Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పెళ్లికి వచ్చిన ప్రతి గెస్టుకు రిటర్న్ గిఫ్ట్, జాక్ పాట్ కొట్టిన అతిథులు,ఒక్కొక్కరికి ఎంతో తెలుసా?వీడియో వైరల్
ప్రముఖుల కుటుంబాల్లో వివాహాలు ఎంత గ్రాండ్ గా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి ఆర్థిక స్థొమతను బట్టి కోట్లలో, వందల కోట్లలో, వేల కోట్లు ఖర్చు చేసి కూతురు లేదా కొడుకు పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తుంటారు. ఇటీవల భారతదేశంలో అత్యంత శ్రీమంతుల్లో ఒక్కడైన ముఖేష్ అంబాని ఆయన కుమారుడి పెళ్లిని కళ్లు చెదిరేలా చేసి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఇక పేదల విషయానికి వస్తే చిన్నచిన్న కల్యాణమండపాల్లో, ఇంటి దగ్గర, గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుని కొంత మంది బంధువులు, స్నేహితులకు పప్పు అన్నం పెట్టి పెళ్లి తంతు ముగిస్తుంటారు. ఎవరి స్థోమతను బట్టి వారివారి కుటుంబాల్లో వివాహాలు జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లు ఎంత సింపుల్‌గా ఉంటాయో, కొన్ని పెళ్లిళ్లు గ్రాండ్‌గా, లావిష్‌గా ఉంటాయి. భారత్‌లో విలాసవంతమైన వివాహ ఆహ్వానపత్రికలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

ఇక చైనాలో పెళ్లికి వచ్చిన అతిధులకు ఏకంగా రూ. 66 వేల రూపాయల నగదు బహుమతిని అందించింది ఓ జంట. ఈ అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైనాలో అంగరంగ వైభవంగా ఓ పెళ్లి జరిగింది. క్రేజీ రిచ్ ఏషియన్స్ అనే సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో పెళ్లిని ఘనంగా జరిపించారు. ఇదంతా సినిమాల్లోనే సాధ్యమని అందరూ అనుకుంటారు.
అయితే చైనాలో జరిగిన ఈ వివాహ వేడుక ఆ సినిమాను తలతన్నేలా ఉందని ప్రపంచానికి చాటిచెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
నిజ జీవితంలో క్రేజీ రిచ్ ఆసియా తరహా పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డానా చాంగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన వివాహ వీడియోను షేర్ చేశారు. క్రేజీ రిచ్ ఏషియన్ పెళ్లి నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఈ వీడియో ప్రపంచానికి చూపిస్తుంది.
డానా చాంగ్ తన అనుచరులకు విలాసవంతమైన వివాహాల యొక్క అద్భుతమైన అనుభవాలను కూడా అందించింది.
చైనాలో గ్రాండ్ వెడ్డింగ్ ఎలా జరిగింది అనే విషయాన్ని డానా చాంగ్ వివరించారు.
చైనాలో జరిగే పెళ్లికి ఐదు రోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్‌లో అతిథులు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం రోల్స్ రాయిస్ కార్లు, బెంజ్ కార్లను రిజర్వ్ చేసి ఆ అతిథుల కోసం అందుబాటులో పెట్టారు. ఇంత చేసిన వాళ్లు కల్యాణ మండపం ఎలా అలంకరించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పెళ్లి కోసం కళ్లు చెదిరిపోయేలా చాలా గ్రాండ్ గా కళ్యాణ మండపం అలంకరణలు కూడా వర్ణనాతీతం. ఎక్కడ చూసినా మండపాన్ని పూలతో అలంకరించి వివిధ రకాల ఛైనీస్ వంటకాలు తయారు చేయించారు. డానా చాంగ్ మొత్తం డెకర్‌ని యూరోపియన్ వైబ్‌ని ఇస్తున్నట్లు వివరించారు.

పెళ్లికి వచ్చిన అతిథులకు రూ. 66,000 రూపాయల బహుమతి ఇవ్వాలని ఆ జంట ముందుగానే నిర్ణయించింది.
మామూలుగా చైనీస్ వివాహాలలో అతిథులు నూతన వధూవరులకు డబ్బుతో నిండిన సాంప్రదాయ ఎరుపు పాకెట్స్ గిఫ్ట్ గా ఇవ్వడం ఆదేశంలో ఆచారంగా వస్తోంది. భారతదేశంలో వివాహాలకు మనం ఎలా బహుమతులు ఇస్తూ ఆచారాన్ని పాటిస్తున్నామో అలాగే ఛైనాలో కూడా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. కానీ ఈ పెళ్లిలో ఈ సంప్రదాయం తిరగబడింది. పెళ్లికి వెళ్లిన వాళ్లు ఆ కొత్త జంటకు బహుమతులు ఇవ్వడం ఎలా ఉన్నా పెళ్లికి వచ్చిన అతిథులకు ఎరుపు కవరులో డబ్బులు ఇచ్చారు
కొత్త జంటకు అతిథులు కవరు ఇవ్వడానికి బదులుగా ఆ పెళ్లి జంట వారి పెళ్లికి వెళ్లిన అతిథులకు రూ. 66 వేలు నగదు ఉన్న ఎర్రటి కవర్ బహుమతిగా ఇచ్చారు. ప్రతి అతిథికి ఎరుపు రంగు జేబులో $800 (భారత కరెన్సీలో సుమారు రూ. 66,000) ఇచ్చారని డానా చాంగ్ చెప్పారు. పెళ్లి ఖర్చుల కోసం అతిథులకు ఆ కొత్త జంట నగదుతో ఉన్న కవర్ బహుమతిగా ఇచ్చినట్లు ఈ ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిపారు.



Click it and Unblock the Notifications