కోటీశ్వరులకు వల వెయ్యడం ఎలా ? అమ్మాయిలకు కోచింగ్ ఇస్తున్న మహిళ

ధనవంతుల అబ్బాయిలను మద్య తరగతి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కూడా ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇప్పుడు డబ్బు కోసం ఏం చేసినా చేస్తారు అని సామాన్య ప్రజలు అంటుంటారు, దానికి తోడు పేదింటికి చెందిన అమ్మాయిలు ధనవంతుల కుటుంబాల్లోని అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. కోటీశ్వరులైన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయని అమ్మాయిలు అనుకుంటున్నారు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పుడు ధనవంతుల కుటుంబాల్లోని అబ్బాయిలను వెతికి పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ధనవంతులను పెళ్లి చేసుకుంటే జీవితం సంతోంగా ఉంటుందని, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని, లేఫ్ సేఫ్ గా ఉంటుందని అమ్మాయిల ఉద్దేశం అని కొందరు అంటున్నారు. అయితే ధనవంతులను పేదింటి, మద్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఎలా? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది.

A woman who gives special coaching to girls on how to marry rich people

ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలో అని చెబుతున్న ఓ మహిళ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నది. ఈ మహిళ ఎవరో అని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎలాంటి రంగాలు ఎంచుకుంటారరో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇల్లో ఉండి కూడా అనేక రకాలుగా, వింతవింతగా డబ్బులు సంపాదిస్తున్నారు. ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలో నేర్పిస్తూ కోట్లు సంపాదిస్తుంది ఈ మహిళ.

చువాన్ క్యూ అలియాస్ క్యు క్యూ అనే మహిళ పేరు ఇప్పుడు చైనాలో మార్మోగిపోతున్నది. ఈమె బిగ్ ఉమెన్ గా ఈమె పేరు చైనాలోని ప్రసిద్ధ ప్రభావశీలులలో ఒకరు అని ప్రచారం జరుగుతోంది. ధనవంతులైన అబ్బాయిలను ప్రేమలో పడేలా చేయడం ఎలాగో ఆమె అమ్మాయిలకు నేర్పుతుంది. దీంతో ఆమె భారీ మొత్తంలో డబ్బు సంపాధిస్తోంది. ఆమె సలహాలు తీసుకున్న చాలా మంది అమ్మాయిలు ఇప్పటికే ధనవంతులను పెళ్లి చేసుకోవడంతో ఈమె విజయం సాధించడంతో చాలా మంది ఆశ్చర్యరం వ్యక్తం చేస్తున్నారు.

A woman who gives special coaching to girls on how to marry rich people

అలా ఆమె కీర్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆమె తన వీడియోలను లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సంవత్సరానికి భారత కరెన్సీ ప్రకారం రూ. 163 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ధనవంతులను ఎలా ఎంచుకోవాలి, వారిని ప్రేమలో పడేలా చేయడం ఎలా, వారు ఒంటరిగా ఉన్నారా, లేదా ఇంతకు ముందే పెళ్లి జరిగిందా అని ఎలా కనుగొనాలో అనే టెక్నిక్స్ గురించి పేదింటి అమ్మాయిలు, మధ్యతరగతి అమ్మాయిలకు ఆమె వివరిస్తోంది.

ఆమె ప్రత్యేక ఫీజులతో కోర్సులను కూడా నిర్వహిస్తుంది. ఈ కోర్సులు రూ. 12 వేల నుండి మొదలై ర. 43 వేలు వరకు ఉంటుంది. కొన్ని కోర్సులకు ఆమె దాదాపు ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నదని వెలుగు చూసింది. అంతే కాదు డేటింగ్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌లు, సెమినార్‌లను కూడా ఆమె నిర్వహిస్తుూ అందుకు ఫీజులు వసూలు చేస్తున్నది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి వేలాది మంది ప్రజలు వేలకు వేల రూపాయలు చెల్లించి వారి పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు.

దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చినా ఆమె ఏమాత్రం తగ్గకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ వెలుతోంది. విమర్శలు పట్టించుకోకుండా తదుపరి పనులపై ఆమె దృష్టి సారించడంతో ఇప్పటికే చాలా మంది అమ్మాయిలకు మేలు జరిగినట్లు తెలుస్తోంది. జీవితంలో డబ్బు సంపాదన కోసం అమ్మాయిలు పక్కదారి పట్టకుండా తన ప్లాన్ ప్రకారం ధనవంతుల కుటుంబాల్లోని యువకులను పెళ్లి చేసుకుని వాళ్లు సంతోషంగా ఉండాలని తాను అనుకుంటున్నానని ఆమె అంటోంది. అయితే ఇది సిస్టమాటిక్ నెట్‌వర్క్ అని కొందరు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు.

A woman who gives special coaching to girls on how to marry rich people

డబ్బున్న అబ్బాయిలను ట్రాప్ చేసి ఇలా పెళ్లి చేసుకోవడం ఒక రకమైన మోసం లాంటిదే అని, ఆ అమ్మాయిలు అబ్బాయిల ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటున్నారని, ఆస్తి వాటా కోసం తరువాత వివాహిత మహిళలు విడాకులు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. పక్కాప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్ర అని చాలా మంది ఆరోపిస్తున్నారు. అందుకే ఈ మహిళపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీన్నే వృత్తిగా ఎంచుకున్న ఆమె కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది. ప్రస్తుతం చైనాలో లవ్ గురుగా ఫేమస్ అయిన ఆమె దగ్గరకు వెలుతున్న యువతుు ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకుని వేల రూపాయలు ఫీజులు చెల్లించి ఆమె వద్ద సలహాలు తీసుకుంటారు. మొత్తం మీద చైనా లవ్ గురు లేడీ ఆమె సలహాలు ఇచ్చి ఇప్పుడు ఆదేశంలో రచ్చరచ్చ చేస్తోంది. ఇలాంటి మహిళ ఇండియాలో ఉంటే ఎంత బాగుంటుంది అంటూ జోకులు వేస్తున్నారు.

Desktop Bottom Promotion