Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక ఇబ్బందికర రిలేషన్ షిప్ ఉందనడానికి ఇవే సంకేతాలు..జాగ్రత్త
ప్రస్తుత రోజుల్లో రిలేషన్ షిప్స్ కి ఎవరు పెద్ద విలువ ఇవ్వడం లేదు. ఎవరికి నచ్చినట్టు వారు ఫ్రీడమ్ కోరుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఏ రిలేషన్ షిప్ అయినా సరే వర్క్ అవుట్ అవ్వాలంటే అటు అబ్బాయి ఇటు అమ్మాయి ఇరువైపులా నుండి కూడా సమానమైన సహకారం ఉండాలి. ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అనే భావన ఇద్దరిలోనూ ఉండాలి. అలా కాదని ఒకరిని ఒకరు డామినేట్ చేసుకోవాలని చూస్తే ఆ రిలేషన్ షిప్ లో ఇబ్బందులు తప్పవు...!
పెళ్లైన కొన్ని రోజులకే చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.... ఇక లవ్ లో ఉన్న వారి సంగతి అయితే ప్రపోజ్ చేసి ఓకే చెప్పిన కొద్దిరోజులకే బ్రేకప్ అవుతున్నాయి... వీటన్నిటికీ కారణం రిలేషన్ షిప్స్ మధ్య ట్రస్ట్ బిల్డ్ అవ్వకపోవడం. రిలేషన్ షిప్ ఎక్కువకాలం నిలవాలి అంటే పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ట్రస్ట్ అనేది చాలా కీలకం. మన లైఫ్ పార్ట్నర్ పట్ల ప్రేమ ఎంత చూపిస్తామో అదే విధమైన ట్రస్ట్ కూడా చూపించాలి.

ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అవుతాయి. అలా కాదని ఒకరిని ఒకరు కంట్రోల్ చేయాలని చూస్తే కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం చాలామంది రిలేషన్ షిప్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. తమ రిలేషన్ షిప్ ఇబ్బందికరంగా ఉంది అనే విషయం కూడా వారికి తెలియకపోవచ్చు.
అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక ఇబ్బందికర రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పడానికి ఏడు ముఖ్య సంకేతాలు ఉన్నాయి...
1.ఆర్థికపరమైన విషయాలు
మన లైఫ్ పార్ట్నర్ మనల్ని కంట్రోల్ చేయాలని చూడడం, ఒంటరిని చేసి మాట్లాడడం, ఆర్థికపరమైన విషయాలలో ఆధిపత్యం చెలాయించడం వంటివి రిలేషన్ షిప్స్ లో ఇబ్బందులను సూచిస్తాయి.
2. భయ పెట్టడం లేదా బెదిరింపులకు గురి చేయడం
తమ పార్ట్నర్ ను తమ దారిలోకి తెచ్చుకునేందుకు భయ పెట్టడం లేదా బెదిరింపులకు గురి చేయడం వంటివి చేస్తారు. ఒకేసారి మన మీద మనకి అపరాధ భావన కలిగేలాగా ప్రవర్తన కూడా ఉంటుంది.
3. ఎప్పుడూ విమర్శిస్తుండటం
నిరంతరం విమర్శలు చేయడం, అవమానాలకి గురి చేయడం లేదా కించపరిచేలా మాట్లాడడం ద్వారా మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తారు.
4. కొట్టడం, గెంటడం లేదా వస్తువుల మీదకి విసరడం
కోపాన్ని పట్టలేక భౌతిక దాడులకు గురి చేయడం, కొట్టడం, గెంటడం లేదా వస్తువుల మీదకి విసరడం చేస్తూ ఇబ్బందులు పెడతారు.
5. అసూయ పడడం
తమ పార్ట్నర్ పట్ల అసూయ పడడం... అభద్రతా భావంతో మెలగడం తద్వారా లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేయడం.
6. గొడవలు
వారి ప్రవర్తనకు మీరే కారణం అంటూ నిందలు వెయ్యడం... అలాగే మీ రిలేషన్ షిప్ లో గొడవలు మీ వల్లే వచ్చాయి అంటూ ఆరోపణలు చేయడం.
7. అనుమానం
మీ వాస్తవికతను దెబ్బతీసేలా ప్రవర్తించింది మీ మీద మీకే అనుమానం కలిగేలా చేస్తారు. మీ భావాల పట్ల,మీ ఆలోచనల పట్ల, మీ ఫీలింగ్స్ పట్ల మీరే అనుమానం వ్యక్తం చేస్తారు.
పైన చెప్పిన ఏడు సూచనలలో ఏవైనా సరే మీ రిలేషన్ షిప్ లో కనిపిస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని అర్థం. వీలైనంత త్వరగా వాటిని సరిదిద్దుకోవడం లేదా ఆ రిలేషన్ షిప్ నుంచి బయటికి రావడం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది.



Click it and Unblock the Notifications