Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
కొత్తగా పెళ్లి చేసుకునే వారు.. భాగస్వామిని ఈ విషయాలు అడగకూడదు! అడిగితే పెళ్లి పెటాకులే!
కొత్తగా పెళ్లి చేసుకునే వారు తమ భాగస్వామ్యులు గురించి ఎంతో తెలుసుకోవాలనుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని, ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకొనాలని అనుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా భాగస్వామి గతంలోని సంబంధాల గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం తహతహలాడుతుంటారు. అయితే ఇలాంటి సున్నితమైన విషయాలను అడగడం కంటే అడగకుండా ఉండిపోవడమే మంచిది. ఒకవేళ అడగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? భాగస్వామిని ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజాయితీ..
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా తమ భాగస్వామి పాత సంబంధాల గురించి అడిగేటప్పుడు, ఎందుకు అడుగుతున్నారా నిజాయితీగా చెప్పాలి. కాబోయే జీవిత భాగస్వామి మీరు అడుగుతున్న విధానాన్ని, ఎందుకు అడుగుతున్నారో అన్న విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకోకుండా ఇలా నిజాయితీగా చెప్పేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ విషయంపై మాట్లాడే ముందు వారి ఇష్టాయిష్టాలు తెలుసుకొని మాట్లాడాలి. అభ్యంతరం లేదు అన్నప్పుడే ఈ విషయం గురించి చర్చిస్తే మంచిది.

సరైన సమయం ముఖ్యం..
పాత సంబంధాలు గురించి అడగడం అనేది చాలా సున్నితమైన విషయం. ఇలాంటి విషయాల గురించి అడిగేటప్పుడు సరైన సమయం, సరైన ప్రదేశం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో మీ భాగస్వామి ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి అడగండి. వారు గందరగోళంలో ఉన్నా, కోపంలో ఉన్నా ఇలాంటి విషయాల గురించి అడిగితే మీ బంధానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది.
గౌరవం, నమ్మకం..
ఏ బంధంలోనైనా ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది చాలా ముఖ్యం. అలాగే ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. అయితే గత రిలేషన్స్ గురించి చెప్పినా కూడా.. తమ భాగస్వామితో నమ్మకంగా ప్రేమగా జీవితాన్ని గడుపుతామనే నమ్మకాన్ని వారికి కలిగించాలి. మీరు వారిని గౌరవిస్తామనే ధైర్యాన్ని కల్పించాలి. గత బంధాల గురించి చెప్పిన వెంటనే వ్యతిరేకతను చూపకూడదు.
స్పష్టత తీసుకోండి..
మీ భాగస్వామి వారి గత సంబంధాల గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా వినాలి. మధ్యలో ఆటంకం కలిగిస్తే, అపార్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు కూడా వారిపై భిన్న అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సున్నితమైన విషయాల గురించి చర్చించేటప్పుడు కచ్చితంగా స్పష్టంగా వినండి. వారి బంధాలను అర్ధం చేసుకోండి. అలాగే ఇలాంటి సున్నితమైన విషయాలను పంచుకున్నందుకు వారిని అభినందించండి.
లిమిట్స్ దాటకూడదు..
గత సంబంధాల గురించి చెప్పినంత మాత్రనా అన్ని విషయాల గురించి చెప్పాలని ఏం లేదు. గతం సంబంధంలోని కొన్ని విషయాలను చెప్పకూడదని వారు భావిస్తే వారి నిర్ణయాన్ని గౌరవించాలి. అలాగే వారి హద్దులను పరిగణించి, మీ చనువును లిమిట్స్ దాటకుండా చూసుకోవాలి. అనుమానించే విధంగా ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి మాత్రం అడగకూడదు. వారికి మీరు అనుమానిస్తున్నట్లు అనిపిస్తే పెళ్లి కాస్త పెటాకులయ్యే అవకాశాలు ఉంటాయి.
మీ రిలేషన్స్ గురించి చెప్పండి..
మీ భాగస్వామి పాత రిలేషన్స్ గురించి తెలుసుకోవాలనుకునేటప్పుడు మీ రిలేషన్స్ గురించి కూడా వారికి తెలియపరచాలి. మీరు కూడా మీ రిలేషన్స్ గురించి చెప్తే వారు కూడా కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. వారిపై మీకు కూడా నమ్మకం ఉందనే ధైర్యం వారిలో కలుగుతుంది. మీరే తమకు సరైన భాగస్వామి అని భావించే ఛాన్సుంటుంది.



Click it and Unblock the Notifications