Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
అమెరికా,జపాన్ కొరియా జంటలు..నెలలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటారో తెలుసా!
అభివృద్ధి చెందిన దేశాలలో మారుతున్న జీవనశైలి, దాంపత్య జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల అమెరికన్ పరిశోధన సంస్థ టాకర్ రీసెర్చ్ అండ్ వెల్నెస్ బ్రాండ్ LELO నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ప్రతి నలుగురు జంటలలో ఒకరు నెలకు ఒక్కసారి కూడా శృంగారంలో పాల్గొనడం లేదని తేలింది.
అమెరికా..ప్రేమ ఉంది,కానీ ఓపిక లేదు
2,000 మందిపై చేసిన ఈ సర్వే ప్రకారం..జంటల మధ్య సాన్నిహిత్యం తగ్గడానికి ప్రేమ లేకపోవడం కారణం కాదు. ప్రధాన శత్రువు అలసట. అమెరికాలో సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 38 శాతం మంది అలసట వల్ల శృంగారానికి దూరంగా ఉంటున్నామని చెప్పగా, ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి, ఇద్దరి కోరికల మధ్య వ్యత్యాసం ఇతర కారణాలుగా ఉన్నాయి.

సగటున అమెరికన్ జంటలు నెలకు నాలుగు సార్లు మాత్రమే కలుస్తున్నారు. ఒక్కో ఎన్ కౌంటర్ సగటున 18 నిమిషాలు ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. శారీరక కలయిక తక్కువగా ఉన్నా, 71 శాతం మంది తమ వైవాహిక జీవితం పట్ల సంతృప్తిగానే ఉన్నారు. దీన్ని బట్టి జంటలు సంభోగం కంటే ఎమోషనల్ బాండింగ్(భావోద్వేగ బంధం)కి ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థమవుతోంది.
రోజంతా ఒకరితో ఒకరు మాట్లాడుకునే జంటల్లో సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటోంది.
జపాన్,కొరియా..ఆందోళనకరమైన గణాంకాలు
అమెరికాతో పోలిస్తే ఆసియా దేశాలైన జపాన్, కొరియాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఏ విధమైన శారీరక సమస్యలు లేకుండా, నెల రోజులకు పైగా కలవని జంటలు ప్రకారం చూస్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా, జపాన్ లో 64 శాతం జంటలు ఒకే ఇంట్లో ఉన్నా శారీరక సాన్నిహిత్యానికి దూరంగా ఉంటున్నారు. అక్కడి సమాజంలో సంభోగం పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోవడాన్ని ఇది సూచిస్తోంది.
కొరియాలో 36 శాతం మంది పిల్లల పెంపకం, పని ఒత్తిడి కారణంగా వేర్వేరు గదుల్లో లేదా వేర్వేరు సమయాల్లో నిద్రించడం కొరియన్ జంటల మధ్య దూరాన్ని పెంచుతోంది.
పరిష్కారం ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా సగటున 20 శాతం జంటలు శృంగారం లేని లిస్ట్ లో జాబితాలో ఉన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య అని నిపుణులు అంటున్నారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్..అధిక పని గంటలు తగ్గించుకుని, శక్తిని కాపాడుకోవడం ముఖ్యం.
కమ్యూనికేషన్..భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం, ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది.
ప్రైవసీ..జంటలకు ఏకాంతం దొరికేలా గృహ వాతావరణం, పేరెంటింగ్ సంస్కృతిలో మార్పులు రావాలి.



Click it and Unblock the Notifications