Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమస్యలు చూసి పెళ్లి వద్దు అనుకుంటున్నారా? ఎన్ని ఉపయోగాలు మిస్ చేసుకుంటున్నారో తెలుసా?
పెరుగుతున్న ఖర్చులు, సమాజంలో జరుగుతున్న ఘటనలు, పెళ్లి తరువాత వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటున్నారు. మొదట్లో ఎప్పుడు పెళ్లి అని ఆరాటపడే వ్యక్తులు.. ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం అని బాధపడుతున్నారు. అయితే ఈ మాటలు కొన్నిసార్లు సరదాగా ఉన్నప్పటికీ.. వివాహం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. పెళ్లి వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్యపరంగానైనా, ఆర్థికపరంగానైనా, ఏవిధంగా చూసుకున్న ప్రయోజనాలు చాలానే ఉంటాయి. అయితే పెళ్లి వల్ల ఎలాంటి లాభాలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శారీరక, మానసిక ఆరోగ్యానికి
పెళ్లి అనేది శారీరక, మానసిక శాంతి సాధనకు తోడ్పడుతుంది. వివాహం చేసుకున్నవారు తమ జీవితంలో సమతుల్యతను గుర్తించి, సుఖంగా జీవించేందుకు ప్రయత్నిస్తారు. ఒక మంచి భాగస్వామితో తమ అనుభవాలు, ఆనందాలు పంచుకుంటారు. ఇది వారి మనసుకు సంతోషం, స్థిరత్వం ఇస్తుంది. అలాగే సెక్యూరిటీగా అనిపిస్తుంది.

ఆరోగ్య పరంగా
కొన్ని పరిశోధనలు ప్రకారం, పెళ్లి చేసుకున్నవారు పెళ్లి కాని వారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటారు. పెళ్లి చేసుకోవడం వలన కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. ఆ సమస్యలను తీర్చుకోవడానికి తమతో పాటు ఓ వ్యక్తి ఉంటారని వారు అర్ధం చేసుకొని సంతోషంగా ఉంటారు. అలాగే వారిని పెళ్లి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరణ కల్పిస్తుంటుంది.
ఆర్థికంగా
పెళ్లి వల్ల ఆర్థిక వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి కష్టపడి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవచ్చు. అయితే, ఈ విషయంలో భాగస్వాముల మధ్య మంచి అండర్‌స్టాండింగ్ అవసరం.
సామాజికంగా
వివాహం చేసుకుని పిల్లలను పెంచడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు సాధించవచ్చు. అలాగే పిల్లల అభివృద్ధితో మంచి ఆర్ధిక పరిస్థితిని పొందడంతో పాటు మంచి గుర్తింపును సొంతం చేసుకోవచ్చు. అలాగే సమాజంలో శాంతియుతంగా, గౌరవంగా ఉండేందుకు ఈ వివాహం ఎంతగానో ఉపయోగపడుతుంది.
వ్యక్తిగత అభివృద్ధి
పెళ్లి జీవితం వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో కమ్యూనికేషన్, కాంప్రమైజింగ్, జీవితంలోని వివిధ సవాళ్లను ఎదుర్కొనడం వంటి అనేక అంశాలను నేర్చుకుంటాం. దీని వల్ల మనలో పాజిటీవ్ మార్పులు వస్తాయి.
కుటుంబ ఏర్పాటు
వివాహం వల్ల ఒక శక్తివంతమైన కుటుంబం ఏర్పడుతుంది. ఈ కుటుంబం హార్మనియస్, సంతోషకరమైన సంబంధాలతో నిండి ఉంటుంది. కుటుంబంలో సహజంగా ఉండే పరస్పర ప్రేమ, ఆనందం, వంటి అనుబంధ సంబంధాలు మన జీవితంలో కొంత సంతోషం తెస్తాయి.



Click it and Unblock the Notifications