Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డేటింగ్ యాప్స్ లో అమ్మాయిల మనసు గెలవాలా? వెంటనే మీ ప్రొఫైల్ ఇలా మార్చేయండి!
డేటింగ్ యాప్స్ ప్రపంచం ఒక సంక్లిష్టమైన పజిల్ వంటిది. అదిరిపోయే ప్రొఫైల్ పిక్చర్, మంచి హైట్, ఆకట్టుకునే స్టైల్..అన్నీ ఉన్నా కొన్నిసార్లు ఫలితం మాత్రం శూన్యం ఉంటుంది. అయితే అసలు అమ్మాయిలు స్వైప్ చేసే ముందు ప్రొఫైల్ లో ఏం గమనిస్తున్నారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
అమ్మాయిలు రైట్ స్వైప్ చేయడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు..దాని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంటుంది. వారి ఎస్,నో నిర్ణయాల వెనుక ఉన్న అసలైన కారణాలేంటో,నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.

ప్రొఫైల్ ఫొటో
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే నానుడి డేటింగ్ యాప్ లకు 100 శాతం వర్తిస్తుంది. అమ్మాయిలు స్క్రీన్ చూడగానే మొదట గమనించేది మీ ఫోటోనే.
మీరు జీవితాన్ని ఆస్వాదించే సంతోషకరమైన వ్యక్తి అని ప్రపంచానికి చాటిచెప్పేలా మీ ఫోటో ఉండాలి. ముఖం స్పష్టంగా, ఒక చక్కని చిరునవ్వుతో ఉండే ఫోటోను ఎంచుకోండి. దయచేసి కళ్ళు కనిపించని సన్ గ్లాసెస్ లేదా మొహం సగం కవర్ చేసే ఫోటోలు వద్దు. కళ్ళు నమ్మకాన్ని కలిగిస్తాయి.
జిమ్ లో కండలు చూపిస్తూ తీసే మిర్రర్ సెల్ఫీలు ఇప్పుడు పాత ఫ్యాషన్. ఆమె మీతో మాట్లాడాలనుకుంటోంది, మీ ఫోన్ కవర్ తోనో లేదా మీ కండరాలతోనో కాదు.
బయో..మీ వ్యక్తిత్వానికి అద్దం
కేవలం ఫోటో బాగుంటే సరిపోదు, ఆగి మీ గురించి తెలుసుకోవాలంటే ఆమె మీ బయో చదువుతుంది. ఖాళీ బయో ఉందంటే మీరు బోరింగ్ అని అర్థం చేసుకుంటారు.
అమ్మాయిలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ (హాస్యం) ఉన్న అబ్బాయిలను అమితంగా ఇష్టపడతారు. మీ హాబీలను క్రియేటివ్ గా చెప్పండి. మీకు వంట చేయడం వచ్చినా, గిటార్ వాయించడం తెలిసినా కచ్చితంగా ప్రస్తావించండి. అది మీకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. టైమ్ పాస్ బ్యాచ్ రావద్దు, డ్రామా వద్దు వంటి మాటలు మిమ్మల్ని కోపిష్టి వ్యక్తిలా చూపిస్తాయి.
గ్రూప్ ఫోటోల గందరగోళం
మీ మొదటి ఫోటోనే నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి దిగింది పెడితే తప్పు చేస్తున్నట్టే. ఆ గ్రూపులో మీరు ఎవరో వెతుక్కోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. మీ మొదటి ఫోటో ఎప్పుడూ సోలోగా ఉండాలి. మీరు ఫ్రెండ్లీ అని చూపించడానికి ఫ్రెండ్స్ ఫోటోలను ఆ తర్వాత అప్ లోడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కూల్ గా వద్దు - రియల్ గా ఉండండి
అమ్మాయిలు నకిలీ ప్రొఫైల్ ను ఇట్టే పసిగట్టేస్తారు. అతిగా ఫిల్టర్లు వాడిన ఫోటోలు లేదా ఇంటర్నెట్ నుండి కాపీ చేసిన కవితలు ఇప్పుడు పనిచేయవు.
మీరు మీలాగే ఉండండి. మీరు జంతు ప్రేమికులైతే మీ పెంపుడు కుక్కతో ఫోటో పెట్టండి, ట్రావెలర్ అయితే పర్వతాల ఫోటోలు పెట్టండి.
డేటింగ్ యాప్స్ అనేవి పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ఒక అమ్మాయికి మీ ప్రొఫైల్ చూశాక,ఈ అబ్బాయి ఆసక్తికరంగా,సురక్షితంగా ఉన్నాడు అనిపిస్తేనే రైట్ స్వైప్ చేస్తుంది.



Click it and Unblock the Notifications