Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలిపే నిజమైన లక్షణాలు
చాలా మంది మహిళలు, వివిధ రకాల మనస్థత్వం కలిగిన పురుషులతో స్త్రీలు కలుస్తుంటారు, డేట్ చేస్తుంటారు మరియు సంబంధం కొనసాగిస్తుంటారు. ఇలా ప్రేమజీవితం గడిపే సమయంలో లేదా సందర్భాల్లో ఒకటి లేదా చాలా అనుభవాలను చవిచూసుంటారు . అందులో ముఖ్యంగా అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా ప్రేమించడం లేదా అనే అనుమానం కలిగి ఉండవచ్చు.
అందువల్ల, అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా ప్రేమిండచం లేదా?అని తెలుసుకోవడం ఎలా?అతనిలో ఈ 7 లక్షణాలు లేదా చిహ్నాలను మీరు గమనించినట్లైతే ఖచ్చితంగా అతను మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నట్లు తెలియజేస్తాయి. మరి ఆ లక్షణాలేంటో ఒకసారి చూద్దాం...

అతను మిమ్మల్ని బాగా చూసుకుంటారు:
మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ భావాలు, మీ అవసరాలు మరియు మీ కోరికలను తీర్చే విధంగా ఉంటారు. వీటికోసం అతని కోరికలు అవసరాలుగా భావిస్తాడు. అతను మీ శ్రేయస్సును కోరుకొనే వాడై ఉంటాడు మరియు మీ జీవితం సంతోసంగా మరియు బెటర్ గా ఉండేట్లు చేస్తాడు . మిమ్మల్ని సంతోషంగా ఉంచడం మాత్రమే కాదు, ఇంకా అతను మీ కుటుంబంతో మరియు స్నేహితులతో సన్నిహితంగా మంచిగా ఉంటారు.

సమయాన్ని పాటిస్తాడు:
అతును ఎక్కువ రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతాడు. అతను అందుబాటులో ఉన్నప్పుడు అతనితో మీరు ఉండాలనుకుంటాడు మరియు అతనికి సమయం ఉన్నప్పుడు మీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతాడు. మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు , మీ టైమ్ ప్రకారం షెడ్యుల్ ప్రకారం మిమ్మల్ని కలుస్తాడు. ఇంకా ముఖ్యమైన దినాలు పుట్టిన రోజులు, మేజర్ హాలిడేస్ వాలెంటైన్ డే , థ్యాంక్స్ గివింగ్ మరియు న్యూఇయర్ వంటి వాటికి తప్పనిసరిగా కలుస్తుంటారు.

మీకు ప్రాముఖ్యతను ఇస్తారు
అతని మనస్సులో మీరున్నప్పుడు తరచూ మీతో కాంటాక్ట్ లో ఉంటారు. ఏదైనా ఒక నిర్ణం తీసుకొనేటప్పుడు మరియు ఏవైనా పనులు తలపెట్టేటప్పుడు మీ అభిప్రాయం తెలుసుకుంటాడు. అతను మాట్లాడేటప్పుడు ‘నేను'కు బదులుగా ‘మనం' అని సంభాషిస్తాడు . మరియు అతను ఫ్యూచర్ ప్లాన్స్ లో మిమ్మల్ని కూడా చేర్చుకుంటారు.

అతను మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు:
ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారు మంచి జరిగినప్పుడు , ఆ సంతోషాన్ని మీతో కూడా పంచుకుంటాడు. మీరు ఛాలెంజ్ గా ఏదైనా నిర్ణయాలు తీసుకొన్నప్పుడు వాటిని గౌరవిస్తాడు. మీరు కష్టంలో ఉన్నప్పడు మీగురించి కేర్ తీసుకుంటాడు. మీ విషయాలను గుర్తుంచుకొని బహుమతులతో సర్ ప్రైజ్ చేస్తారు. మీ పుట్టినరోజులకు, క్రిస్మస్ మరియు వాలెంటైన్ డే వంటి రోజుల్లో బహుమతులతో మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. మిమ్మల్ని మరింత ఉత్తమంగా చూడాలనికోరుకుంటాడు.

మీగురించి ఇతరులకు తెలియాలనుకుంటాడు:
పబ్లిక్ లో మీ చేయి పట్టుకొని , లేదా మీ చుట్టూ చేతులేసుకొని లేదా హగ్ చేసుకొని ఉండాలని కోరుకుంటాడు . అతను మీతో ఉండటానికి గర్వపడుతాడు మరియు అతను కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు పరిచయం చేయాలని కోరుకుంటాడు. ఫ్యామిలి ఫంక్షన్లకు మరియు స్నేహితులతో కలవాడనికి , కంపెనీ ఈవెంట్స్ కు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతాడు .

మీ సంబంధాన్ని సమగ్రతతో నిర్వర్తిస్తాడు:
అతను మిమ్మల్ని నమ్మదగిన విధంగా మరియు విశ్వాసం కలిగి ఉంటాడు . అతని పాత స్నేహితులు మరియు గర్లఫ్రెండ్స్ గురించి మరియు అతని సన్నిహితుల గురించి మీకు చెబుతాడు . అతని చెప్పలేకపోతే, మీరే అడిగి తెలుసుకోవడం మంచిది. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం అతని కలిగి ఉండాలి . అతను ఫర్ ఫెక్ట్ గా లేకపోతే మంచిగా మార్చడానికి ప్రయత్నించవచ్చు.

అతను మీతో మంచిగా ఉండాలని కోరుకుంటాడు.
మిమ్మల్ని ప్రేమించే వాడు మీకు నచ్చిన పనులను చేయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు . మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీరు గడపడానికి ఇష్టపడుతారు . జీవితంలో మీరు సంతోషంగా మీకు నచ్చినట్లు ఉండేట్లు కోరుకుంటారు .



Click it and Unblock the Notifications











