పెళ్లి అయ్యాక కొన్నింటికి అడ్జస్ట్ కావాల్సిందే.. కాదు, లేదు అంటే కష్టమే

వివాహం ద్వారా ఒక్కటైన భాగస్వామితో కలకాలం కలిసి ఉండాలంటే ఎలాంటి విషయాలపై దృష్టి సారించాలి, ఎలాంటి అంశాలు నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దాంపత్య బంధం ఎంతో మధురమైనది. వివాహ బంధం కలకాలం ఉండిపోతుంది. కానీ పెళ్లైన జంటలు కొన్ని చిన్న చిన్న విషయాలకే గొడవలు, కలహాలు పడి ఆ బంధం నుండి విడిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంటారు. డైవర్స్ తీసుకునే చాలా జంటలు అసలు వివాహ బంధంలోని మాధుర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరని అంటారు మానసిక నిపుణులు. ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు మనమైనా, వారైనా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది. కొన్ని నచ్చని విషయాలను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. అందుకే కపుల్స్ కొన్ని విషయాలను సరిచేసుకుని సరిగ్గా నడుచుకుంటే వివాహ బంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు. మానసిక నిపుణులు.

After getting married, some things have to be adjusted

వివాహం ద్వారా ఒక్కటైన భాగస్వామితో కలకాలం కలిసి ఉండాలంటే ఎలాంటి విషయాలపై దృష్టి సారించాలి, ఎలాంటి అంశాలు నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

క్షమించడం నేర్చుకోవాలి:

క్షమించడం నేర్చుకోవాలి:

తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. మనమేమీ రోబోలం కాము. ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే అదే పనిని తప్పుల్లేకుండా చేయడానికి. మనుషులు అన్నాక తప్పులు చేస్తాం, చేస్తూనే ఉంటాం. వివాహ బంధంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి కొన్ని తప్పులు చేయవచ్చు. వాటిని స్వీకరించి క్షమించి ముందుకు సాగడమే ఆ బంధం కలకాలం నిలవడానికి మార్గం.

ఒక కొత్త వ్యక్తితో జీవితాన్ని పంచుకునేటప్పుడు చిన్న చిన్న విషయాలు మీకు, మీరు చేసే పనులు వారికి నచ్చకపోవచ్చు. అలాంటి సమయంలో కోపం ప్రదర్శిస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి తప్పులు చేసినప్పుడు వాటి గురించి విడమరిచి చెప్పాలి. అర్థం అయ్యేలా చెబితే మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. దంపతుల మధ్య చాలా సమస్యలు మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి.

దంపతులు తమ బంధాన్ని శాశ్వతంగా ఉంచాలనుకుంటే తప్పు జరిగినప్పుడు కోప్పడకుండా ఉండాలి. ఆ తప్పు గురించి కూర్చొని మాట్లాడుకోవాలి.

మార్పు సహజమే:

మార్పు సహజమే:

మార్పు సహజం. పెళ్లి తర్వాత చాలా మారిపోయావ్ రా అని స్నేహితులు అనడం చాలా మంది వినే ఉంటారు. ఒక వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు గతంలో ఉన్నట్లుగా ఉండవు. కాస్తంత మారిపోతాయి. కొన్ని విషయాలు మనకు నచ్చకపోయినా మార్చుకోవాల్సి రావొచ్చు.

దాంపత్య బంధం ద్వారా ఒక్కటైనప్పుడు నాది - నీది అని కాకుండా మనం, మనది అని వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నచ్చినా, నచ్చకపోయినా సర్దుబాటు కావాల్సి వస్తుంది. దీనిని అంగీకరించలేని కొందరు వ్యక్తులు మాత్రం నా ఇష్టాలను ఎందుకు మార్చుకోవాలని వితండవాదం చేస్తుంటారు. మొండి పట్టుదల కొన్ని సార్లు పనిచేస్తుండవచ్చు. కానీ ఎప్పుడూ అదే పని చేస్తుందనుకుంటే పొరపాటే.

కొన్ని విషయాలు నచ్చకపోయినా భాగస్వామి కోసం సర్దుకుపోవాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు. ఇలా ఒకరి కోసం మరొకరు చేసే త్యాగమే వివాహ బంధం బలోపేతం అవుతుందని చెబుతున్నారు.

అనుమానం వద్దు:

అనుమానం వద్దు:

వివాహ బంధంలో గొడవు, కలహాలు, ఘర్షణలు ఉంటాయి. అలకలు కామన్‌గా ఉంటాయి. దంపతులు అన్నాక గొడవలు పడాలని, వాటి ద్వారానే ఇద్దరి వ్యక్తిత్వం, వ్యక్తిగత ఇష్టాలు, నచ్చని అంశాలు ఇలాంటివన్నీ తెలుస్తాయని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్‌.

చిన్న చిన్న గొడవలను, విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూడటం వల్ల సంబంధంలో చీలికలు రావడం తప్పా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. జీవిత భాగస్వామిలో తప్పులు వెతకడం మానేసి కలిసే జీవించేందుకు ఉండే దారులను వెతకడం మొదలు పెట్టాలని అంటారు నిపుణులు.

ప్రతి చిన్న విషయానికి అనుమానం పెంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. ఈ అనుమానం పెనుభూతమవుతుంది. దీని వల్లే చాలా జంటలు విడాకులు తీసుకుంటాయి. కాబట్టి ఒకరికి ఒకరిపై అనుమానం ఉంటే దానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చేసుకోవడం ఉత్తమం. పారదర్శకత పాటించినప్పుడు అవమానాలకు చోటు ఉండదు.

Story first published: Wednesday, December 21, 2022, 16:30 [IST]
Desktop Bottom Promotion