Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
సంభోగంలో అసలైన స్వర్గం..భావప్రాప్తిని పొందడానికి 3 మార్గాలు
సినిమాల్లో చూపించినట్లు శృంగారంలో భావప్రాప్తి పొందడం అందరికీ అంత ఈజీ కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది ఒక కఠినమైన నిజం. చాలా జంటల లైంగిక జీవితం కొంతకాలానికే చప్పగా మారిపోతుంది. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాల్లో ఇది ఒకటిగా ఉంటుంది. భాగస్వామి సుఖపెట్టలేకపోవడంతో మరొక పార్టనర్ ని వెతుక్కునేవాళ్లు పెరిగిపోతున్నారు. ఓ సర్వే ప్రకారం..దాదాపు 90 శాతం మంది మహిళలు అసలైన భావప్రాప్తిని పొందకుండానే తమ భాగస్వామి సంతోషం కోసం నటిస్తారని తేలింది. సంభోగం, భావప్రాప్తి గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి.
శృంగారం అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు అదొక అద్భుతమైన అనుభూతి. భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరిచే ఒక శక్తివంతమైన ప్రక్రియే శృంగారం. ఇక భావప్రాప్తి (Climax) అనేది ఆ అనుభూతిలో మీరు అందుకునే స్వర్గపు శిఖరం. మరి ఎందుకు చాలా జంటలు ఈ ఆనందాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు? కొన్ని సులభమైన చిట్కాలతో మీ లైంగిక జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఎలా అందించవచ్చో ఇక్కడ చూడండి.

భావప్రాప్తి అంటే ఏమిటి? ఒత్తిడి ఎలా అడ్డుపడుతుంది?
లైంగిక ప్రతిస్పందనలో నాలుగు దశలుంటాయని నిపుణులు చెబుతారు. అవి ప్రేరేపణ, ఉద్రేకం, భావప్రాప్తి, విశ్రాంతి. ఇందులో భావప్రాప్తి అనేది లైంగిక పారవశ్యం శిఖరాగ్రం. పురుషులు సాధారణంగా త్వరగా భావప్రాప్తి పొందితే మహిళలకు కాస్త ఎక్కువ సమయం, సరైన ప్రేరేపణ అవసరం. శారీరక సమస్యలే కాకుండా మానసిక ఒత్తిడి కూడా మీ ఆనందానికి అతిపెద్ద శత్రువు. ఈ రోజుల్లో పని ఒత్తిడి, ఆందోళన వంటివి లైంగిక కోరికలను చంపేస్తున్నాయి. ఈసారి క్లైమాక్స్ కు చేరుకుంటానా? అనే భయం కూడా ఆనందాన్ని దూరం చేస్తుంది.
గరిష్ట ఆనందానికి 3 సులభమైన మార్గాలు
ఫోర్ ప్లే తో మొదలుపెట్టండి
సంభోగం అంటే నేరుగా శారీరక కలయికలో పాల్గొనడం కాదు. చాలామంది చేసే పొరపాటు ఇదే. నెమ్మదిగా మొదలుపెట్టండి. ఫోర్ ప్లే కి ఎక్కువ సమయం కేటాయించండి. ముద్దులు, స్పర్శలు, కౌగిలింతల ద్వారా మీ భాగస్వామిలో ఉత్సాహాన్ని పెంచండి. ఇది మీ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచి, ఇద్దరినీ మానసికంగానూ, శారీరకంగానూ కలయికకు సిద్ధం చేస్తుంది.
కెగెల్ వ్యాయామాల మేజిక్
కెగెల్ వ్యాయామాలు కటి కండరాలను బలోపేతం చేస్తాయి. ఈ కండరాలు బలంగా ఉంటే భావప్రాప్తి మరింత తీవ్రంగా, ఆనందదాయకంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. బ్రిడ్జ్ పోజ్, స్క్వాట్స్ వంటి సులభమైన వ్యాయామాలను రోజూ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ లైంగిక జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు.

కీలక ప్లేస్ లను గుర్తించండి
శరీరంపై కొన్ని చోట్ల తాకినప్పుడు లైంగిక ప్రేరేపణ ఎక్కువగా కలుగుతుంది. వీటినే ఎరోజనస్ జోన్స్ అంటారు. మెడ, చెవుల వెనుక, పెదాలు, తొడల లోపలి భాగం వంటి ప్రదేశాలను సున్నితంగా ప్రేరేపించడం ద్వారా భావప్రాప్తిని సులభంగా చేరుకోవచ్చు. మీ భాగస్వామికి ఏ ప్రదేశాలు ఎక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిసారీ భావప్రాప్తి పొందాలనే ఒత్తిడిని పక్కన పెట్టండి. ఆ క్షణాన్ని ఆస్వాదించడంపై దృష్టి పెట్టండి.



Click it and Unblock the Notifications