Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా, రొమాంటిక్ గా మార్చే.. సింపుల్ వాస్తు టిప్స్..!!
ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో.. జీవితంతాం.. హ్యాపీగా, రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ.. దురదృష్టవశాత్తు.. కాలం గడుస్తున్న కొద్దీ.. భార్యాభర్తల మధ్య ఆసక్తి తగ్గుతోంది. తరచుగా గొడవపడటం, పోట్లాడటం, వాదించుకోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు.. భార్యాభర్తల మధ్య సమస్యలు.. లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్నాయి.
బిజీ లైఫ్, ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల.. ఇద్దరి మధ్య పోటీతత్వం, స్వార్థం, అసూయ, అహంకారం ఎక్కువ అవుతోంది. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, బిజీ షెడ్యూల్స్ కారణంగా.. సరదాగా గడిపే తీరిక లేకపోవడం వల్ల.. ఒత్తిడి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదాలకు కారణమవుతోంది.
అయితే.. ఇలాంటి సమస్యలేమీ లేకుండా.. ఇద్దరూ ప్రశాంతంగా, హ్యాపీగా రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే.. కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. ఇద్దరి మధ్య గొడవలు కాకుండా.. రొమాన్స్, లవ్ పెరగడానికి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు. మరి ఎలాంటి వాస్తు టిప్స్ ఫాలో అయితే.. వైవాహిక జీవితం లవ్లీగా, రొమాంటిక్ గా ఉంటుందో తెలుసుకుందాం..

లవ్ బర్డ్స్
లవ్ బర్డ్స్, మెరిడియన్ డక్స్ ప్రేమకు చిహ్నాలు. ఇలాంటి పెయిర్ ని.. మీ బెడ్ రూంలో పెట్టుకోండి. రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి.

సెక్స్ పై ఇంట్రెస్ లేనప్పుడు
కొంతమంది భార్యాభర్తలు సెక్స్ పై ఆసక్తి చూపించరు. ఇలాంటి ఫీలింగ్ మీ ఇద్దరిలో ఉంటే.. వాటర్ పెయింటింగ్స్ ని ఉపయోగించకండి. ఒకవేళ ఉంటే.. వెంటనే వాటిని తీసేయండి.

ఫ్లవర్ వాజ్
గ్రేట్ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే.. రెండు ఫ్లవర్ వాజ్ లను బెడ్ రూంలో పెట్టుకోండి. బెడ్ రూంలో ఫ్లవర్ వాజ్ లు పెట్టుకుంటే.. వైవాహిక జీవితమే కాదు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

గిన్నెలో రైస్
ఇద్దరిలోనూ ఒకరిపై మరొకరికి.. ఆసక్తి పెరగాలంటే.. ఒక అందమైన గిన్నెలో.. ప్యూర్ క్రిస్టల్స్, కొన్ని బియ్యం వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

క్రిస్టల్ ల్యాంప్స్
క్రిస్టల్ ల్యాంప్స్, రెడ్ లైట్ బల్బ్ లను బెడ్ రూమ్ లో నైరుతివైపు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది.

కర్టన్స్
రెడ్ కలర్ కర్టన్స్, కుషన్స్ ఉపయోగిస్తే.. చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఒకవేళ రెడ్ మరీ బ్రైట్ గా ఉంటుందని భావిస్తే.. పింక్ కలర్ ని ఉపయోగించినా.. మీ బాంధవ్యం చాలా అన్యోన్యంగా ఉంటుంది.

సెరామిక్ బౌల్స్
సెరామిక్ బౌల్స్ ని నైరుతి దిశగా.. మీ బెడ్ రూంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే.. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ గిన్నెలో చిన్న స్టోన్స్ లేదా క్రిస్టల్స్ పెట్టుకోవచ్చు. అలాగే.. రెడ్ కలర్ క్యాండిల్స్ పెట్టుకోవాలి. దీనివల్ల లవ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

బెడ్ రూమ్ డెకరేషన్
ఎల్లప్పుడూ బెడ్ రూమ్ అందంగా, నీట్ గా డెకరేట్ చేసి ఉండాలి. బెడ్ పక్కన ఉండే టేబుల్ పై అన్ని వస్తువులను చిందరవందరగా పడేయకూడదు. అలాగే.. దుమ్ము పట్టి ఉండరాదు.

హార్ట్ షేప్
మీ లైఫ్ రొమాంటిక్ గా ఉండాలంటే.. హార్ట్ షేప్ వస్తువును.. నైరుతి దిశగా పెట్టుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications