Latest Updates
-
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు!
రోజూ సెక్స్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త!
భార్యాభర్తల సంబంధంలో లైంగిక కార్యకలాపాలు సహజమైనవి, ఆరోగ్యకమైనవి అలాగే అవి ఎంతో ముఖ్యం కూడా. దంపతుల మధ్య బంధం బలోపేతం కావడానికి శృంగారం ముఖ్యమైన అంశం. వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటారు అనేది వ్యక్తులను బట్టి వారి అభిరుచులను బట్టి మారుతూ ఉంటుంది.
పెళ్లైన కొత్తలో దాదాపు రోజూ సెక్స్ లో పాల్గొంటారు. రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. అయితే రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ వల్ల శారీరక ఆరోగ్య ప్రయోజనాలు:
కార్డియోవాస్కులర్ హెల్త్: శృంగారం అనేది ఓ వ్యాయామంలా తరహాలో హృదయ స్పందన రేటు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ: లైంగిక కార్యకలాపాలు ఇమ్యునోగ్లోబులిన్ A(IgA) పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది అంటువ్యాధుల నుంచి రక్షించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
హార్మోన్ల సమతుల్యత: లైంగిక చర్య వల్ల ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్, డోపమైన విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.
సెక్స్ వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు:
ఒత్తిడిని తగ్గిస్తుంది: లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి.
బంధం, సాన్నిహిత్యం: తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల దంపతుల మధ్య భావోద్వేగ సంబంధం మెరుగుపడుతుంది. ఇద్దరి మధ్య విశ్వాసం పెరుగుతుంది. సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. ఇది మరింత గాఢమైన బంధానికి దారితీస్తుంది.
మెరుగైన మానసిక స్థితి: సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆనందగాన్ని, సంతృప్తి అందిస్తాయి. చక్కని విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహిస్తాయి.
రోజూ సెక్స్ చేయడం వల్ల దుష్ప్రభావాలు:
శారీరక అలసట: రోజూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా అలసటకు లోనవుతారు. సెక్స్ తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోకపోతే రోజువారీని పనితీరుపై ప్రభావం పడుతుంది.
నొప్పి లేదా అసౌకర్యం: తీవ్రమైన లేదా సుదీర్ఘమైన లైంగిక కార్యకలాపాలు తాత్కాలిక నొప్పిని లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మంచి లూబ్రికేషన్, కమ్యూనికేషన్ లేకపోతే ఇది మరింత ఇబ్బంది పెడుతుంది.
అంచనాలు, ఒత్తిడి: ప్రతి రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల అంచనాలు లేదా పనితీరుపై ఒత్తిడి పడుతుంది. ఇది ఒత్తిడికి లేదా అసమర్థత యొక్క భావాలకు దారితీస్తుంది.
కమ్యూనికేషన్: రోజూ సెక్స్ చేసుకోవడం వల్ల భాగస్వాములు ఇద్దరూ ఎలాంటి ఒత్తిడి అనుభవించడం లేదని, అది వారికి కూడా ఇష్టమేనని వారు చెబితే సమస్య లేదు. వద్దు అంటే ఏమనుకుంటారోనని ఇష్టం లేకపోయినా, ఇబ్బందిగా ఉన్నా సెక్స్ లో పాల్గొంటే సుఖం ఉండదు సరికదా అసౌకర్యానికి దారితీస్తుంది.
- రోజూ సెక్స్ లో పాల్గొనడం ద్వారా యోని పొడిబారవచ్చు. వెజైనల్ టియర్స్ కు కారణం కావొచ్చు.
- రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు(UTI) ప్రమాదం పెరుగుతుంది. శరీర ద్రవాలు యోని pH స్థాయిలను మార్చవచ్చు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది.
- రోజూ సెక్స్ చేసుకోవడం వల్ల శృంగారంపై ఆసక్తి కోల్పోవచ్చు. రోజువారీ లైంగిక కార్యకలాపాల వల్ల అలసిపోవడం ద్వారా ఇలా అనిపిస్తుంది.
- రోజూ శృంగారంలో పాల్గొనడం ద్వారా శరీరం కష్టపడి అలసపోతుంది. గాఢమైన సెక్స్ వల్ల శరీరం చాలా అలసిపోతుంది.
- రోజూ సెక్స్ వల్ల కొందరు మహిళలో యోని ఎర్రబడటం, ఉబ్బడం లాంటివి జరుగుతాయి. దీని వల్ల సెక్స్ సమయంలో నొప్పి రావొచ్చు. మూత్ర విసర్జన సమయంలో మంటతో కూడిన నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు.
- రోజూ శృంగారం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెట్టవచ్చు. కొందరిలో ఇది ఎక్కువగా ఉండొచ్చు. సెక్స్ సమయంలో చేసే భంగిమలు దీనికి కారణం అవుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications