Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
అమ్మాయిని ఎట్రాక్ట్ చేయాలంటే అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్
అమ్మాయిలు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని.. తమ డ్రీమ్ గల్స్ గురించి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు అబ్బాయిలు. అయితే మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు అమ్మాయిల ఆలోచనలు కూడా మారిపోయాయి. డ్రీమ్ బాయ్ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. తమను చేసుకోబోయే వాడి గురించి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
అందం, ఉద్యోగం, కుటుంబం గురించే కాదు.. అబ్బాయిల ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవితాంతం గడపాల్సిన అబ్బాయి విషయంలో కొన్ని ముఖ్యమైన క్వాలిటీస్ ఉండాలని భావిస్తున్నారు. ఇంతకీ అమ్మాయిలు అబ్బాయిల నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటో చూద్దాం...

చిరునవ్వు
అమ్మాయిలు అబ్బాయిల నుంచి ముందుగా ఎక్స్ పెక్ట్ చేసేది చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం.. నవ్వుతూ ఉల్లాసంగా.. సంతోషంగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించగలరు.

పర్సనాలిటీ
అబ్బాయిల పర్సనాలిటీ అమ్మాయిలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చూడగానే ఆకట్టుకునే శరీరం, ఫిట్ గా పర్సనాలిటీ ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు. ఎత్తుగా.. లేదా పొట్టిగా.. లావుగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోలేరు.

నయన సోయగం
అబ్బాయిని చూడగానే అమ్మాయిలను ఆకట్టుకునేవి కళ్లు. వాళ్ల చూపులు మాత్రమే కాదు.. అమ్మాయిని చూసే విధానం కూడా గమనిస్తారు. ఎదుటివ్యక్తి తన గురించి ఏం ఆలోచిస్తున్నాడో అమ్మాయి కళ్లలో గమనిస్తూ ఉంటుంది అమ్మాయి.

స్టైల్
సాధారణంగా అమ్మాయిలను ఎట్రాక్ట్ చేయడానికి అబ్బాయిలు చాలా ప్రయత్నిస్తుంటారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ పై దృష్టి పెడతారు. బట్టల తల ఉన్న అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. అందం, జుట్టుపై శ్రద్ధ చూపించని అబ్బాయిలను అమ్మాయిలు పట్టించుకోరు.

నవ్వించే వాళ్లను
అమ్మాయిలు నవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. సరదాగా జోకులు వేస్తూ.. నవ్వించే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారు. అంతేకాదు.. వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తారు.

మనస్తత్వం
అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా గమనించేది స్వభావం. అమ్మాయిలతో ప్రవర్తించే విధానం.. ఎదుటివాళ్లతో ఎలా మెలుగుతారు అనే అంశాలను బాగా గమనిస్తారు. అమర్యాదపూర్వకంగా ఉండేవాళ్లను పట్టించుకోరు.

మాటతీరు
అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల మాటతీరుని గమనిస్తారు. మాట్లాడే విధానం, మాటలు, భావ వ్యక్తీకరణ, నిజాయితీ.. ఇలా అన్ని విషయాలను పరిశీలిస్తారు. నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు.

నమ్మకం
అహంకారం, చిరాకు పడే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు అమ్మాయిలు. నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తులే వృత్తి పరంగా, వ్యక్తిగతంగా స్థిరంగా ఉంటారని అమ్మాయిల భావిస్తారు.

ఉద్యోగం
అబ్బాయిల ఉద్యోగం విషయంలో అమ్మాయిలు ఆచితూచి వ్యవహరిస్తారు. వాళ్ల ఉద్యోగం ఎలాంటిది, ఎంతవరకు మంచిది, ఎంతవరకు ఉద్యోగంలో కొనసాగుతాడు అని అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. అమ్మాయిలను ఆకర్షించాలంటే.. అబ్బాయిలు ఈ అంశాలన్నింటిలోనూ పక్కాగా ఉండాల్సిందే.



Click it and Unblock the Notifications