Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ బాగస్వామి బాగా కోపంగా ఉంటే ఇలా చేయండి..మిమ్మల్ని ఇక వదిలిపెట్టరు!
ప్రేమ ఉన్నచోట చిన్న చిన్న అలుకలు, గొడవలు చాలా సహజం. అయితే ఆ గొడవను ఎక్కువ కాలం మనసులో పెట్టుకుంటే అది బంధంలో చెరగని అగాధాన్ని సృష్టిస్తుంది. ప్రేమ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేయడానికి సిగ్గుపడకూడదు. మీ భాగస్వామి లేదా మీ ప్రియమైన వారు కోపంగా ఉన్నప్పుడు వారి అలకను తీర్చి, బంధాన్ని మళ్లీ అందంగా మార్చే కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూడండి
ఓపికగా వినండి, వారి వైపు నుండి ఆలోచించండి
గొడవ సమయంలో మనసులో దాచుకున్న ఎన్నో బాధలు, అభిప్రాయాలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. అప్పుడు మీరు మాట్లాడటం, వాదించడం కన్నా ముందు వారు చెప్పేది పూర్తిగా, అడ్డుపడకుండా వినండి. వారి కోపానికి కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు వారి భావాలకు విలువ ఇస్తున్నారని వాళ్లకు అర్థమవుతుంది. ఇలా ఓపికగా వింటే చాలు, వారి కోపంలో సగం అక్కడే చల్లారిపోతుంది. మీ వాదన వినిపించడం కన్నా వారి ఆవేదనను అర్థం చేసుకోవడం ఆ సమయంలో చాలా ముఖ్యం.

సారీ చెప్పడానికి సంకోచించవద్దు
నేను ఎందుకు సారీ చెప్పాలి? తప్పంతా నాదేనా? అనే అహం చాలాసార్లు బంధాలను దెబ్బతీస్తుంది. క్షమించు అనే ఒక్క చిన్న పదం మనసులోని గాయాన్ని మాన్పుతుంది, బంధాన్ని నిలబెడుతుంది. తప్పు మీ వైపు ఉంటే అహంకారాన్ని పక్కనపెట్టి వెంటనే క్షమాపణ అడగండి. ఒకవేళ తప్పు వారిదైనా, మీ బంధం కోసం మీరు ఒక అడుగు ముందుకు వేసి సారీ చెబితే గొడవ ముగుస్తుంది, మీ ప్రేమ గెలుస్తుంది. క్షమాపణ అడగడం ఓటమి కాదు, మీ బంధానికి మీరు ఇచ్చే గౌరవం.
చిన్న సర్ ప్రైజ్ తో మనసు గెలవండి
మాటలతో చెప్పలేని ప్రేమను చేతలతో చూపించండి. మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి. రోజువారీ హడావిడిలో దొరకని సమయాన్ని ఇప్పుడు కేటాయించండి. వారికి ఇష్టమైన వంటకం వండటం, ఓ అందమైన ప్రేమలేఖ రాయడం లేదా ఊహించని విధంగా కొన్ని పువ్వులు తీసుకురావడం వంటివి వారి మొహంలో చిరునవ్వును పూయిస్తాయి. ఈ చిన్న ప్రయత్నం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని మాటలు లేకుండానే చెబుతుంది. ఈ చిన్నపాటి సర్ ప్రైజ్ లు వారి కోపాన్ని కరిగించి, మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి.



Click it and Unblock the Notifications