Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శృంగారంతో హెల్త్ బెనిఫిట్సే కాదు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయ్
దంపతుల మధ్య శృంగారంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఒత్తిడి, ఆందోళన తగ్గడం, శరీరానికి వ్యాయామం చేసినట్లుగా ఉండటం, కేలరీలు కరగడం, సంబంధం మెరుగుపడటం, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగడం ఇలా చాలానే ఉన్నాయి. శృంగారంతో సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న విషయం తెలుసా, అసలు సెక్స్ చేయడం వల్ల కలిగే బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డ్రై స్కిన్ తగ్గిస్తుంది:
రెగ్యులర్ సెక్స్ రక్త ప్రసరణను పెంచుతుంది. స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. దాని వల్ల చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది, నివారిస్తుంది. సెక్స్ వల్ల చర్మం మృదువుగా, తేమగా మారుతుంది.

2. మొటిమలు పోతాయి:
హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడం, సిస్టమ్ లో హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సెక్స్ మొటిమలు రాకుండా చేస్తుందా. చర్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.
3. యంగ్ కాంప్లెక్షన్:
లైంగిక సంపర్కం ద్వారా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా చర్మ కణాల వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది. అలాగే ఇది DHEA హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది యుక్త వయస్సు లాంటి చర్మం సొంతమవుతుంది.
4. రేడియంట్ కాంప్లెక్షన్:
భాగస్వామితో మంచి శృంగారాన్ని అనుభవిస్తే దాని వల్ల చర్మం ప్రకాశవంతం అవుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. సెక్స్ సమయంలో విడుదలయ్యే చెమట చర్మం నుండి మురికిని, జిడ్డును తొలగిస్తుంది.

5. చర్మాన్ని శుభ్రపరుస్తుంది:
సెక్స్ వల్ల చెమట పడతారు. దీని వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన ధూళి, కాలుష్య కారకాలను, సూక్షజీవులను, జిడ్డును చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. అలా చర్మం శుభ్రమవుతుంది.
6. గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
సెక్స్ సమయంలో శరీరంలో విడుదల అయ్యే కొన్ని హార్మోన్లు గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గోళ్లు చిట్లిపోవడం, గోళ్లపై ర్యాషెస్ రావడం లాంటి సమస్యలు తలెత్తవు.
7. కేలరీలు కరుగుతాయి:
దాదాపు గంటసేపు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే సుమారు 300 కేలరీలు కరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి. రెగ్యులర్ సెక్స్ కచ్చితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని మరింత ఫిట్ గా కనిపించేలా చేస్తుంది.
8. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది:
రెగ్యులర్ సెక్స్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి జుట్టు ఆరోగ్యం మెరుగుపడటం. సెక్స్ ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తుంది. లైంగిక కార్యకలాపాల సమయంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications