Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈ చిన్న తప్పుల వల్లే భార్యలకు భర్తపై ప్రేమ తగ్గిపోతుందట, ఇప్పుడే సరిదిద్దుకోండి!
భార్య, భర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పిల్లలు పుట్టడం, పనిలో బిజీ అయిపోవడం, ఇద్దరి మధ్య దూరం పెరిగిపోవడం ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల వల్ల కొంత దూరం పెరిగినప్పటికీ, ప్రేమ తగ్గినట్లు అనిపించినప్పటికీ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ కొన్ని అవసర తప్పిదాలు చేయడం వల్ల వారిద్దరి ప్రేమకు భంగం కలుగుతుంది. జీవితంలో ఆ తప్పిదాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇంతకీ ఆ తప్పిదాలు ఏంటి? ఏ తప్పిదాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సమయం ఇవ్వకపోవడం..
భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే.. దంపతులిద్దరూ ఒకరినొకరు సమయం ఇచ్చుకుంటూ నాణ్యమైన క్షణాలను గడపాలి. కానీ కొందరు తమ బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా ఒకరినొకరు సమాయం ఇచ్చుకోవడం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం వంటివి చేయలేకపోతున్నారు. అందుకే దంపతులిద్దరూ ఇలా ఒకరినొకరు సమయం కేటాయించుకొని గడపడం వలన.. ఇద్దరి మధ్య ప్రేమ పెరగడంతో పాటు, ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకునే సమయం దొరుకుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ కూడా బలపడుతుంది.

కృతజ్ఞతలు చెప్పకపోవడం..
చాలా బంధాలు కృతజ్ఞతలు చెప్పకపోవడం వలన విడిపోతుంటాయి. భార్య ఓ మంచి వంటకం చేసినా, భర్త కస్టపడి ఏదైనా సాధించినా వారికి కృతజ్ఞతలు చెప్పకపోవడం వలన వారిలో ఒక అభద్రతా భావం కలుగుతుంది. తాము ఎంత చేసినా గుర్తింపు దొరకలేదనే భావన వారిలో కలుగుతుంది. అందుకే దంపతులిద్దరూ ఒకరికొకరు కృతజ్ఞతలు చేయడం నేర్చుకోండి. దీనివల్ల ప్రేమ తగ్గిపోదు అలాగే ఆ ప్రేమ బలపడుతుంది కూడా.
ఆరోగ్యం..
భాగస్వామి ఆరోగ్యం గురించి పట్టించుకోనప్పుడు వారిలో మీపై కోపం కలుగుతుంది. తాను ఎంత ఆనారోగ్యంతో బాధ పడుతున్నా తనను పట్టించుకోవడం లేదని వారిలో కోపం, ద్వేషం కలుగుతుంది. క్రమంగా మీ మధ్య దూరం పెరుగుతుంది. ప్రేమ కూడా తగ్గిపోతుంది. దీంతో పాటు భవిష్యత్తులో ఆ అనారోగ్య సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే భాగస్వామి ఆరోగ్యంపై కూడా ద్రుష్టి పెట్టడం చాలా మంచిది.
పొసెసివ్‌నెస్..
చాలా మంది దంపతుల్లో పొసెసివ్‌నెస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. తన భార్య ప్రేమ తనకే దక్కాలి, తన భర్త తనకే సొంతం అవ్వాలనే ఆలోచనల్లో కొందరు కావాలని కొన్ని తప్పులు చేస్తుంటారు. ఎవరితోనైనా మాట్లాడినా అనుమానపడడం, వారిని అనుమానించడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల వారి మధ్య బంధం బలహీనపడుతుంది. ప్రేమ కూడా బలపడదు. ఇది తీవ్రమైతే విడాకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే పొసెసివ్‌నెస్ అనేది చాలా ప్రమాదకరం. మీకు కూడా పొసెసివ్‌నెస్ ఉంటే వెంటనే దానిని వదిలేయండి.



Click it and Unblock the Notifications