Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
పొలాలు,డబ్బు కాదు..సుఖ సంసారం కావాలంటే పెళ్లికి ముందే అమ్మాయి తెలుసుకోవాల్సింది ఇదే
పెళ్లి అంటే జీవితాంతం కలిసి ఉండాలి,అదో పవిత్ర బంధం అనే విషయం నేటి తరం క్రమంగా మర్చిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విడిపోవడం, ఇద్దరి ఆలోచలను సెట్ కాలేదు కాబట్టి పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం అంటూ చాలా జంటలు విడాకులు తీసుకోవడం మన చుట్టూ సమాజంలో నిరంతరం చూస్తూనే ఉన్నాం. పెళ్లి అనేది మగవారికి అయినా లేదా ఆడవాళ్లకు అయినా జీవితంలో అత్యంత కీలకమైన మలుపు.
వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే అంతకుమించిన నరకాన్ని చూపిస్తుంది. కాబట్టి పెళ్లి ముందు అబ్బాయికి పొలాలు ఉన్నాయి, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత జీతం వస్తుంది,అబ్బాయి ఫారిన్ లో ఉన్నాడా ఇప్పటి తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం వరుడిని చూసేటప్పుడు ఆలోచిస్తున్న విషయాలు. దాదాపు చాలామంది అమ్మాయిలు కూడా డబ్బుకే మొదటి ప్రధాన్యత ఇస్తున్నారు. అయితే దాన్ని మించిన కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం.

పెళ్లికి యస్ చెప్పే ముందు అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు
కుటుంబ నేపథ్యం, వ్యక్తిత్వం
ఒక మనిషి వ్యక్తిత్వం వారి కుటుంబ సంస్కృతి, విలువలకు అద్దం పడుతుంది. కాబోయే భర్త కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ఎలా ఉంది? వారి ఆలోచనా విధానం ఎలాంటిది? అనే విషయాలు తెలుసుకోవడం ద్వారా పెళ్లి తర్వాత మీరు అడుగుపెట్టబోయే వాతావరణంపై ఒక అంచనాకు రావచ్చు. అంతకంటే ముఖ్యంగా మీ భాగస్వామి వ్యక్తిత్వాన్ని గమనించండి. పెద్దలను, ఇతరులను గౌరవిస్తారా? కష్టాల్లో ఉన్నవారి పట్ల ఎలా ప్రవర్తిస్తారు? వారి ఫ్రెండ్స్ ఎలాంటోళ్లు? ఈ ప్రశ్నలు వారి అసలు స్వభావాన్ని మీకు పరిచయం చేస్తాయి.
ఆలోచనా విధానం,జీవనశైలి
ఆ బంధం బలంగా నిలబడాలంటే ఇద్దరి ఆలోచనలు, జీవనశైలి సమానంగా లేకున్నా గానీ కొంచెం దగ్గరగా ఉండాలి. మతం, సమాజం, ఆర్థిక విషయాలపై వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి. మొదట్లో ఇవి చిన్న విషయాలుగా అనిపించినా, భవిష్యత్తులో ఇవే పెద్ద మనస్పర్థలకు దారితీయవచ్చు. మీ జీవనశైలికి, వారి జీవనశైలికి మధ్య పొంతన ఉందో లేదో ముందే చూసుకోవడం ఉత్తమం.
భవిష్యత్తుపై కలలు, ఆశయాలు
మీ భర్త భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? వారి కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరాలనుకుంటున్నారా? సొంత వ్యాపారం పెట్టాలనే ఆలోచన ఉందా? లేదా విదేశాల్లో స్థిరపడాలనే కోరిక ఉందా? వారి లక్ష్యాలు, మీ ఆశయాలు ఒకదానికొకటి అడ్డుపడకుండా చూసుకోవాలి.

కెరీర్ పట్ల వారి దృక్పథం
కెరీర్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అయితే వారు ఎక్కువ సమయం పనికే కేటాయిస్తారు. ఇది మీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపవచ్చు. వారి కెరీర్ ప్రణాళికలు మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి. ఇద్దరూ ఒకరి కెరీర్ కు మరొకరు మద్దతుగా నిలవగలరా? అనే దానిపై స్పష్టత తెచ్చుకోవడం చాలా ముఖ్యం.
బాధ్యతల, అంచనాలు
పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు, రెండు కుటుంబాలను కలుపుతుంది. పెళ్లి తర్వాత తన తల్లిదండ్రులతో పాటు, మీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలనే బాధ్యత వారికి ఉందా? రెండు కుటుంబాలను సమన్వయం చేసుకునే మానసిక పరిపక్వత ఉందా? ఈ విషయాలపై ముందే మాట్లాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే చాలా సమస్యలను అధిగమించవచ్చు.



Click it and Unblock the Notifications