Latest Updates
-
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే
సంతోషకరమైన దాంపత్య జీవితానికి..జపనీయుల విజయ రహస్యాలు
పెళ్లి తర్వాత జీవితం అందంగా ఉండాలని, భాగస్వామితో చివరివరకు కలిసి సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే వైవాహిక జీవితం అనే అందమైన ప్రయాణంలో ప్రేమతో పాటు సహనం, గౌరవం, అవగాహన వంటి ఎన్నో అంశాలు దీపాల్లా దారి చూపాలి. లేకపోతే చిన్న చిన్న అలజడులే బంధాన్ని బలహీనపరుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన కుటుంబ విలువలు కలిగిన జపనీయుల సంస్కృతి, మన దాంపత్య జీవితానికి ఒక గొప్ప ప్రేరణ. వారి జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యత, సామరస్యం కనిపిస్తాయి. వారి జీవన విధానం నుండి కొన్ని విలువైన సూత్రాలను నేర్చుకుని, మన వివాహ బంధాన్ని మరింత దృఢంగా, ప్రేమగా మార్చుకుందాం.
ఐచి
ప్రేమంటే షరతులతో కూడుకున్నది కాదు. జపనీస్ భాషలో ఐచి అంటే నిస్వార్థమైన, షరతులు లేని ప్రేమ. మన భాగస్వామిని వారి బలాలు, బలహీనతలతో సహా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించినప్పుడే ఆ ప్రేమకు నిజమైన అర్థం ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేదా ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా కేవలం ఇవ్వడంలోనే ఆనందాన్ని వెతుక్కునే ఈ ప్రేమ, సంతోషకరమైన దాంపత్యానికి బలమైన పునాది వేస్తుంది.

గమన్
ప్రతి బంధంలోనూ అభిప్రాయ భేదాలు, కష్ట సమయాలు సహజం. అటువంటి పరిస్థితుల్లోనే మన ఓర్పు, సహనానికి అసలైన పరీక్ష. గమన్ అంటే కష్ట సమయాల్లోనూ సంయమనం, శాంతం కోల్పోకుండా ఉండటం. దాంపత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సహనంతో ఎదుర్కొన్నప్పుడు చిన్న చిన్న గొడవలు బంధాన్ని తెంచేంత పెద్దవి కాకుండా ఉంటాయి. ఈ సహనమే బంధానికి రక్షణ కవచంలా నిలుస్తుంది.
వా
వా.. అంటే సామరస్యం, ఐక్యత. దాంపత్య జీవితంలో నేను అనే అహంకారం కాకుండా మనం అనే భావన బలంగా ఉండాలి. భాగస్వామితో సామరస్యంగా కలిసి పనిచేయడం ఒకరి స్వేచ్ఛకు మరొకరు గౌరవం ఇవ్వడం, నిర్ణయాలు ఇద్దరూ కలిసి తీసుకోవడం వంటివి వా స్ఫూర్తిని తెలియజేస్తాయి. ఆధిపత్య ధోరణి లేని చోటే బంధం ఆరోగ్యంగా వర్ధిల్లుతుంది.
ఇతదకిమాసు
ఇతదకిమాసు అనే పదాన్ని జపనీయులు ఆహారం తీసుకునే ముందు కృతజ్ఞతగా చెబుతారు. ఈ భావనను మనం మన బంధంలోనూ పాటించాలి. మన భాగస్వామి మన కోసం చేసే ప్రతి చిన్న పనికి, వారు అందించే సహాయానికి, మనకు ఇచ్చే మానసిక ధైర్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న కృతజ్ఞతా భావం బంధంలో వినయాన్ని, లోతును పెంచి, అనురాగాన్ని రెట్టింపు చేస్తుంది.
కుటుంబ బంధాలకు విలువనివ్వడం
జపనీస్ సంస్కృతిలో తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. భాగస్వామిని గౌరవించడం అంటే వారి మూలాలను, వారి కుటుంబాన్ని కూడా గౌరవించడమే. ము ఖ్యంగా అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా ఆదరించడం వల్ల కుటుంబంలో సామరస్యం వెల్లివిరుస్తుంది. ఇది కేవలం సంప్రదాయం కాదు, కుటుంబ బంధాలను పటిష్టంగా ఉంచే ఒక అందమైన మార్గం.



Click it and Unblock the Notifications
