Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
దాంపత్య జీవితంలో శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను, బంధాన్ని మరింత దృఢంగా మార్చే ఒక అందమైన అనుభూతి. అయితే బెడ్ రూమ్ లో కొన్నిసార్లు తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు భాగస్వామి మూడ్ ను పూర్తిగా చెడగొడతాయి. మీ ఏకాంత క్షణాలను మరింత ఆనందమయంగా మార్చుకోవడానికి, పడకగదిలో మీరు కచ్చితంగా నివారించాల్సిన కొన్ని తప్పులు ఏవో ఇక్కడ చూడండి.

చిందరవందరగా ఉన్న బెడ్
శృంగారానికి సిద్ధమయ్యే ముందు బెడ్ రూమ్ వాతావరణం ప్రశాంతంగా, ఆకర్షణీయంగా ఉండటం చాలా ముఖ్యం. మంచం మీద టీవీ రిమోట్లు, బట్టలు, మేకప్ వస్తువులు లేదా ఆహార పదార్థాల ప్యాకెట్లు ఉంటే అది తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఆ చెత్తను చూస్తే భాగస్వామికి రొమాన్స్ చేయాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి ముందే మంచాన్ని శుభ్రంగా, అందంగా సర్దుకోండి.
ఏకాంత సమయంలో ఫోన్లు, సెల్ఫీలు
కొంతమందికి తమ ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించడం అలవాటు. కానీ, శృంగార సమయంలో సెల్ఫీలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం లాంటివి చేస్తే భాగస్వామికి తీవ్ర ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇది వారి మనసును కలవరపెడుతుంది. అంతేకాకుండా మీ మధ్య ఉన్న రొమాంటిక్ ఫ్లోని అడ్డుకుని భావప్రాప్తికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఆ మధుర క్షణాల్లో మొబైల్స్ ను పక్కన పెట్టేయండి.
రొమాంటిక్ టైమ్ లో ఇంటి పనుల ముచ్చట్లు
భార్యాభర్తల మధ్య శృంగారం అనేది అన్ని ఒత్తిళ్లను మర్చిపోయి హాయిగా సేదతీరే సమయం. ఆ సమయంలో కరెంటు బిల్లు కట్టారా? తలుపుకు గడియ వేశారా? లాంటి ప్రశ్నలు అడిగితే మీ భాగస్వామికి ఒక్కసారిగా విసుగొస్తుంది. ఇలాంటి మాటలు ఉత్సాహంపై నీళ్లు చల్లుతాయి. ఆ సమయంలో కేవలం మీ ఇద్దరి గురించే, రొమాంటిక్ విషయాల గురించే మాట్లాడుకోండి.
వ్యక్తిగత పరిశుభ్రతను గాలికొదిలేయడం
మురికిగా ఉన్న లేదా దుర్వాసన వచ్చే లోదుస్తులు ధరిస్తే, అది మీ భాగస్వామిని మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. ఆకర్షణీయమైన, శుభ్రమైన దుస్తులు ధరించడం వల్ల రొమాన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిశుభ్రత పాటించకపోతే మూడ్ పాడవడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
మధ్యలో బాత్రూమ్ బ్రేక్స్
శృంగారంలో మునిగి తేలుతున్నప్పుడు మధ్యలో లేచి బాత్రూమ్ కి వెళ్లడం వల్ల మీ భాగస్వామి ఉత్సాహం దెబ్బతింటుంది. ఆ బ్రేక్ వల్ల అంతవరకు ఉన్న మూడ్ మొత్తం చెదిరిపోతుంది. కాబట్టి ముందే మీ కాలకృత్యాలు తీర్చుకుని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా రొమాన్స్ లో పాల్గొనడం మంచిది.
ఇతరులతో పోల్చి చూడటం
శృంగార సామర్థ్యం, లైంగిక కోరికల విషయంలో మిమ్మల్ని లేదా మీ భాగస్వామిని వేరే జంటలతో ఎప్పుడూ పోల్చవద్దు. ఇతరులతో పోల్చడం వల్ల మీ భాగస్వామిలో ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. ఇది మీ దాంపత్య బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications