Latest Updates
-
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే!
భార్యపై కోపం వస్తే విదేశీయులు అలా.. మరి భారతీయులు ఏం చేస్తారో తెలుసా?
ఈ రోజుల్లో వైవాహిక బంధంలో చిన్న చిన్న గొడవలకే విడాకాలు, ఆత్మహత్యలు లేదా హత్యలకు దారి తీస్తున్న ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తున్నాం. సర్దుకుపోవడం అనే పదం కనుమరుగై,నా మాటే నెగ్గాలి అనే అహంకారం పెరిగిపోతున్న కాలం ఇది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అసలు ఒక భర్తకు భార్యపై కోపం వస్తే ఏం చేయాలి?
ప్రముఖ ప్రవచన కర్త, సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ..ప్రపంచంలోని వివిధ దేశాల్లోని పురుషులు, తమ భార్యల మీద కోపం వస్తే ఎలా స్పందిస్తారో చాలా చమత్కారంగా, అంతకు మించి తాత్వికంగా వివరించారు.

దేశాల వారీగా భర్తల స్పందన
ఇంగ్లాండ్: ఒక ఇంగ్లీషు వాడికి భార్య మీద కోపం వస్తే ఆ బాధను తట్టుకోలేక వెంటనే దగ్గరలోని మద్యం షాపుకి వెళ్తాడట. మందులో తన బాధను మరిచిపోయే ప్రయత్నం చేస్తాడని గరికపాటి తెలిపారు.
ఫ్రాన్స్: అదే ఒక ఫ్రెంచ్ దేశస్థుడికి భార్యపై కోపం వస్తే అతను శాంతి కోసం తన ప్రియురాలి దగ్గరికి వెళ్తాడట. అక్కడ నైతికత కంటే సుఖానికి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి అలా చేస్తారని గరికపాతి చమత్కారంగా చెప్పారు.
అమెరికా: ఇక అమెరికా వాడి సంగతి చెప్పక్కర్లేదు. అక్కడ అంతా ఫాస్ట్ కల్చర్. భార్యతో గొడవ జరగగానే, కోపం రాగానే వెంటనే తన లాయర్ దగ్గరికి వెళ్లి విడాకుల పేపర్లు సిద్ధం చేస్తాడట.
జపాన్: జపాన్ వాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ. భార్య మీద కోపం వస్తే ఆ ఆవేదనను భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడట.
జర్మనీ: హిట్లర్ పుట్టిన గడ్డ కదా. అందుకే జర్మనీ వ్యక్తికి భార్య మీద కోపం వస్తే, ఆ కోపాన్ని యుద్ధానికి వెళ్ళి తీర్చుకుంటాడట.
ఆస్ట్రేలియా: క్రీడలను అమితంగా ఇష్టపడే ఆస్ట్రేలియా వాడికి కోపం వస్తే నేరుగా క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లిపోతాడట.

భారతీయుడి ఎక్కడికి?
మరి మన భారతీయుడికి భార్యపై కోపం వస్తే ఏం చేస్తాడు? ఇక్కడే మన సంస్కృతి గొప్పతనం దాగి ఉంది. గరికపాటి వారి ప్రకారం.. భార్య మీద కోపం వచ్చిన భారతీయుడు సముద్ర తీరానికి వెళ్తాడట. అక్కడ ఇసుకలో కూర్చొని, చేతి నిండా గులకరాళ్లు తీసుకుని ఒక్కొక్క రాయిని సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు.
అలా విసురుతూ ఆ అనంతమైన సముద్రం వైపు చూస్తాడు. అంతం లేని ఈ ఆకాశం ఎంత? అంతులేని ఈ సముద్రం ఎంత? ఈ అనంతమైన సృష్టిలో నేను ఎంత? నా సంసారం ఎంత? అందులో నా భార్య ఎంత? అసలు మా గొడవ ఎంత? అని ఆలోచిస్తాడు. ఆ మహా సముద్రం ముందు తన సమస్య ఒక ఇసుక రేణువంత కూడా కాదని గ్రహిస్తాడు.
ఆ విశాలమైన ప్రకృతిని, అనంతమైన ఆత్మను దర్శించేసరికి అతనిలోని అహంకారం, కోపం ఆ సముద్రపు అలల్లో కలిసిపోతాయి. ఇంత చిన్న విషయానికి నేను అంత పెద్ద గొడవ పడ్డానా అని తనను తానే మందలించుకుని, ప్రశాంతమైన మనసుతో తిరిగి ఇంటికి వెళ్తాడు.
గరికపాటి చెప్పిన ఈ ఉదాహరణలో ఎంతో లోతైన అర్థం ఉంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సమస్యకు పరిష్కారం కాదు. విశాల దృక్పథంతో చూసినప్పుడు అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ నిలబడటానికి కారణం ఇదే.. ఓర్పు,సర్దుకుపోయే తత్వం.



Click it and Unblock the Notifications