Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
భవిష్యత్తులో AI తో శృంగారం.. మనుషులు అవసరం లేకుండానే..
ఇప్పుడు ఏ రంగంలో చూసినా AI అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టెక్నాలజీ ఇండస్ట్రీలో చర్చ అంతా కృత్రిమ మేధ గురించే. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుంచి చోటా మోటా కంపెనీలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి AI ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తున్నాయి.

అంతర్జాలంలో అనేక పనులను ఏఐ చాలా సులభంగా, వేగంగా మనుషులతో పోలిస్తే మరింత కచ్చితత్వంతో పూర్తి చేస్తోంది. కృత్రిమ మేధ ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. కొన్ని పనులకు మనుషులు కావాల్సిందే అనే అభిప్రాయం ఉండేది.
స్పర్శ, ఫీలింగ్స్, శృంగారం లాంటి వాటికి మనుషులకు మనుషులే అవసరం అవుతారని అంతా అనుకుంటున్నారు. కానీ, మాజీ గూగుల్ ఉన్నతోద్యోగి తాజాగా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో శృంగారం కోసం మనషులు అవసరం లేదని, AIతోనే శృంగారం కూడా చేసుకోవచ్చని ఆయన అన్నారు.
AI-పవర్డ్ సెక్స్ రోబోట్స్
గూగుల్ ఎక్స్, గూగుల్, ఆల్ఫాబెట్ ప్రాజెక్టుల మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, మొహమ్మద్ మో గాడాట్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఏఐ భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు చేస్తుంది అంటూ జోస్యం చెప్పారు. AI శక్తితో పని చేసే సెక్స్ రోబోట్లు నిజమైన మానవ భాగస్వాములను పోలి ఉండేంత స్థాయిలో ముందుకు సాగుతాయని, AI మనుషులను సన్నిహిత సంబంధాలలో భర్తీ చేయగలదా అనే ప్రశ్నను లేవనెత్తుతుందని గాడాట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వర్చువల్ రియాలిటీ - ఏఐ పవర్డ్ బాట్‌లతో శృంగారం
వర్చువల్ రియాలిటీతో అద్భుతమైన అనుభవాలను అందించే యాపిల్ విజన్ ప్రో లాంటి ప్రత్యేక హెడ్‌సెట్ లను ఉపయోగించి లైంగిక అనుభవాలను అనుకరించడాన్ని కృత్రిమ మేధ అనుమతి ఇస్తుందని చెప్పుకొచ్చారు. AI-పవర్డ్ బాట్ ల సహాయంతో, ఈ హెడ్‌సెట్‌లతో భాగస్వామితో నిజంగా ఉన్న అనుభూతి కలిగిస్తుందని చెప్పారు. నిజమైనవి లేకపోయినా.. ప్రామాణికంగా భావించే.. అనుభవాలను ఇది ఇస్తుందని చెప్పారు. దీని వల్ల మెదడులో హార్మోన్లు ప్రేరేపితమై భావప్రాప్తి కూడా పొందవచ్చని చెప్పారు. అలాగే ఏఐ కచ్చితంగా పని చేయడం ద్వారా.. మానవ భావోద్వేగాలను అనుకరించడం ద్వారా.. ఏఐ రూపొందించిన పరస్పర చర్యల మధ్య తేడాను గుర్తించడం కొంత కాలానికి కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఈ ఏఐ-పవర్డ్ బాట్ ల ద్వారా చాలా మందికి కనీసం భాగస్వామి అవసరం కూడా రాకపోవచ్చని, వాటితోనే శృంగారం చేసిన అనుభూతిని పొందుతారని మో గాడాట్ చెప్పుకొచ్చారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications