Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ కారణం వల్లే భార్యలను భర్తలు మోసం చేస్తారట.. ఆ కారణాలు ఏంటంటే?
ఏదైనా బంధంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా వివాహ బంధంలో విశ్వాసం అనేది చాలా అవసరం. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం లేకపోతే ఆ బంధం ఎంతోకాలం నిలబడదు. ఇలాంటి ఘటనలే ఈ మధ్య చాలా చోటు చేసుకుంటున్నాయి. భర్తను భార్యలు మోసం చేయడం, భార్యలను భర్తలు మోసం చేయడం వంటివి సర్వ సాధారణమైపోయింది. అయితే భార్యలను భర్తలు ఎందుకు మోసం చేస్తారు? దానికి గల కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం.
పురుషాధిక్యంపై ఆగ్రహం..
సాధారణంగా వివాహబంధంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. సమాజంలో కూడా పురుషాధిక్యం ఉండడం వల్ల భార్యలను భర్తలు మోసం చేస్తారట. పురుషులు సాధారణంగానే మహిళల కంటే ఎక్కువగా బాధ్యతలను తీసుకుంటారు. ఆ బాధ్యతల కారణంగా తమ జీవితంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటారు. దీంతో తామే ఉత్తములు, ఉన్నతమైన వ్యక్తులుగా భావిస్తారట. అలాగే చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి చూడడం, భాగస్వామిని తప్పుగా అర్ధం చేసుకొని వారిని మోసం చేయాలని చూస్తారట.

మానసిక అసంతృప్తి..
పురుషులు తమ భాగస్వామి నుంచి సాధారణంగా శారీరక ఆనందాన్ని కోరుకుంటారు. దాని ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలని చూస్తుంటారు. అయితే భార్య తనకు కావాల్సిన మానసిక ప్రశాంతతో పాటు శారీరక సంతోషాన్ని ఇవ్వకపోతే భర్తకు ఆమెపై అసంతృప్తి కలుగుతుందట. దీంతో ఆమెను మోసం చేయాలని అతను అనుకుంటారట.
వివాహేతర సంబంధాలు..
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు అనేది సర్వ సాధారణం అపోయాయి. దీనిని అనైతిక సంబంధం అని కూడా చెప్పుకోవచ్చు. తాము కోరుకున్నట్లు భార్యలు తమకు మానసిక సంతోషాన్ని లేదా శారీరక ఆనందాన్ని ఇవ్వకపోతే భర్త వేరే బంధాన్ని ఏర్పరుచుకుంటాడు. అలానే భార్య కూడా వేరే సంబంధాన్ని వెతుక్కుంటుంది. ఈ విషయంలో వారు ఒకరినొకరు మోసం చేయాలని అనుకుంటారట.
బోర్ కొట్టడం..
ఏ పనినైనా ఎక్కువగా చేయడం, ఎక్కువ కాలం చేస్తే ఆ పనిపై సాధారణంగానే ఆసక్తి పోతుంది. అలానే ఒక వస్తువును విపరీతంగా వాడినా దానిపై మనకు బోర్ కొట్టేస్తుంది. అది కొందరికి మాత్రమే అయినప్పటికీ.. చాలా మందిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అయితే వివాహ బంధంలో భార్య తనకు కావాల్సిన ఆనందాన్ని, ఇవ్వకపోయినా.. బోర్ కొట్టినట్లు అనిపించినా భర్త భార్యను మోసం చేయాలని భావిస్తారట. అలాగే భార్య కూడా భర్త తనకు నచ్చకపోయినా ఇలానే మోసం చేయాలని చూస్తుందట.
మోసం చేయడం కొందరు పురుషులకు అలవాటుగా మారిపోతుంది. అలాగే మహిళలకు కూడా అలానే అలవాటుగా తయారవుతుంది. దీంతో తాము మోసం చేస్తున్నట్లు తమ భాగస్వామికి తెలియదని, ఎన్ని చేసినా అది పసిగట్టలేరనే భావనతో ఇంకా మోసం చేయాలని అనుకుంటారట.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటికి ఎలాంటి శాస్త్రీయత లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications