Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
సంచలనం! లవ్ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఇది తెలిస్తే సింగల్ కూడా ఉండేవాళ్ళు కాడమో!
"ఒకరికొకరు ప్రేమించుకోవడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని నిలబెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి" అని మన పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల నిజమైన ప్రేమపై జరిపిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పరిశోధనలు చెబుతున్నదేమిటంటే, నిజమైన ప్రేమ, పరస్పర అనుబంధం మన ఆరోగ్యానికి అసాధారణ లాభాలను అందిస్తుందని తేలింది. ప్రేమతో నిండిన సంబంధం ఉంటే మనం మరింత ఆరోగ్యంగా, సంతోషంగా జీవించగలమని నిపుణులు స్పష్టంగా తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలను ఈ స్టోరీలో కలిసి తెలుసుకుందాం రండి..
పరిశోధనల ఏమి చెబుతున్నాయి?
30 సంవత్సరాల పరిశోధనల ఫలితాల ఆధారంగా ఇటీవల నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం, ప్రేమ, మంచి సంబంధాలు.. యువత లేదా మధ్య వయస్సు వ్యక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీని ద్వారా వారు దీర్ఘాయువును కూడా పొందుతున్నట్లు రుజువైంది. అలాగే వారు అందరి కంటే ఎక్కువగా సంతోషంగా ఉంటున్నారని తేలింది.

ప్రేమ, మెదడుపై ప్రభావం:
ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచించినప్పుడల్లా, మన మెదడులో "డోపమైన్" అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. భాగస్వామితో సమయం గడిపితే, ఆక్సిటోసిన్ అనే మరో హార్మోన్ కూడా విడుదలై, మనం మరింత సురక్షితంగా, సాంత్వనభరితంగా భావిస్తాం. ఇది విశ్వాసాన్ని, అనుబంధాన్ని పెంచుతుందని ఆ పరిశోధనలో వెల్లడైనట్లు.. అధికారులు తెలిపారు.
గుండె ఆరోగ్యానికి ప్రేమతో లాభం:
ప్రియమైన వ్యక్తి సమీపంలో ఉన్నప్పుడు గుండె వేగంగా తడబడడం మీరు అనుభవించి ఉంటారు. ఇది డోపమైన్ ప్రభావం కూడా కావచ్చు. గుండె గట్టిగా, ఆరోగ్యంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది. అలాగే, ఆక్సిటోసిన్ ధమనుల్లో వాపును తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ప్రేమ ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఒత్తిడి జీవన శైలిలో సాధారణం అయిపోయిన ఈ కాలంలో, ప్రేమ మరియు అనుబంధం మనలో సానుకూల మార్పులు తేవగలవు. మంచి సంబంధం ఉండడం వలన కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ప్రేమతో నిండిన జీవితం సమస్యలను తేలికగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
రొమాన్స్ జీవితానికి వరం:
రొమాంటిక్ అనుబంధం కేవలం భావోద్వేగాల సముపార్జనే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుంది. 2011లో జరిగిన అధ్యయనం ప్రకారం, బలమైన సంబంధాల్లో ఉన్నవారి ఆయుష్షు మరింత పెరుగుతుంది. గుండెజబ్బులు, రక్తపోటు సమస్యలు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రేమ పంచుకోవడం వల్ల వ్యక్తిత్వంలో మార్పు:
ఆశావాదం పెరగడం: సానుకూల సంబంధం వలన ప్రపంచాన్ని కూడా సానుకూలంగా చూడగలమవుతాం.
ఆత్మవిశ్వాసం పెరుగుదల: గౌరవభరితమైన సంబంధం ద్వారా మన ఆత్మవిశ్వాసం బలపడుతుంది.
జీవిత సమతుల్యత: పరస్పర అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలోని ఒడిదుడుకులను కలిసి ఎదుర్కోవడం సులభం అవుతుంది.



Click it and Unblock the Notifications