Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్‌లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మగవాళ్లకు ఎప్పటికీ అర్థంకాని ఆడవాళ్ల విచిత్ర అలవాట్లు
మగవాళ్లు దేని గురించి ఎక్కువగా పరిశోధిస్తారో తెలుసా? స్త్రీలని అర్ధం చేసుకోవడానికి. ఎంత ప్రయత్నించినా స్త్రీ మనసులో ఏముందో మాత్రం మగవాళ్లకు అంతుచిక్కదు. స్త్రీలెప్పుడూ మగవారికి అంతుచిక్కని మిస్టరీనే.
స్త్రీలంటే స్త్రీలే, వారిని సృష్టి అధ్భుతంగా డిజైన్ చేసింది.హుందాతనం,చక్కదనం, దయ, కష్టపడే తత్వం లాంటి గుణాలు మగవారి కంటే కూడా సహజసిద్ధంగా స్త్రీలకే అబ్బుతాయి.మగవారికి స్త్రీలలో అర్ధంకాని కొన్ని విషయాలని చూద్దాము. స్త్రీల యొక్క కొన్ని అలవాట్లు మగవారికి అర్ధం కావు. అవేమిటంటే...

సెల్ఫీలకి బుంగమూతులతో పోజులివ్వడం:
మీరు కెమేరా చేత పట్టగానే స్త్రీలు అలా సూపర్ మోడల్స్‌లాగ ఎలా అయిపోతారో ఆ భగవంతుడికే తెలుసు. పోజులిచ్చేటప్పుడు బుంగమూతి పెట్టి వారిలోని సృజనాత్మకతని బయట పెడతారు.కావాలంటే మీరు వాదులాడుకునేటప్పుడెప్పుడైనా అకస్మాత్తుగా కెమేరా పట్టుకుని చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్ వెంటనే 12 రకాలుగా పోజులిచెస్తుంది.

గాసిప్స్:
అసలు వీరికి గాసిప్స్ అంటే ఎందుకు ఇష్టమో అస్సలు అర్ధం కాదు.కొంతమంది మగవారికి కూడ ఇది ఇష్టమైనదే అనుకోండి కానీ స్నేహితులతో కూర్చుని మంచి వేడి వేడి గాసిప్స్‌తో స్త్రీలు గొప్ప ఆనందాన్ని పొందగలరు.

టాయిలెట్లోకి గుంపుగా వెళ్ళడం:
అసలు వాష్‌రూంస్ లోకి స్త్రీలు అలా గుంపుగా ఎందుకు వెళ్తారో మగవారికి అస్సలు అర్ధం కాదు.అసలు వారు లోపల ఏమి చేస్తారు, ఏమి మాట్లాడూకుంటారు అంత గట్టిగా నవ్వుతూ?? వీటికి జవాబులు ఆ దేవుడికే తెలియాలి.

లావవ్వకూడదు కానీ అన్నీ తినాలనుకుంటారు:
అన్ని రకాల ఆహార పదార్ధాలూ స్త్రీలు తినాలనుకుంటారు కానీ లావయితే మాత్రం వారికి అస్సలు నచ్చదు.ఇది కొంచం విడ్డూరంగా లేదూ??హాయిగా తిని లావయినా బాధపదకూడదు లేదా ఫిగర్ ని కాపాడుకోవడానికి అస్సలు తినకూడదు, కానీ అన్నీ తింటూ కూడా లావవ్వకూడంటే ఎలా అని మగవారు అనుకుంటారు.

వారు కాదు అన్నారంటే:
మీ గర్ల్ ఫ్రెండుకి ముద్దిస్తాననండి, వెంటనే వద్దు అంటుంది కావాలి అని ఉన్నా కానీ.వద్దు అని చెప్పాలనుకుంటే కావాలి అంటారు. వారి జవాబులు ఎప్పుడూ మిస్టరీనే.

శత్రువులు, మిత్రులు:
స్త్రీలు ఒకరినొకరు చూసుకుని కౌగలించుకుని గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటారు కానీ వారి వెనకాల వారిని విమర్శిస్తారు.ఎందుకు??

ఫాల్స్ బాడీ ఇమేజ్:
సన్నగా ఉన్న ఆడపిల్లలేమో తాము లావుగా ఉన్నామనుకుంటూ డైటింగులు చేస్తారు. లావుగా ఉన్నవారేమో తాము సన్నగా ఉన్నామనుకుని నేను అందంగా ఉన్నానా అంటూ తరచూ భాగస్వామిని అడుగుతుంటారు.

బోలెడు దుస్తులు ట్రై చేసి ఒక్కటే ఎంచుకోవడం:
రోజు మొత్తం వెచ్చించి కొన్ని వందల జతలు ట్రై చేసి చివరికి ఒక్కటే కొనుక్కుంటారు. అసలు ఈ అలవాటు చూసి మగవారికి పిచ్చెక్కుతుంది.

నిజాయితీగా చెప్పే జవాబులు నచ్చవు:
మీ ఇంతకుమునుపు గర్ల్ ఫ్రెండ్ కంటే నేను అందంగా ఉన్నానా అని మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతుంది.పైగా నిజాయితీ చెప్పాలని హుకుం జారీ చేస్తుంది.ఒక వేళ మీరు నిజాయితీగా నీ కంటే ఇంతకుమునుపు అమ్మాయే అందంగా ఉంటుందని చెప్పారో మీరు ఇంట్లో నుండి బయటకి రావాల్సిందే.

రహస్యాలని దాచుకోలేరు:
మీ భార్య కాకుండా మీ పడకగది రహస్యాలు ఎవరికి తెలుసో తెలుసా?? ఆమె ప్రాణ స్నేహితురాలికి.ఆడవారు తమ ప్రాణ స్నేహితులతో అన్నీ చెప్తారు.ఎందుకో ఆ భగవంతునికే తెలియాలి.



Click it and Unblock the Notifications