Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డబ్బా మొగుడు నాకు వద్దేవద్దు, విడాకులు ఇచ్చేయండి సార్, నో కాంప్రమైజ్
వివాహాలు జరిగిన తరువాత దంపతుల మద్య గొడవలు జరిగితే విడిపోవడానికి డిసైడ్ అయిన తరువాత వారు కోర్టును ఆశ్రయిస్తారు. పెళ్లి జరిగిన రెండు మూడు సంవత్సరాలకే కొందరు చిన్నచిన్న విషయాలకు విసిగిపోయి విడాకుల కోసం కోర్టుకు వెలుతున్నారు. అంతే కాకుండా వరకట్నం వేధింపులు, అక్రమ సంబంధాలు, భర్త తాగుబోతు అంటూ చాలా మంది మహిళలు విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు.
అంతే కాకుండా చిన్నచిన్న విషయాలకు కొంత మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వంటగదిలో ఊరగాయాలు, పచ్చళ్లు నిల్వ చేసే జార్ లకు తన భర్త మూతలు వేస్తున్నాడని, అందువల్ల ప్రతిరోజూ డబ్బాల మూతలు తీయడానికి కష్టపడాల్సి వస్తుందని, ఈ విషయంపై చాలాసార్లు చాలా ఇబ్బందులకు గురైనాయని ఓ భార్య ఆరోపిస్తున్నది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే.

ఆ మహిళ తన కథను రెడ్డిట్‌లో వివరంగా రాసింది. నా భర్త ఎప్పుడూ నాతో ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నేను సమస్యను ఎదుర్కొంటాను. నేను ఇంట్లో కొత్త డబ్బాల మూతలను సులభంగా తొలగిస్తాను. కానీ నేను ఇంట్లోని పాత డబ్బాల మూత తెరవలేను అని ఆమె చెప్పింది.
మొట్టమొదట ఊరగాయ చెడిపోకుండా మూత గట్టిగా పెడతాను అని నా భర్త తనతో చెప్పాడని ఆమె వివరించింది.
నేను నా భర్త చెప్పిన మాటలను నమ్మాను. తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఊరగాయ డబ్బాల మూతలు తీసి తనకు ఊరగాయలు ఇస్తాడు. పని నిమిత్తం ఆయన బయటకు వెళ్లిన సమయంతో ఊరగాయల డబ్బాల మూతలు తీయడం పెద్ద సవాలుగా మారుతుందని ఆమె అంటోంది. డబ్బాల మూత తీయడానికి కొన్నిసార్లు ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకోవాల్సి వస్తుందని ఆ మహిళ వివరించింది.
డబ్బా మూత గట్టిగా మూయకపోతే ఊరగాయలకు ఏమీ కాదని, మూతలు ఇంత గట్టిగా మూయవద్దు అని, రోజూ వాడే తిండి డబ్బాలు మూస్తే కష్టమని తాను భర్తతో చెప్పానని ఆమె వివరించింది. అయితే, తన భర్త అందుకు అంగీకరించలేదని, ఈ క్రమంలో డబ్బాల మూతల విషయానికి ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని భార్య వివరించింది. ఒకసారి తన భర్త పని మీద 10 రోజులు వేరే ఊరికి వెళ్ళాడని, ఆ సమయంలో డబ్బాల మూతలు తియ్యడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వివరించింది.
ఊరగాయ పెట్టె మూత తీసేందుకు పక్కింటి మహిళ సాయం అడిగానని, ఆ సమయంలో మీ భర్త కావాలనే ఇలా మూతలు పెడుతున్నాడని పక్కింటి మహిళ తనకు చెప్పిందని, పక్కింటి మహిళ మాటలు విన్న తరువాత ఆమె మాటలు నిజమనిపిస్తోందని.
నాకిష్టమైన ఆహారం తిననివ్వని భర్తతో నేనెందుకు కలసి జీవించాలి అని అనుకున్నానని భార్య వివరించింది. ఈ విషయానికి ఆ మహిళ తన భర్తకు, తనకు విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు మీరు, మీ భర్త విడివిడిగా పచ్చళ్ల డబ్బాలు కొంటే ఇబ్బంది ఉండదని, దానికే విడాకులు తీసుకోవడం సరికాదని సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications