Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
మద్యం తాగి సెక్స్ చేస్తే మజా వస్తుందని తరచూ అలాగే చేస్తున్నారా.. అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
శృంగారం అనేది ఓ మత్తు. సెక్స్ కోరికలు కల్గినప్పుడు మనిషి ఓ రకమైన మత్తులో ఓలలూగుతాడు. తన్మయత్వం చెందుతూ తన భాగస్వామితో అద్భుతమైన మధురానుభూతుల్ని సొంతం చేసుకుంటాడు. చాలా మంది సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి, ఎక్కువ సేపు దాన్ని ఎంజాయ్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలోనే కొందరు ఆల్కాహాల్ తాగి సెక్స్ లో పాల్గొంటారు. దాని వల్ల ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొన్నట్లు ఫీలవుతారు.
కానీ అలా చేయడం వల్ల మీ మెదడు పని తీరుతో పాటు పరుషాంగం కూడా ప్రభావితం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మీ పురుష లైంగిక అవయవాలకు రక్తప్రసరణ తగ్గడం వ్లల ఇలా జరుగుతుందని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అధ్యయనం ప్రకారం మద్యం మత్తులో ఉన్నవారి కంటే మద్యం తాగని వరే అంగస్తంభనను సాధిస్తారని తెలిసింది. మస్తుగా తాగి మజా చేద్దామనుకుంటే వచ్చే సమస్యలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యోని పొడిబారేలా చేస్తుంది:
మద్యం ఉత్సాహాన్ని పెంచుతుంది. కానీ యోనిని చాలా డ్రైగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల మెదడుకు, లైంగిక అవయవాలకు మధ్య కమ్యూనికేషన్ కష్టంగా మారుతుంది. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత శృంగారం ఎక్కువ సేపు జరిగింది మీకు అనిపించినప్పటికీ.. యోనిలో సెన్సేషన్ తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. వెజైనా లూబ్రికేషన్ ఇబ్బందికర శృంగారానికి దారి తీయొచ్చు. దీని వల్ల మానసికంగా చాలా వీక్ అయిపోతారు.
అనుకున్న స్థాయిలో అదరగొట్టలేరు:
మద్యం తాగి సెక్స్ చేస్తే మస్తుంగా ఎంజాయ్ చేయొచ్చని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఆల్కహాల్ నిజంగానే మంచి పెర్ఫామెన్స్ చేయనివ్వదు. ఎందుకంటే ఫ్రీ రొమాన్స్ బూజింగ్ హ్యాపీ హార్మోన్, ఆక్సిటోసిన్ ను నిరోధిస్తుంది. బర్న్ ఔట్ కి కారణం అయ్యే స్థిరమైన అభిరుచిని నిరోధిస్తుంది. దీని వల్ల మీరు భవిష్యత్తులో తప్పు చేశానని ఫీలయ్యే పరిస్థితి వస్తుంది. ఫోర్ ప్లేతో మొదలు పెట్టి ప్రేమగా చెప్పుకునే కబుర్లతో ముగిసిన సెక్స్ ఎప్పటికీ.. ఇద్దరి బంధాన్ని మరింత బలపరుస్తుంది.
తాగి సెక్స్ చేస్తే భావప్రాప్తి కష్టమే:
ప్రీ రొమాన్స్ బూజింగ్ కారణంగా మీ ఉద్వేగ తీవ్రత తగ్గుతుంది. మద్యపానం కమ్యూనికేషన్ ను బాగా దెబ్బతీస్తుంది. మీరు మీ ప్రేమ మాటలను కొనసాగించలేనప్పుడు పార్టనర్ అవసరాలను తీర్చడం కూడా కష్టమే. మరోవైపు లైంగిక అవయవాల్లో రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల భావప్రాప్తి పొందలేరు. అలాగే తక్కువ అనుభూతిని పొందుతారు.
తప్పు చేసే అవకాశం:
మద్యం మత్తును తీసుకొచ్చి కళ్లు మసకగా మారేలా చేస్తుంది. దీంతో ఎవరైనా సరే ఆకర్షణీయంగానే కనిపిస్తారు. దీని కారణంగా మీరు తప్పు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది. సాధారణంగా రొమాన్స్ తర్వాత నేరాన్ని పెంచేందుకు కారణం మద్యమే. అతిగా ఆల్కహాల్ తీసుకొని.. అనవసరంగా సమస్యల్లో ఇరుక్కోకండి.
సెక్స్ సంబంధిత సమస్యలు:
మద్యం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను ప్రభావితం చేస్తాయి. ఓ వ్యక్తి తాగిన సమయంలో ప్రణాళిక లేని అసురక్షిత శృంగారంలో పాల్గొనే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో లైంగికంగా సంక్రమించే వ్యాధులకు గురికావడం సెక్స్, బూజ్ కలగలసిన ప్రధా ప్రమాదం. అసురక్షిత శృంగారం అవాంఛిత గర్భంతో పాటు అనేక అంటు వ్యాధులకు కూడా కారణం అవుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications