Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఆశగా దగ్గరకెళ్తే.. మీ భార్య వద్దని వారిస్తోందా? అయితే ఇదే కారణం కావచ్చు!
నీళ్లు, ఆహారం, బట్టలు.. వీటిలాగే సెక్స్ కూడా. ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే శృంగారం చాలా ముఖ్యం. దంపతుల మధ్య శృంగారం జీవితం బాగుంటే సగం సమస్యలు పోయినట్లే. కానీ ఈ మధ్య చాలా జంటలు.. శారీరకంగా ఎక్కువగా దగ్గర కాలేకపోతున్నారు. ఉద్యోగం, సమయం లేకపోవడం, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న మనస్పర్థలు, ఎక్కువ మందితో కలిసి ఒకే ఇంట్లో నివసించడం.. ఇలా సవాలక్ష కారణాలతో దూరంగా ఉంటున్నారు.

కానీ ఇలాంటి సమస్యలేమీ లేకున్నా అమ్మాయిలు, మహిళలు శృంగారానికి నో చెబుతున్నారంటే ఆలోచించాల్సిందే. ఎంతో ప్రేమతో, ఆశగా భార్య దగ్గరకు వెళ్తే.. ఆమె సెక్స్ పై ఇష్టం చూపించకపోవడం, వద్దని వారించడం చేస్తుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆలోచించాలి. తరచుగా మీ భార్య సెక్స్ కు నో చెబుతుంటే ఈ రకమైన సమస్యలు ఉన్నట్టే. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం ఉత్తమమైన మార్గం.
1. హార్మోన్ల అసమతుల్యత
పురుషులు, స్త్రీలు.. ఇలా ఇద్దరిలో సెక్స్ కోరికలను పెంచడంలో హార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కానీ ఆ హార్మోన్లే తక్కువ అయితే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉంటే, వారిలో వయసుతో సంబంధం లేకుండా సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు.
2. ఈస్ట్ ఇన్ఫెక్షన్
ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది యోనిని ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి. యోని ప్రాంతంలో ఫంగస్ వృద్ధి చెందడం వల్ల, పరిశుభ్రత లేకపోవడం లేదా అసురక్షిత సెక్స్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన దురద, దుర్వాసనతో కూడిన ఉత్సర్గ మరియు నొప్పికి కారణం అవుతుంది. దీని వలన స్త్రీ తాత్కాలికంగా సెక్స్‌లో నిశ్చలతను కోల్పోతుంది.
3. లైంగికంగా సంక్రమించే వ్యాధులు
గోనేరియా, క్లామిడియా, హెపటైటిస్ మొదలైన ఎస్టీడీలు కూడా యోని ప్రాంతంలో చాలా నొప్పిని కలిగిస్తాయి. అలాగే స్త్రీ తన భాగస్వామికి ఎస్టీడీని బదిలీ చేయడం గురించి ఆందోళన చెందుతుంది. అందువలన ఆమె సెక్స్ చేయడానికి నిరాకరించవచ్చు.
4. అధిక రక్తపోటు
ఒక మహిళ అధిక రక్తపోటుతో బాధ పడుతుంటే.. సంభోగం సమయంలో గుండె మరియు మెదడుకు రక్తం వేగంగా చేరడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆమె ఆందోళన చెందుతుంది. హైపర్ టెన్షన్ ఉన్నవారు సెక్స్ సమయంలో గుండెపోటుకు గురయ్యే సందర్భాలు చాలా ఎక్కువాగ ఉంటాయి.
5. మధుమేహం
ఈ జీవక్రియ రుగ్మతతో బాధపడుతున్న స్త్రీలు యోని పొడి మరియు హార్మోన్ల అసమతుల్యతతో సహా అనేక ప్రతికూల లక్షణాలను అనుభవిస్తారు. ఈ సమస్య మహిళల్లో సెక్స్ పట్ల ఆసక్తిని తగ్గిస్తుంది.
6. మెనోపాజ్
రుతువిరతి సమయంలో మహిళ యొక్క శరీరంలో భారీ సంఖ్యలో హార్మోన్ల హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. ఇది ఆమె సంభోగం చేయకూడదని భావించేలా చేస్తుంది.
7. డిప్రెషన్
డిప్రెషన్ కూడా సెక్స్ డ్రైవ్‌ను ప్రభావితం చేసే మెదడు రసాయనాలలో హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. కాబట్టి మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడానికి డిప్రెషన్ కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications