Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
భర్తల వద్ద భార్యలు దాచే 5 విషయాలు ఇవే.. ప్రతి మగాడు తెలుసుకోవాలి
అత్యంత పవిత్రమైన బంధాల్లో వివాహ బంధం ఒకటి. ఈ వివాహ బంధంలో ఒకరు అనే మాట ఉండదు. రెండు వ్యక్తులు, రెండు కుటుంబాలు, రెండు కొత్త సంబంధాలు అన్ని కలుస్తాయి. ఇందులో ఎన్నో సవాళ్లు ఉంటాయి, కానీ జీవితాంతం ఆ మనిషితోనే కలిసి ఉంటారు. ఒకరికొకరికి మద్దతు ఇచ్చి, శ్రమ పడి, ప్రేమతో జీవించాలని భావిస్తారు. భార్యభర్తల సంబంధంలో ఎప్పుడూ గొడవలు, వివాదాలు ఉంటాయి. కానీ చివరలో మాత్రం ప్రేమ ఉంటుంది. వివాహ బంధంలో కమ్యూనికేషన్, నమ్మకం, మరియు పారదర్శకత చాలా ముఖ్యం.
అయితే, కొన్నిసార్లు భార్యలు తమ భర్తల నుండి కొన్ని విషయాలు దాచుతారు. అలాగే, భర్తలు కూడా కొన్ని విషయాలను భార్యలకు చెప్పకుండా దాచిపెడతారు. ఈ కథనంలో మనం భర్తల నుంచి భార్యలు దాచే కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలాంటి విషయాలు దాచుతారో తెలుసుకుందాం.

శరీర సంబంధిత సమస్యలు
శరీర సంబంధిత ఆరోగ్య సమస్యలు.. ముఖ్యంగా పీరియడ్స్, పీరియడ్స్ నొప్పి, చిన్న జ్వరం వంటి సమస్యలను కొందరు మహిళలు తమ భర్తలతో పంచుకోరు. ఈ విషయాలు చెప్పడం వల్ల భర్తలు ఆందోళన చెందడం, కలవరపడతారని అనుకుంటారని భార్యలు చెప్పకుండా దాచుకుంటారట. అంతేకాకుండా, బరువు పెరగడం లేదా స్ట్రెచ్ మార్క్స్ వంటి మార్పులను మహిళలు భర్తలకు చెప్పకుండా దాచుకుంటారట.
చిన్న పొదుపు
కొంతమంది మహిళలు తమ చిన్న పొదుపులను భర్తలకు తెలియకుండా దాచుకుంటారు. భవిష్యత్తులో ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బు ఉపయోగపడతుందని వారు నమ్ముతారు. కొందరు స్త్రీలు తమ భవిష్యత్తు లేదా పిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. ఈ విషయాన్ని భర్తకు చెప్తే ఆ డబ్బు ఖర్చు అయిపోతుందని, లేదా ఆయన అపార్థం చేసుకుంటారని భార్యలు వారికి చెప్పరు.
లైంగిక ఇష్టాలు, అయిష్టాలు
కొందరు స్త్రీలు తమ లైంగిక ఇష్టాలు, అయిష్టాలను భర్తలతో ఓపెన్‌గా మాట్లాడటానికి సంకోచిస్తారు. ఈ విషయాలు చెప్పడం వల్ల భర్తలు తన అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ఎగతాళి చేస్తారని భావిస్తారు. భర్తతో లైంగిక విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడంపై ఇంకా కొన్ని అపోహలు వస్తాయని వారు భావిస్తారట. అందుకే ఈ అంశాలు ప్రైవేట్‌గా ఉంచుకుంటారని చెబుతున్నారు.
మొదటి ప్రేమ
చాలా మంది మహిళలు తమ మొదటి ప్రేమ లేదా గత సంబంధాలను తమ భర్తలకు చెప్పకుండా దాచుకుంటారు. ఈ విషయాలను చెప్పడం వల్ల భర్తలు అనుమానం పడతారని వారు భావిస్తారు. భార్యలు తమ భర్తలు తమను పూర్తి స్థాయిలో నమ్మాలని కోరుకుంటారు. కాబట్టి గతం గురించి చెప్పి, దానికి భర్తకు అనుమానాన్ని రేపకుండా ఉండేందుకు ఈ విషయాలు దాచిపెట్టుకుంటారు.
స్నేహితులతో గడిపే సమయం
స్నేహితులతో గడిపే సమయం చాలా ముఖ్యంగా భావించే కొంతమంది మహిళలు, తమ భర్తల వద్ద ఈ విషయాలను దాచిపెడతారు. వీరు షాపింగ్, సినిమా, లేదా ఇతర కార్యక్రమాల కోసం స్నేహితులతో సమయం గడపడం ఇష్టపడతారు. ఈ విషయాలు తమ భర్తలతో పంచుకోవడం ద్వారా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుందన్న భావనతో, భర్తలతో వాటిని పంచుకోరు.



Click it and Unblock the Notifications