Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ లవర్ మరొకరితో శృంగారం చేస్తుంటే..ఇలా ఈజీగా కనిపెట్టవచ్చు!
వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ఓ సర్వే రిపోర్ట్ లో..దేశంలోనే వివాహేతర సంబంధాల్లో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం టాప్ లో నిలిచింది. పెద్ద పెద్ద మెట్రో నగరాలను సైతం వెనక్కి నెట్టి టైర్ 2 సిటీ అయిన కాంచీపురం ఈ జాబితాలో నిలిచింది. సర్వేలో పాల్గొన్నవారిలో సగంమందికి పైగా తాము వివాహేతర సంబందంలో ఉన్నట్లు అంగీకరించారు. వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇ ఈ భయంతోనే కొందరు యువకులు పెళ్లి చేసుకోడానికి కూడా భయపడుతున్నారు.
కాలం గడుస్తున్నకొద్దీ సంబంధాల్లో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి,నమ్మకం తగ్గిపోతుంది. కొంతమంది అయితే రెండు మూడు ఎఫైర్లు కూడా కొనసాగిస్తున్నారు. అయితే మీ లవర్ లేదా భాగస్వామి మరొకరితో సంబంధంలో ఉన్నట్లు,మరొకరితో శృంగారంలో పాల్గొంటుందేమో అని మీకు సందేహాలు ఉన్నా కూడా ఈ విషయాన్ని వారిని నేరుగా అడగలేరు. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన వారే..ఇప్పుడు మనసులో మరొకరికి చోటిస్తున్నారేమోనన్న సందేహం చాలామందిని వేధిస్తోంది. మీ భాగస్వామి ప్రవర్తనలో కూడా ఈ మధ్య ఏదైనా మార్పు గమనించారా? మిమ్మల్ని దూరం పెడుతున్నారని అనిపిస్తోందా? నేరుగా అడగలేని ఆ సందిగ్ధత మిమ్మల్ని దహించివేస్తోందా? కొన్ని సంకేతాలను గమనిస్తే వారి మనసులో ఏముందో గ్రహించడం కాస్త సులభం కావచ్చు.

భావోద్వేగాలలో మార్పు
ఒకప్పుడు మీతో గంటల తరబడి ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడే మీ భాగస్వామి ఈ మధ్య చిన్న విషయాలకే చిరాకు పడుతున్నారా? వారి కోపం, బాధ వంటి భావోద్వేగాలను ప్రదర్శించే తీరులో అకస్మాత్తుగా మార్పు వచ్చిందా? మీ సంతోషంలో పాలుపంచుకోకుండా మీ బాధను పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటే ఇది మీ బంధంలో ఏర్పడిన భావోద్వేగపు దూరానికి మొదటి సంకేతం కావచ్చు.
మీతో ఉన్నా కూడా మనసు ఎక్కడో
మీరు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినకుండా ఎక్కడో ఆలోచనల్లో తేలిపోతున్నారా? మీ కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా? శారీరకంగా మంచం మీద మీ పక్కనే ఉన్నా కూడా.. మానసికంగా వారు వేరే ప్రపంచంలో విహరిస్తున్నట్లు మీకు అనిపిస్తుంటే మాత్రం వారి ఆలోచనలను, సమయాన్ని మరొకరు ఆక్రమించి ఉండవచ్చు.
మొబైల్ ఫోనే వారి ప్రపంచంగా మారితే
ఒకప్పుడు మామూలు వస్తువులా పక్కనపడేసిన సెల్ ఫోన్ ని ఇప్పుడు అపురూపమైన నిధిలా కాపాడుకుంటున్నారా? దానికి కొత్త పాస్ వర్డ్ లు పెట్టడం, మీరు దగ్గరికి రాగానే స్క్రీన్ ను దాచేయడం, అర్ధరాత్రి పూట రహస్యంగా చాటింగ్ చేయడం లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటం వంటివి చేస్తున్నారా? ఫోన్ మోగగానే బయటకు వెళ్లి మాట్లాడటం గమనిస్తే అది ప్రమాద ఘంటికే. వారు మరొకరితో ఎఫైర్ కొనసాగిస్తున్నారనడానికి ఇదొక సంకేతం.

అకస్మాత్తుగా అందంపై శ్రద్ధ
గతంలో తమ రూపం, దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోని మీ భాగస్వామి ఉన్నట్లుండి అందం మీద, అలంకరణపై విపరీతమైన శ్రద్ధ చూపుతున్నారా? గంటల తరబడి అద్దం ముందు గడుపుతూ, ఖరీదైన దుస్తులు, పరిమళాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా? ఈ మార్పు వెనుక మరొకరిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం దాగి ఉండే అవకాశం ఉంది.
అతిగా ఆరా తీయడం
గతంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో పెద్దగా పట్టించుకోని వ్యక్త, ఇప్పుడు మీ ప్రతి కదలికను అనుమానంగా గమనిస్తున్నారా? ఎక్కడున్నావ్? ఎవరితో ఉన్నావ్? అని పదే పదే ప్రశ్నిస్తున్నారా? ఇది మీపై ప్రేమతో చేస్తున్న విచారణ అనుకుంటే పొరపాటే. వారు తమ కొత్త సంబంధంతో బయట ఉన్నప్పుడు, మీరు వారికి అనుకోకుండా తారసపడకూడదనే భయంతోనే ఈ అతి జాగ్రత్త కావచ్చు.



Click it and Unblock the Notifications