Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శృంగారంలో పాల్గొంటే కడుపు నొప్పి వస్తుందా? చాలా డేంజర్ వెంటనే ఇలా చేయండి,లేకపోతే
చాలా మంది శృంగారం తరువాత కడుపులో నొప్పిగా ఉందని చెబుతుంటారు. కొందరైతే ఆ నొప్పిని భరించలేరు కూడా. ఈ నొప్పి అనేది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ శృంగారం తరువాత నొప్పి అనేది సాధారణమైనది కాదు. అలా అని దానిని అలానే వదిలేయకూడదు కూడా. అసలు శృంగారం తరువాత పురుషులు, మహిళల్లో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏంటి? కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి అనేది ఈ స్టోరీలో వివరించాము, పూర్తిగా చదివి తెలుసుకోండి.
మహిళల్లో శృంగారం తరువాత కడుపు నొప్పికి కారణాలు
* శృంగార సమయంలో గర్భాశయం సంకోచించడం సహజం. కొన్నిసార్లు ఈ సంకోచాలు తీవ్రంగా ఉండి, కడుపు నొప్పికి కారణం కావచ్చు.
* గర్భాశయం వెలుపల గర్భాశయం అంతర్భాగం వంటి కణజాలం పెరిగే వ్యాధిని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. ఇది శృంగారం సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

* పెల్విక్ ప్రాంతంలోని అవయవాలలో సంక్రమణ కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. ఇది శృంగారం సమయంలో నొప్పిని కలిగిస్తుంది.
* యీస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ వాగినోసిస్ వంటి సంక్రమణలు శృంగారం సమయంలో నొప్పిని కలిగిస్తాయి.
పురుషుల్లో శృంగారం తరువాత కడుపు నొప్పికి కారణాలు
పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు లేదా అతిగా ఉద్రిక్తమైనప్పుడు శృంగారం సమయంలో పురుషులకు కడుపులో నొప్పి రావచ్చు. అలాగే ప్రోస్టేట్ గ్రంథి వాచిపోయినా, వాపుగా ఉన్నా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మూత్రనాళంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. అది కడుపునొప్పికి దారితీస్తుంది . అలాగే అల్సర్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి ఇతర అంతర్లీన ఆరోగ్య సమస్యలు నొప్పికి కారణమవుతాయి.
శృంగారం తరువాత కడుపులో నొప్పిగా ఉంటే ఏం చేయాలి?
శృంగారం తరువాత కడుపులో నొప్పిగా ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆయన మిమ్మల్ని పరిశీలించి, మీకు తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అలాగే కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు శృంగార కార్యకలాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు చాలా విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం వలన కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు దూరమైపోతాయి. దీంతో పాటు పౌష్టికమైన ఆహరం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా కాదని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు.



Click it and Unblock the Notifications