Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శృంగారంలో పాల్గొనడానికి బెస్ట్ టైం ఇదే.. ఈ టైంలో శృంగారంలో పాల్గొంటే ఎన్ని లాభాలో తెలుసా?
ప్రతి మనిషికి శృంగారం అనేది చాలా ముఖ్యం. శృంగారం అనేది సృష్టికి మూలం కూడా. ఇది స్త్రీ, పురుషుల శారీరక సంబంధంతో పాటు వారి మధ్య మానసిక అనుబంధానికి, మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శృంగారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి కూడా. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ శృంగారం సరైన సమయంలో పాల్గొనడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట. ఏ సమయంలో శృగారంలో పాల్గొనే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సమయాన్ని బట్టి ఫలితాలు
శృంగారం అనేది సాధారణ శారీరక లైంగిక ప్రక్రియనే. కాకపోతే శృంగారంలో పాల్గొనే సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్ని వేళలా ఒకే విధమైన ఫలితాలు ఉండవని పేర్కొంటున్నారు. సంతానం కోసం ఓ సమయంలో, మానసిక ప్రశాంతత కోసం మరో సమయంలో, భావప్రాప్తి కోసం మరో సమయం ఉంటుందని చెబుతున్నారు. ఆ సమయాలు ఏవంటే..

సంతానం కోసం
సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితాలు లభిస్తాయట. ఆ సమయంలో పురుషుల్లో వీర్యం చాలా ఆరోగ్యవంతంగా చురుకుగా ఉంటుందని, ఆ సమయంలో శృంగారంలో పాల్గొనే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. సంతానం కోసం ప్రయత్నించే వ్యక్తులు ఆ సమయంలో పాల్గొనాలని చెబుతున్నారు.
భావప్రాప్తి కోసం
స్త్రీ, పురుషుల్లో ఎక్కువగా లైంగికపరమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. స్త్రీ లేదా పురుషుడు లైంగికంగా సంతృప్తి పొందలేకపోతారు. అలాంటి దంపతులు ఉదయం ఎనిమిది గంటల ముందు శృంగారంలో పాల్గొంటే సరైన భావప్రాప్తి పొందుతారు. ఆ సమయంలో దంపతులిద్దరిలో టెస్టొసిరాన్ లెవెల్స్ సమర్ధవంతంగా సమానంగా ఉంటుందని, ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే ఎక్కువ సేపు పాల్గొనవచ్చని సూచిస్తున్నారు.
ఒత్తిడి నివారణకు
శృంగారంతో ఒత్తిడి కూడా దూరమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. ఎవరైతే ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారో అలాంటి వ్యక్తులు మధ్యాహ్నం 3 గంటలకు శృంగారంలో పాల్గొంటే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చట. ఈ సమయంలో స్త్రీ పురుషులిద్దరిలో సమానమైన హార్మోన్లు ఉంటాయని, అవి ఒత్తిడిని దూరం చేసేందుకు సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఆ సమయంలో రక్తపోటు కూడా తగ్గిపోతుందట.
తెలివితేటల కోసం..
రాత్రి ఎనిమిది గంటలకు శృంగారంలో పాల్గొంటే తెలివితేటలు పెరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే మెదడులో హిప్పోకాంపస్ అనే భాగంలో ఎక్కువగా కణాలు పుడతాయట. దీని కారణంగా మెదడు కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని చెబుతుంటారు.



Click it and Unblock the Notifications