Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
కామసూత్ర..ఈ రహస్యాలు మీకు తెలుసా?
కామసూత్రం పేరు వినగానే చాలామందికి నవ్వు వస్తోంది,మరికొందరికి అయితే శరీరంలో నరాలు జివ్వు మంటాయి, ఇంకొందరికి ఆ పదం నలుగురి మధ్యలో వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కామసూత్రం అంటే ఏదేదో ఊహించుకునేటోళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. వాస్తవానికి క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక అద్భుత గ్రంథం కామసూత్రం. దానిని రచించింది వాత్స్యాయన మహర్షి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శృంగారం,లైంగికతపై ఇంత లోతైన, శాస్త్రీయ విశ్లేషణ చేసిన వాత్స్యాయన ఒక ఆజన్మ బ్రహ్మచారి, ఒక సన్యాసి. ఈ వైరుధ్యమే వాత్స్యాయనుడిని, ఆయన గ్రంథాన్ని చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టింది.
ఎవరీ వాత్స్యాయనుడు?
గుప్త సామ్రాజ్య కాలంలో జీవించిన వాత్స్యాయనుడు కేవలం ఒక ఋషి మాత్రమే కాదు ఒక గొప్ప తత్వవేత్త, పండితుడు, సామాజిక పరిశీలకుడు. చారిత్రక ఆధారాలు ఆయనను మల్లనాగ్ అని కూడా పిలుస్తాయని, కొందరైతే ఆయన చాణక్యుడి శిష్యుడైన కామండకుడే అయి ఉండవచ్చని భావిస్తారు. వారణాసిలో నివసిస్తూ నాలుగు వేదాలను ఆపోసన పట్టిన ఆయన నాటి సమాజంలోని అన్ని కోణాలను నిశితంగా అధ్యయనం చేశారు.

సన్యాసికి ఇంతటి జ్ఞానం ఎలా సాధ్యమైంది?
ఒక బ్రహ్మచారికి శృంగారంపై ఇంత పట్టు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు సమాధానం ఆయన పరిశోధనాత్మక దృష్టిలో ఉంది. వాత్స్యాయనుడు లైంగికతను దాచాల్సిన పాపంగా కాకుండా మానవ జీవితంలో ఒక సహజమైన, ముఖ్యమైన భాగంగా చూశారు. దానిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆయన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా వేశ్యలను, వారి అనుభవాలను అధ్యయనం చేశారు. వారి జీవనశైలిని, భావోద్వేగాలను గమనించి, వాటిని ఏమాత్రం జుగుప్స లేకుండా, నిష్పక్షపాతంగా తన గ్రంథంలో పొందుపరిచారు.
కామసూత్రం అంటే కేవలం శృంగార భంగిమలేనా?
కామసూత్రం అనగానే చాలామంది కేవలం లైంగిక భంగిమల పుస్తకం అని అపోహపడతారు. కానీ ఇది పూర్తి అవాస్తవం. నిజానికి ఈ గ్రంథంలోని 7 భాగాలలో కేవలం ఒక భాగం మాత్రమే లైంగిక క్రియల గురించి వివరిస్తుంది. మిగిలిన భాగాలు ఒక మంచి పౌరుడిగా ఎలా జీవించాలి, 64 కళలు, సంగీతం, సౌందర్య స్పృహ, భాగస్వామిని ఎలా ఆకర్షించాలి, వైవాహిక జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలి, ప్రేమ, సంబంధాలను ఎలా పటిష్టం చేసుకోవాలి వంటి ఎన్నో సున్నితమైన, ముఖ్యమైన అంశాలను చర్చిస్తాయి. ఇది కేవలం శృంగార గ్రంథం కాదు ఒక సంపూర్ణ జీవన విధాన గ్రంథం.
లైంగికత అనేది దాచాల్సిన విషయం కాదని, దానిపై సరైన అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని వాత్స్యాయనుడు బలంగా నమ్మారు. ఆయన అందించిన జ్ఞానం నాటి కళ, శిల్పం, సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకే, వందల సంవత్సరాలు గడిచినా, వాత్స్యాయనుడి కామసూత్రం నేటికీ ఒక సందర్భోచితమైన, గౌరవనీయమైన గ్రంథంగా నిలిచిపోయింది.



Click it and Unblock the Notifications