసుకెళ్లడానికి నిరాకరిస్తుంటారు. దీనివల్ల మీ భార్య తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతుంది.
మీ దృష్టిలో ఇదొక చిన్న విషయం కావచ్చు, కానీ ఆమెకు మాత్రం తనపై ప్రేమ తగ్గిపోయింది అనే భావనను కలిగిస్తుంది. అప్పుడప్పుడూ ఆమెతో బయటకు వెళ్లడం బంధాన్ని రీఫ్రెష్ చేస్తుంది.
బట్టల విషయంలో ఆంక్షలు
ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటుంది. సందర్భానికి తగినట్లు సూచనలు ఇవ్వడం వేరు, కానీ ఆమె కట్టుకునే ప్రతీ చీర లేదా డ్రెస్ మీద నిరంతరం విమర్శలు చేయడం, ఆంక్షలు విధించడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.
మీ భాగస్వామి ఇష్టాయిష్టాలను గౌరవించడం ద్వారానే ప్రేమ పెరుగుతుంది తప్ప, నియంత్రించడం ద్వారా కాదని గుర్తుంచుకోవాలి.
నలుగురిలో చులకన చేసి మాట్లాడటం
చాలామంది పురుషులు స్నేహితులు లేదా బంధువుల ముందు సరదా కోసం భార్యను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మా ఆవిడకు వంట అస్సలు రాదు, ఎప్పుడూ ఇంతే.. బుర్ర వాడదు వంటి వ్యాఖ్యలు చేయడం మీకు జోక్ కావచ్చు, కానీ అది ఆమెను అందరి ముందు అవమానపరుస్తుంది. పబ్లిక్ లో ప్రశంసించడం, ప్రైవేట్ లో సరిదిద్దడం అనేది ఆరోగ్యకరమైన బంధానికి ముఖ్యం.
పర్సనల్ స్పేస్ ఇవ్వకపోవడం
బంధంలో ఎంత దగ్గరగా ఉన్నా, ప్రతి ఒక్కరికీ పర్సనల్ స్పేస్ అనేది చాలా అవసరం. భార్య ఎక్కడికి వెళ్లినా వెంటపడటం లేదా ఆఫీసులో ఉన్నప్పుడు నిరంతరం ఫోన్లు చేసి విసిగించడం, పుట్టింటికి వెళ్లినా వెంటనే తిరిగి తీసుకురావడం వంటివి ఆమెకు ఊపిరాడనివ్వని పరిస్థితిని కల్పిస్తాయి. ఆమెకంటూ కొంత సమయం, స్వేచ్ఛ ఇవ్వడం మీ బాధ్యత.
పుట్టింటిని విమర్శించడం
ఇది చాలా సున్నితమైన, ముఖ్యమైన విషయం. మీ తల్లిదండ్రులను మీ భార్య గౌరవించాలని మీరు ఎలా కోరుకుంటారో, ఆమె తల్లిదండ్రులకు, కుటుంబానికి కూడా మీరు అదే గౌరవం ఇవ్వాలి. గొడవల సమయంలో లేదా హాస్యానికైనా సరే ఆమె పుట్టింటి వారిని కించపరచడం, ప్రశ్నించడం స్త్రీలు అస్సలు సహించలేరు. ఇది బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications