Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మందు తాగి శృంగారంలో పాల్గొంటున్నారా? ఈ విషయం తెలిస్తే..
ప్రతి జంట తమ భాగస్వామితో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన లైంగిక జీవితాన్ని గడపాలని కోరుకోవడం సహజం. శృంగారం దంపతుల మధ్య బంధాన్ని బలపరుస్తుందన్నది నిజమే అయినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రొమాన్స్ కు ఖచ్చితంగా నో చెప్పడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోయి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇద్దరి ఆరోగ్యానికీ హాని కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం 5 సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం అత్యంత అవసరం. ఆ సందర్భాలేంటో ఇక్కడ చూడండి.

మత్తులో ఉన్నప్పుడు మైమరపు వద్దు
చాలామంది మందు తాగిన మత్తులో ఉన్నప్పుడో లేదా ఇతర మాదకద్రవ్యాల ప్రభావంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. మత్తులో ఉన్నప్పుడు మనిషికి నిర్ణయం తీసుకునే శక్తి, శారీరక సమతుల్యత, తగినంత శక్తి ఉండవు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం మద్యం సేవించినప్పుడు మన మెదడు సరైన నిర్ణయాలు తీసుకోలేదు. దీనివల్ల తెలియకుండానే తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మత్తులో ఉన్నప్పుడు శారీరక కలయికకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రక్షణ లేనప్పుడు రిస్క్ చేయొద్దు
సురక్షితమైన శృంగారం అందరికీ అవసరం. మద్యం మత్తులో ఉన్నప్పుడు కండోమ్ వాడాలనే విషయం మర్చిపోయే ప్రమాదం ఉంది. అవాంఛిత గర్భం లేదా లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రక్షణ లేని సమయంలో సంభోగానికి నో చెప్పడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జననేంద్రియ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు
స్త్రీలకు జననాంగాలలో ఇన్ఫెక్షన్లు రావడం చాలా కామన్. యోనిలో దురద, మంట, లేదా తెల్లటి ఉత్సర్గ వంటి సమస్యలు ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనకూడదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
ఎందుకంటే ఈ సమయంలో సంభోగంలో పాల్గొనడం వల్ల స్త్రీలకు విపరీతమైన నొప్పి కలగడమే కాకుండా ఆ ఇన్ఫెక్షన్ పురుష భాగస్వామికి కూడా సోకే ప్రమాదం ఉంది. ఇది ఇద్దరికీ అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
UTI సమస్య బాధిస్తున్నప్పుడు
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శారీరక కలయిక అనేది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఈ సమయంలో జననేంద్రియాలు వాపు లేదా నొప్పితో ఉండవచ్చు.
అప్పుడు సంభోగం చేయడం వల్ల ఆ నొప్పి తీవ్రమై, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. కాబట్టి పూర్తిగా తగ్గే వరకూ నిగ్రహం పాటించడం మంచిది.
మనసు బాగోలేనప్పుడు
భాగస్వామితో మానసిక అనుబంధం సరిగా లేనప్పుడు శారీరక కలయిక కూడా ఆనందాన్ని ఇవ్వదు. గొడవ జరిగిన వెంటనే సంభోగంలో పాల్గొనడం వల్ల ఆ తర్వాత అపరాధ భావన కలిగే అవకాశం ఉంది.
ముందుగా సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకున్న తర్వాతే సాన్నిహిత్యం పెంచుకోవడం ఆరోగ్యకరమైన బంధానికి నిదర్శనం.



Click it and Unblock the Notifications