Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
భార్యాభర్తలు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్..!
రిలేషన్ లో కొన్ని సమస్యలు చాలా కామన్. కానీ యంగ్ కపుల్స్ వాళ్ల రిలేషన్ లో క్వాలిటీపై చాలా అనుమానం ఉంటుంది. చిన్న గొడవ వచ్చినా.. వెంటనే రిలేషన్ ని వదులుకోవాలని భావిస్తారు.
రిలేషన్ లో కొన్ని సమస్యలు చాలా కామన్. కానీ యంగ్ కపుల్స్ వాళ్ల రిలేషన్ లో క్వాలిటీపై చాలా అనుమానం ఉంటుంది. చిన్న గొడవ వచ్చినా.. వెంటనే రిలేషన్ ని వదులుకోవాలని భావిస్తారు. కానీ ఇలాంటి నిర్ణయం సరైనది కాదు.

అలాంటి విషయాలు ప్రతి ఒక్కరి రిలేషన్ లో చాలా కామన్. కాబట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. రిలేషన్ లో క్వాలిటీ ఉందని భావించినప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవాల్సి ఉంటుంది.
రిలేషన్ లో సమస్యలు కామన్. రిలేషన్ లో ఎలాంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయో తెలుసుకుందాం..

స్పార్క్
కొంతమంది ఎట్రాక్షన్ అనేది మొదట్లోనే ఉంటుంది. కానీ థ్రిల్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుందని భావిస్తారు. కానీ కొంతకాలం తర్వాత ఎట్రాక్షన్ తగ్గుతుంది. కానీ ప్రేమ, ఆప్యాయత మాత్రం ఇద్దరి మధ్యా ఉంటుంది. ఎట్రాక్షన్ అనేది టెంపరరీ, కానీ అఫెక్షన్ అనేది పర్మనెంట్. కాబట్టి.. ఇలాంటి విషయంలో గొడవ అవసరం లేదు.

ఈ మధ్య చిరాకుపడుతున్నారు
ప్రతి కపుల్స్ జీవితంలో ఇది కామన్. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అన్ని సందర్భాల్లో మీ పార్ట్ నర్ స్వీట్ గా, నైస్ గా ఉండరు. ప్రతిఒక్కరిలో మూడ్ లో మార్పులు వస్తుంటారు. చిరాకు పడుతూ ఉంటారు.

మనస్పర్ధలు
కొంతమంది కలిసి సమయం గడిపిన తర్వాత ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు కామన్. అలాంటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడి.. సమస్యలు పరిష్కరించుకోవాలి.

నిర్లక్ష్యం చేస్తున్నారు
జీవితంలో ప్రతి స్టేజ్ లోనూ మీపై చాలా ఎటెన్షన్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. కెరీర్ చాలెంజెస్, పిల్లలు కారణం ఏదైనా కావచ్చు.. మీ భాగస్వామి మీపై కావాల్సిన ఎటెన్షన్ పెట్టలేకపోవచ్చు. ఇది కామన్. కాబట్టి.. దీన్ని కూడా పరిష్కరించుకోవాలి.

శారీరక బంధం
జీవితాంతం శారీరక బంధం హ్యాపీగా, ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మీ భాగస్వామి పర్ఫామెన్స్ సరిగా లేదని.. విడిపోవడం సరికాదు. వాటిని కూడా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
