Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
అబ్బాయిలకు స్వర్గం..ఒకరికి ఐదుగురు..అక్కడ ఇది మోసం కాదు, మామూలే!
మనదేశంలో లవ్,మ్యారేజ్ అనేవి చాలా పవిత్రమైన బంధాలు. ఒక అబ్బాయికి ఒకే అమ్మాయి ప్రేయసిగా ఉండటం సంప్రదాయం. ఇద్దరు ముగ్గురితో సంబంధం పెట్టుకుంటే దాన్ని మోసం అంటారు, మన సమాజం అంగీకరించదు. ఇటీవల కాలంలో మనదేశంలో కూడా ఇద్దరు ముగ్గురుతో సంబంధాలు పెట్టుకునేటోళ్లు కూడా పెరిగిపోయారు అది వేరే విషయం.
కానీ ప్రపంచంలో ఓ దేశంలో ఒక్కో అబ్బాయికి ఐదుగురు చొప్పున గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం సర్వసాధారణం. వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆ దేశమే లాట్వియా.

ఎందుకీ వింత పరిస్థితి?
ఉత్తర ఐరోపాలోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న దేశం తన సామాజిక నిర్మాణంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనికి ప్రధాన కారణం అక్కడి జనాభాలో ఉన్న అసమతుల్యత. లాట్వియాలో పురుషుల కంటే స్త్రీల జనాభా చాలా ఎక్కువ.
లాట్వియా లెక్కల ప్రకారం ప్రతి 100 మంది మహిళలకు కేవలం 85 నుంచి 87 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. ఈ భారీ వ్యత్యాసం కారణంగా అక్కడి సంబంధాల తీరు, సామాజిక కట్టుబాట్లు పూర్తిగా మారిపోయాయి.
ఆధునిక దృక్పథం, స్వేచ్ఛాయుత సమాజం
ఈ జనాభా వ్యత్యాసం అక్కడి అమ్మాయిల ఆలోచనా విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇక్కడి మహిళలు విద్య, కెరీర్, ఉద్యోగాలతో పాటు సంబంధాల విషయంలో కూడా చాలా ఆధునిక, విశాల దృక్పథంతో ఉంటారు. ఒక వ్యక్తి బహుళ భాగస్వాములతో ఉండటాన్ని వారు తప్పుగా భావించరు.
పలు రిపోర్టుల ప్రకారం ఒక అబ్బాయికి నలుగురైదుగురు స్నేహితురాళ్లు ఉండటం అక్కడ పెద్ద సమస్యే కాదు. సమాజం కూడా దీన్ని వింతగా చూడదు, అబ్బాయి వ్యక్తిత్వానికి లోపంగా పరిగణించదు. బంధాల్లో స్వేచ్ఛ, పారదర్శకతకు ఎక్కువ విలువనిస్తారు.
పార్టీలకు స్వర్గధామం
ఈ జీవనశైలికి లాట్వియా రాజధాని రిగా నగరం అద్దం పడుతుంది. యూరప్ లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నైట్ లైఫ్, పార్టీ డెస్టినేషన్స్ రిగా ఒకటి. ఇక్కడి బార్స్, క్లబ్బులు, కేఫ్ లు ఎప్పుడూ యువతతో సందడిగా ఉంటాయి.
డేటింగ్ సంస్కృతి ఇక్కడ చాలా బలంగా పాతుకుపోయింది. ఈ వాతావరణం యువత స్వేచ్ఛగా కలవడానికి, సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.
పర్యాటకులకు ఒక అద్భుతం
లాట్వియాలోని ఈ ప్రత్యేకమైన సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అక్కడి ప్రజల విశాల దృక్పథం, స్నేహపూర్వక వాతావరణం వారిని ఆకర్షిస్తుంది. అయితే ఈ జీవనశైలి కొందరికి ఆధునికతకు, స్వేచ్ఛకు ప్రతీకగా కనిపిస్తే..మరికొందరికి ఇది సాంస్కృతిక విలువల నుండి వైదొలగడంగా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications