Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పిల్లలను స్కూల్ కి పంపేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?..వారి భవిష్యత్తు ప్రమాదంలో!
ప్రతి రోజూ పొద్దున్నే మీ ఇంట్లో ఓ యుద్ధం జరుగుతుందా? స్కూల్ కి వెళ్లే ముందు టిఫిన్ తిననంటూ పిల్లలు మారాం చేయడం, హోం వర్క్ పుస్తకాలు కనిపించకపోవడం,టైమ్ కి ఆఫీసుకి వెళ్లాలని మీ ఆతృత..ఈ హడావుడిలో పిల్లలపై కోపం,చిరాకు పడటం సర్వసాధారణం. అయితే మీ పిల్లలను స్కూల్ కి పంపే ముందు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మ చిన్నారి రోజంతటినీ పాడుచేస్తాయని మీకు తెలుసా?
పిల్లలు మనసు పసిమొగ్గ లాంటిది. పొద్దున్నే పిల్లలు పొందే అనుభూతి వారి మానసిక స్థితిని, ఏకాగ్రతను, చదువులో ప్రతిభను నిర్ణయిస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఉదయం పూట అస్సలు చేయకూడని కొన్ని కీలకమైన తప్పుల గురించి ఇక్కడ చూడండి.

అతిగా తొందర పెట్టడం
నీ వల్ల రోజూ ఆలస్యమే..త్వరగా కానియ్..ఇంకా రెడీ అవ్వలేదా..ఇట్లాంటి మాటలు పొద్దున్నే ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి మాటలు పిల్లల మనసుల్లో తీవ్రమైన ఆందోళనను నింపుతుంది. ఆ ఒత్తిడితోనే వారు స్కూల్ కు వెళ్తారు. అక్కడ టీచర్ చెప్పే పాఠాలపై దృష్టి పెట్టలేరు, రోజంతా అభద్రతాభావంతో, చిరాకుగా ఉంటారు. వారి బుర్రలో చదువు కన్నా ఉదయం ఇంట్లో జరిగిన గొడవే మెదులుతూ ఉంటుంది.
పరిష్కారం
ఉదయం హడావిడిని నివారించడానికి ముందు రోజు రాత్రే సన్నద్ధమవ్వండి. స్కూల్ బ్యాగ్ సర్దడం, యూనిఫాం రెడీ చేయడం, మరుసటి రోజు టిఫిన్ ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం వంటివి రాత్రే పూర్తిచేస్తే ఉదయం ప్రశాంతంగా ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ విషయంలో బలవంతం లేదా నిర్లక్ష్యం
కొందరు తల్లిదండ్రులు సమయం లేదని పిల్లలకు టిఫిన్ పెట్టకుండానే పంపేస్తారు. ఖాళీ కడుపుతో పిల్లలు నీరసించిపోతారు, ఏకాగ్రత కోల్పోతారు. మరికొందరు పిల్లలు తినకపోయినా బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తారు. ఇది వారిలో ఆహారంపై విరక్తిని పెంచుతుంది, ఒక్కోసారి వాంతులకు కూడా దారితీయవచ్చు.
పరిష్కారం
పిల్లలు ఇష్టంగా తినే తేలికపాటి, పోషకమైన బ్రేక్ పాస్ట్ రెడీ చేయండి. స్మూతీ, పరాఠా, శాండ్ విచ్, ఉప్మా వంటివి ప్రయత్నించండి. తినడానికి ఇష్టపడకపోతే దాని ప్రాముఖ్యతను ప్రేమగా వివరించండి.
చదువు గురించి అనవసరమైన ఒత్తిడి
పిల్లలు స్కూల్ కు బయలుదేరుతుంటే గుమ్మం దగ్గర నిలబడి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, టీచర్ చెప్పేది శ్రద్ధగా విను,లేదంటే వంటి మాటలు చెప్పడం వారిపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల వారు పాఠశాలను విజ్ఞాన దేవాలయంలా కాకుండా కేవలం మార్కులు సంపాదించే పరీక్షా కేంద్రంలా చూడటం ప్రారంభిస్తారు. ఇది చదువుపై భయాన్ని పెంచుతుంది.
పరిష్కారం
మీ చిన్నారిని సానుకూల దృక్పథంతో స్కూల్ కు పంపండి. ఈరోజు స్కూల్‌లో బాగా ఎంజాయ్ చెయ్యి, కొత్త విషయాలు నేర్చుకో, ఈరోజు ఏం నేర్చుకున్నావో ఇంటికి వచ్చాక నాకు చెప్పు వంటి ప్రోత్సాహకరమైన మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.

ఇతర పిల్లలతో పోల్చడం
చూడు, పక్కింటి బాబు ఎంత నీట్‌గా రెడీ అయ్యాడో, మీ ఫ్రెండ్ ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది, నువ్వెందుకు అలా ఉండవు?.. ఇలాంటి పోలికలు పిల్లల సున్నితమైన మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. ఇది వారిలో ఆత్మన్యూనతా భావాన్ని సృష్టిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, స్నేహితులపై అసూయను పెంచుతుంది.
పరిష్కారం
మీ బిడ్డ ప్రత్యేకమైన వారని వారికి గుర్తుచేయండి. ఇతరులతో పోల్చకుండా వారి చిన్న చిన్న విజయాలను కూడా మనస్ఫూర్తిగా అభినందించండి.
అబద్ధాలు చెప్పడం లేదా బెదిరించడం
పిల్లలను త్వరగా రెడీ చేయడానికి తల్లిదండ్రులు కొన్నిసార్లు త్వరగా రా, లేదంటే స్కూల్ వాచ్ మెన్ తలుపులు మూసేస్తాడు అని బెదిరించడం లేదా స్కూల్ కు వెళ్తే నీకు చాక్లెట్ ఇస్తారు అని అబద్ధాలు చెబుతారు. అబద్ధాల వల్ల పిల్లలు మీపై నమ్మకాన్ని కోల్పోతారు. బెదిరింపుల వల్ల వారిలో పాఠశాల అంటేనే భయం ఏర్పడుతుంది.
పరిష్కారం
మీ పిల్లలతో ఎప్పుడూ నిజమే మాట్లాడండి. వారిని ప్రేమగా, ఓపికగా రెడీ చేయండి.



Click it and Unblock the Notifications