Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ప్రేమ గుడ్డిది, ముసలోడే కాని మహానుభావుడు, 80 ఏళ్ల వయసులో 23 ఏళ్ల యువతితో లవ్
ప్రేమ గుడ్డిదనీ, దానికి ఏ వయసు కాని, కులం కాని, ఆకారాలు కాని అడ్డు కాదనే మాట వినిపిస్తోంది. కానీ ఇలాంటివి నిరూపించే ప్రేమకథలు మన మధ్య పుష్కలంగా ఉన్నాయి.
ఈ ఫోటోలోని తాత, మనవరాళ్లలా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్లు ఇద్దరూ భార్యాభర్తలే. లీ అనే వృద్ధుడు, బోద్దుగా ఉండే జియాఫాంగ్ అనే 23 ఏళ్ల బ్యూటీని వివాహం చేసుకున్నాడు.

ఈ తాత ఎంత ధైర్యవంతుడు అంటే తన వృద్ధాశ్రమంలో పని చేసే ఓ అమ్మాయిపై బెట్టింగ్ వేసి ఆమెను లొంగదీసుకుని చివరికి ఆమె మనుసు గెలుచుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఈ జంట అసాధారణ ప్రేమను చాలా మంది వ్యతిరేకించినప్పటికి చివరికి వారి వివాహంతో ఆ ప్రేమ కథ ముగిసింది.
మొదట ఈ లీ తాత పరిపక్వత, స్థిరత్వం, తెలివితేటలను ప్రశంసించారు. పొగడ్తలకు రాని అమ్మాయిలు ఎవరు? ఉంటారు చెప్పండి.
మొదట ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. తరువాత లీ తాత యవ్వనంలో ఉన్న జియాఫాంగ్ పట్ల ఆకర్షితుడయ్యాడు.
కొంతకాలానికి జియాఫాంగ్ కూడా లీ తాత ప్రేమలో పడిపోయింది. ఈ విషయం తెలియగానే జియాఫాంగ్ కుటుంబం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. లీని పెళ్లి చేసుకోవాలా లేక కుటుంబం కావాలా అని అడిగినప్పుడు జియాఫాంగ్ లీ తాతతోనే జీవితం గడిపాలని నిర్ణయించుకుంది.
స్థానిక చైనీస్ వెబ్‌సైట్ నివేదించినట్లుగా ఈ లీ, జియాఫాంగ్ దంపతులు నిరాడంబరమైన వేడుకతో పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటామని ప్రతిజ్ఞలు చేసుకున్నారు, దీనికి ఇరువైపుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారి ప్రేమను ప్రదర్శించే వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరి రొమాన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జియోఫాంగ్ ఆర్థిక కారణాల వల్ల లీని పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆరోపించారు.
కానీ ఇతరులు ఆమె ధైర్యాన్ని, లీ పట్ల ఆమె నిజమైన ప్రేమను ప్రశంసించారు. వివాదాలు ఉన్నప్పటికీ జియాఫాంగ్ ఇప్పుడు ఇద్దరిలో బలమైనది. లి వయస్సు మరియు ఆరోగ్య సమస్యల కారణంగా అతని డబ్బులు చికిత్సకే ఎక్కువ ఖర్చు అవుతోందని సమాచారం. లీ తన పక్కన ఉంటే నేను ఏదైనా చేస్తాను అని జియాఫాంగ్ అంటోంది, జియాఫాంగ్, లీతో కలిసి ఏదైనా చేయగలనని తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. మొత్తం మీద 80 ఏళ్ల తాత, 23 ఏళ్ల యువతి లవ్ స్టోరీ, చివరికి వారు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.



Click it and Unblock the Notifications