Latest Updates
-
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.!
30 ఏళ్ళకు పైబడ్డ బ్రహ్మచారుల గురించి జనం అనుకునే 10 ఇంట్రెస్టింగ్ విషయాలు!!
బ్రహ్మచారులంతా పెళ్ళికి సిద్ధంగా ఉండాలంటే – వారందరికీ సల్మాన్ ఖాన్ లాంటి అదృష్టమూ వుండదు, అలాంటి అందమూ వుండదు. 30 ఏళ్ళు దాటి కూడా పెళ్లి కాని బ్రహ్మచారి సమాజం దృష్టిలో పడతాడు.
బ్రహ్మచారులంతా పెళ్ళికి సిద్ధంగా ఉండాలంటే – వారందరికీ సల్మాన్ ఖాన్ లాంటి అదృష్టమూ వుండదు, అలాంటి అందమూ వుండదు. 30 ఏళ్ళు దాటి కూడా పెళ్లి కాని బ్రహ్మచారి సమాజం దృష్టిలో పడతాడు, రాత్రికి రాత్రి అందరికీ చర్చా విషయం అయిపోతాడు. భారతదేశంలో 30 ఏళ్ళకు పైబడ్డ బ్రహ్మచారి జీవితం దుర్భరమే!
జనమంతా వారిని పెళ్లి గురించి అడుగుతూ వుంటారు, సంతృప్తికర సమాధానాలు రాకపోతే ఇక వాళ్ళ మీద అభిప్రాయాలు ఏర్పరచేసుకుంటారు. “అందరితోనూ కలవలేడేమో” అనో లేక “మత్తు మందులకు అలవాటు పడి ఉంటాడు” అనో లేదా “స్వలింగ సంపర్కి కామోసు” అనో బ్రహ్మచారుల గురించి సహజంగా అనుకుంటూ వుంటారు. అయితే గోడకి అవతలి వైపు అసలు చిత్రం పూర్తిగా వేరుగా వుంటుంది.
కొంత మంది మగవారు కావాలనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే, కొంతమంది సరైన అమ్మాయి కోసం వేచి వుంటారు. ఎలా అయినా బ్రహ్మచారులనే ఎక్కువగా ప్రజలు అపార్ధం చేసుకుంటారు.
ఓ వైపు పెళ్ళైన స్నేహితులేమో ఒంటరిగా వుంటే వచ్చే లాభాల గురించి చెప్తుంటే, కుటుంబీకులు, బంధువులు, పొరుగు వారు పెళ్లి చేసుకోమని పోరుతూ వుంటారు. భారతదేశంలో పెళ్లి బ్రహ్మచారి జీవితం అంత తేలికేమీ కాదు. 30 వ పడిలో వున్న బ్రహ్మచారుల గురించి జనం అనుకునే విచిత్రమైన విషయాలను మీ ముందు ఉంచుతున్నాం.

లెక్కలేని వాడు/పరిపక్వత లేని వాడు
మీరు మీలానే వున్నా కూడా ప్రజలు మిమ్మల్ని బాధ్యత లేని వాడనో లేక పరిపక్వత లేని వాడనో అనుకుంటారు. పెళ్లి చేసుకోవడం పట్ల మీరు అంత సీరియస్ గా ఉండక పోవడాన్ని వాళ్ళు అసలు అర్ధం చేసుకోలేరు.

నిరుద్యోగి
మీరు ఒక ప్రముఖ సంస్థలో పని చేస్తున్నప్పటికీ మీకు మంచి ఉద్యోగం లేదని వారు భావిస్తారు. దీనివల్లనే మీకు సరైన అమ్మాయి దొరకడంలేదని వారు అనుకుంటూ వుంటారు.

రాత్రంతా పార్టీలు చేసుకుంటారు
మీ స్నేహితులు మీకు చాలా సమయం వుందని అందువల్ల మీరు రాత్రంతా పార్టీ చేసుకుంటూ ఉంటారని అనుకుంటారు. అయితే మీరు బ్రహ్మచారి గనుక మీ బాస్ మీకు అదనపు పని అప్పచేప్పాడని మీకు మాత్రమె తెలుస్తుంది.

ప్రతి అమ్మాయినీ పడేయాలని ప్రయత్నిస్తుంటాడు.
మీరు ఒంటరి వారు కాబట్టీ, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కాబట్టీ మీరు ఊళ్ళో ప్రతి అమ్మాయినీ పడేయాలని ప్రయత్నిస్తుంటారు అని ప్రజలు ఊహిస్తారు.

మత్తు మందులు
మీరు మత్తు మందులు వాడుతున్నారన్న అనుమానంతో మీ ఇరుగు పొరుగు మిమ్మల్ని అదోలా చూస్తూ వుంటారు. వాళ్ళ లెక్క ప్రకారం, దీనికి మీరు 30 ఏళ్ళు దాటినా బ్రహ్మచారిగా ఉండడమే కారణం. బ్రహ్మచారులు ఎదుర్కొనే సమస్యల్లో ఇదొకటి.

డబ్బులు లేవు
ఇది చాలా తేలిక! మీరు పార్టీలకు, మత్తు మందులకు డబ్బంతా తగలేయడం వల్ల మీ దగ్గర సరిపడా డబ్బు లేదని వారు భావిస్తారు. డబ్బులు లేకపోతె ఆలి లేనట్లే!

సంఘజీవి కాదు
మీరు ఒంటరివారని, ఎవరితోనూ కలవడం ఇష్టం ఉండదని ప్రజలు భావించడం మొదలు పెడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు సంఘ జీవి కాదు.

స్వలింగ సంపర్కులు
బ్రహ్మచారుల గురించి ప్రజలు ఊహించే విచిత్రమైన విషయాల్లో ఇది ఒకటి. మీకు అమ్మాయిల కన్నా అబ్బాయిలు నచ్చుతారని, అందువల్లే మీకు పెళ్లి కావడం లేదని వారు ఊహిస్తారు.

అమ్మ కూచి
మీరు ఒంటరి గనుక, ఎవరితోనూ కలవారు కనుక, మీరు అమ్మకూచి అని వాళ్ళు తేల్చేస్తారు. దేవుడా! అమ్మకూచి అయితే తప్పేమిటి?

రహస్య ప్రేమాయణం
మీకు ఓ రహస్య ప్రేమాయణం వుంది కనుక మీరు చుట్టాలు తెస్తున్న సంబంధాలు వద్దంటున్నారని ప్రజలు భావిస్తారు.



Click it and Unblock the Notifications