Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్య కంటే సెక్స్ డాల్ భలేవుంది, సింపుల్ గా చంపేసి ఆ డాల్ తో ?, మొగుడా మజాకా.. !
రానురాను మానవ సంబంధాలు, దంపతుల మధ్య సంబంధాలు అర్థాన్ని కోల్పోతున్నాయని పెద్దలు తరచుగా చెబుతున్నారు. ఇక్కడ ఓ భర్త అతని భార్యను చంపి ఆమె బీమా సొమ్ముతో సెక్స్ డాల్ కొన్నాడు. అయితే 1.66 లక్షల రూపాయలకు సెక్స్ డాల్ కొనుగోలు చేసి ఇంతకాలం ఎంజాయ్ చేసిన భర్త జైలుకెళ్లిన ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది.
కోల్బీ ట్రికిల్ అనే వ్యక్తి 2019లో అమెరికాలో 911కి కాల్ చేసి తన భార్య క్రిస్టెన్ ట్రికిల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్రిస్టెన్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేసి దర్యాప్తు చేసి నివేదిక తయారు చేశారు. ఇదే సమయంలో కోల్బీ ట్రికిల్ అతని భార్య క్రిస్టెన్ ను కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడని బంధువులతో పాటు పోలీసులను నమ్మించాడు.

భర్త కోల్ఫీ ట్రికిల్ పై పోలీసులకు అనుమానం వచ్చినా అతను అతని భార్యను హత్య చేసినట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
క్రిస్టెన్ ట్రికిల్ తల్లి మాత్రం ఆమె అల్లుడు కోల్ఫీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మరణం వెనుక తన అల్లుడు కోల్ఫీ ట్రికిల్ హస్తం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కానీ కోల్ఫీ అతని భార్య క్రిస్టెన్ ను హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోల్ఫీని పోలీసులు అరెస్టు చెయ్యలేదు,
అలాగే కోల్ఫీ పారామిలటరీ దళంలో ఉద్యోగంలో ఉన్నందున విచారణ పూర్తయ్యే వరకు అతను పోలీసుల అదుపులో ఉండాల్సిన అవసరం లేదని అప్పట్లో పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసులు మాత్రం ఈ కేసులోని క్రిస్టెన్ భర్త కోల్ఫీ మీద నిఘా పెట్టారు. సంవత్సరాలు గడిచాయి. చాలా కాలానికి భార్య చనిపోయిన తర్వాత కోల్పీ ట్రికిల్ లైఫ్ స్టైల్ మారిపోయిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి కోల్ఫీ ట్రికిల్ కు వ్యతిరేకంగా కొన్ని రికార్డులు, ఆధారాలు సేకరించారు.
ఈసారి అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. కోల్ఫీ ట్రికిల్ రూ 1.66 లక్షల రూపాయలకు సెక్స్ డాల్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.
కోల్బీ ట్రికిల్ ఖరీదైన సెక్స్ డాల్ కొనుగోలు చేయడంతో పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. విచారణలో కోల్ఫి అతని భార్య క్రిస్టెన్ ట్రికిల్ బీమా సొమ్మును పక్కదారి పట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డబ్బులో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగించాడని పోలీసులకు ఆధారాలు చిక్కాయి.
కొంత డబ్బుతో మ్యూజిక్ సిస్టమ్‌తో సహా విలాసవంతమైన చాలా వస్తువులు కొన్నాడని, అందులో రూ.1.66 లక్షల విలువైన సెక్స్ డాల్ ఉందని పోలీసులకు పక్కాసాక్షాధారాలు చిక్కాయి. తన భార్య మరణించిన రెండు నెలలకే కోల్బీ చేతికి అతని భార్య బీమా సొమ్ము అందింది. కొంతకాలం తరువాత కోల్ఫి జీవనశైలి కూడా మారిపోయింది.
తరువాత పోలీసులు కోల్ఫిని విచారణకు పిలిస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
భార్య పేరుతో ఉన్న బీమా సొమ్ము కోసమే తన భార్య క్రిస్టెన్ ను హత్య చేసినట్లు నిందితుడు కోల్ఫి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే కోర్టు కోల్బీ ట్రికిల్‌కు జైలు శిక్ష విధించినప్పటికీ అతను తప్పును అంగీకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కోల్ఫికి అతని తల్లి కూడా అండగా నిలుస్తోంది. తన కొడుకు క్రిస్టెన్ పెళ్లి చేసుకుని నిద్రలేని రాత్రులు గడిపాడని, జీవితంలో చాల చేదు అనుభవాలు ఎదురు చూశాడని చెప్పారు.
తన కోడలు చనిపోయిన తరువాత ఓ సెక్స్ డాల్ కొన్నాడని, సెక్స్ డాల్ కొనడానికి తన కోడలు క్రిస్టెన్ హత్యకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే పోలీసులు తప్పుడు సాక్షాలు సమర్పించి తన కొడుకు కోల్ఫి మీద తప్పుడు కేసు పెట్టారని వాదించారు. అయితే కోల్ఫి తల్లి వాదనను కోర్టు అంగీకరించలేదు. ఇప్పుడు కోల్బీ తన జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాదు, 50 సంవత్సరాల వరకు కోల్ఫికి పెరోల్ ఇవ్వకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద భార్యను హత్య చేసి ఆ డబ్బుతో సెక్స్ డాల్స్ కొని ఎంజాయ్ చేసిన కోల్ఫికి జైలు శిక్ష పడటం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది.



Click it and Unblock the Notifications